వత్తిడి ని తగ్గించే 5 మార్గాలు
ఆహారం:
మంచి ఆహారం కూడా వత్తిడి ని తగ్గిస్తుంది. బలమైన ఆహారం మన మెదడును చురుగ్గా వుండేలా చస్తుంది.
ఆహారం వల్ల శరీరం మొత్తం యాక్టివ్ అవుతుంది. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి.
ముఖ్యంగా విటమిన్లు, మినరల్స్, పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ వల్ల టెన్షన్ తగ్గే అవకాశం వుంటుంది.
విశ్రాంతి తీసుకోవాలి:
వరుసగా పనులు చేస్తూ ఉన్నాగానీ వత్తిడి పెరుగుతుంది. అందువల్ల దృష్టిని మరల్చుకోవాలి. పనిలో కాస్త బ్రేక్ తీసుకోవాలి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వార్తలకు దూరంగా ఉండాలి. పాజిటివ్ ఆలోచనలు పెంచుకోవాలి. పనిచసే మధ్య మధ్య పజిల్స్, బోర్డ్ గేమ్స్ ఆడుతుండాలి. ప్రకృతిలో తిరగాలి. ఓ కొత్త పుస్తకం చదవాలి. లేదా నచ్చిన వ్యాపకాన్ని చెయ్యాలి.
వ్యాయామం:
వ్యాయామం అనేది ఒత్తిడిని జయించేందుకు తిరుగులేని అస్త్రంగా చెప్పుకోవచ్చు. వాకింగ్, రన్నింగ్, మెట్లు ఎక్కడం, దిగడం, పిల్లలతో ఆటలు, సైక్లింగ్, పెంపుడు జంతువులతో ఆటలు, శరీరాన్ని కదిలించే చిన్న చిన్న ఎక్సర్‌సైజ్‌లు కూడా ఒత్తిడిని జయించేలా చెయ్యగలవు. వ్యాయామం చేసినప్పుడు బాడీలో ఎండోర్ఫిన్స్ రిలీజ్ అవుతుంది, ఇది పాజిటివ్ ఫీలింగ్స్‌ని పెంచుతుంది.
మానవ సంబంధాలు:
వీలైనప్పుడల్లా అందరితో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించాలి. ఫ్రెండ్స్‌తో మాట్లాడాలి. అభిప్రాయాలు షేర్ చేసుకోవాలి.
సన్నిహితులతో సమస్యల్ని పంచుకోవడం ద్వారా సాంత్వన లభిస్తుంది.
వీలైనంత ఒంటరిగా లేకుండా ప్రకృతితో గడపాలి. స్వచ్ఛమైన గాలిని పీల్చాలి. ఓకే చోట ఎక్కువసేపు ఉండకూడదు
తగినంత నిద్ర:
ఒత్తిడికి అనేక కారణాల్లో ఒకటి నిద్ర లేమి. ఆరోగ్యంగా వుండాలంటే మనం రోజుకు కనీసం 6 గంటలు పడుకోవాలి. అలాగే, విశ్రాంతి కూడా తీసుకోవాలి. మంచి నిద్ర వల్ల శరీరంలో అన్ని అవయవాలు ఎనర్జీ లెవెల్స్ పెంచుకుంటాయి. బ్రెయిన్ బాగా పనిచేసి, పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి. అందువల్ల ఒత్తిడిని చాలా వరకూ తగ్గించుకోవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి