WHAT IS CRYPTOCURRENCY AND BITCOIN
బిట్కాయిన్ అంటే ఏంటి? ఎలా పని చేస్తుంది?
ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన అంశాల్లో బిట్కాయిన్ కూడా ఒకటి. దీని విలువ రోజురోజుకు కొత్త రికార్డు స్థాయిను తాకుతోంది. 2007లో ప్రారంభమైన బిట్‌కాయిన్ ప్రస్థానం అనేక హెచ్చుతగ్గులకు లోనై అంతిమంగా దీని విలువ పెంచుకుంటూ వస్తోంది.
ఆశ్చర్యకరంగా 2020లో దీని విలువ 170% మేర పెరిగింది. ప్రస్తుతం బిట్ కాయిన్ విలువ 2021 ఏప్రిలో 56,267 డాలర్ల వద్ద ఉంది. అంటే భారతీయ కరెన్సీలో దాదాపు 43 లక్షల రూపాయలు,
ఈ క్రిప్టోకరెన్సీకి ఎందుకు ఇంత డిమాండ్? బిట్‌కాయిన్‌లో పెట్టుబడి సురక్షితమేనా? బిట్కాయిన్ వ్యవస్థ ఎలా పని చేస్తుంది? దీనిని ఎవరైనా నియంత్రిచగలరా? అనే విషయాలను తెలుసుకుందాం.
గత ఏడాది డిసెంబర్లోనే తొలిసారి 20 వేల డాలర్ల మార్క్ దాటిన బిట్కాయిన్, రెండు నెలల్లోనే 45 వేల డాలర్లపైకి చేరడం విశేషం.
నిజానికి చాలామందిలో క్రిప్టోకరెన్సీపై అనేక అనుమానాలు వున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. క్రిప్టోకరెన్సీ అనేది డిజిటల్ (వర్చువల్) కరెన్సీ. సాధారణ కరెన్సీలు (రూపాయి, డాలర్ వంటివి) భౌతికంగా చలామణి అవుతుంటాయి. క్రిప్టో కరెన్సీలు మాత్రం భౌతికంగా కనిపించవు, వాటిని ముట్టుకోలేం. ఇవి ప్రత్యేక సాఫ్ట్వేర్ కోడ్ల ద్వారా పని చేస్తుంటాయి. ఇవి పూర్తిగా డిజిటల్ రూపంలో మాత్రమే ఉంటాయి.
బిట్కాయిన్ జపాన్‌కు చెందిన 'షాతోషీ నాకామోటో' అనే టెకీ రూపొందించినట్లు ప్రచారంలో ఉంది. అయితే దీనిపై స్పష్టత లేదు. 2009లో బిట్కాయిన్ మనుగడలోకి వచ్చింది.
బ్లాక్ చైన్ సాంకేతికత అనేది క్రిప్టోకరెన్సీకి మూలాధారాం. ప్రస్తుతం బిట్కాయిన్, ఇథీరియం, స్టెల్లార్, రిపుల్, డాష్ ఇలా చాలా ఇతర క్రిప్టోకరెన్సీలు మనుగడలో వున్నాగానీ.. వీటన్నింటిలో బిట్కాయిన్ అత్యంత ఆధరణ పొందిన క్రిప్టో కరెన్సీ.
క్రిప్టోకరెన్సీ ప్రస్తావన వచ్చినప్పుడు, లేదా బిట్కాయిన్ గురించి ప్రస్తావన వచ్చినపుడల్లా మనం చాలా సార్లు క్రిప్టోగ్రఫీ టెక్నిక్స్, బ్లాక్ చైన్ సాంకేతికత గురించి వింటూనే ఉంటాము. బ్లాక్‌చైన్ అనేది డేటా బైస్ ఆధారంగా పని చేసే ఓ ప్రత్యేక సాంకేతికత. ఇందులో సమాచారం అనేది బ్లాకులుగా విభజన చెందివుంటుంది. ఆ సమాచారం మొత్తం ప్రపంచవ్యాప్తంగా వేరువేరు సర్వర్లలో నిక్షిప్తమై ఉంటుంది. ఇలా ఒక సర్వర్‌కు మరో సర్వర్ అనుసంధానమై ఈ వ్యవస్థ పని చేస్తుంది. ఈ కారణంగా బ్లాక్ చైన్ రూపంలో నిక్షిప్తం చేసిన సమాచారాన్ని హ్యాక్ చెయ్యడం లేదా తస్కరించడం దాదాపు అసాధ్యం. ఈ కారణంగానే క్రిప్టోకరెన్సీలను ఎవరూ నియంత్రించడం జరగదు. అందుకే క్రిఫ్టో కరెన్సీ అనేది అత్యంత సురక్షితమనే వాదన కూడా ఉంది.
బిట్కాయిన్ విలువ ఎందుకు అంతగా పెరుగుతోంది?గత పదేళ్ల వ్యవధిలో బిట్కాయిన్ బెస్ట్ పెర్ఫార్మింగ్ అసెట్‌గా నిలిచింది. ఇన్వెస్టర్లు దీన్ని ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కోసం లావాదేవీలు ప్రారంభిస్తున్నారు.
చాలా కార్పొరేట్ సంస్థలు, సంస్థాగత పెట్టుబడిదారులు క్రిప్టోకరెన్సీలపై దృష్టిసారిస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యంగా మార్చుకోవడం కోసం బిట్కాయిన్లపై అధికంగా పెట్టుబడులు పెడుతున్నారు. బిట్కాయిన్ మార్కెట్ ఇతర మార్కెట్లతో పోలిస్తే చాలా చిన్నది కాబట్టి బిట్కాయిన్ విలువ ఎప్పుడూ స్థిరంగా ఉండదు.
బిట్కాయిన్ పొందడం ఎలాగో తెలుసుకుందాం.
బిట్‌కాయిన్లను సృష్టించే ప్రక్రియను మైనింగ్ అంటారు. బిట్‌కాయిన్ మైనింగ్‌లో భాగంగా శక్తివంతమైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి క్లిష్టమైన అల్లారిథమ్‌లను పరిష్కరించి లావాదేవీలను వెరిఫై చేస్తారు. మైనింగ్ చేసేవాళ్లు విజయవంతంగా ఈ ప్రక్రియలో గెలుపొందితే వారికి కొన్ని బిట్‌కాయిన్లను అందజేస్తారు.
ఎంతో క్లిష్టమైన క్రిప్టోగ్రఫీ సమస్యలను పరిష్కరించడం ద్వారా కొత్త బిట్‌కాయిన్లను రివార్డుగా పొందొచ్చు.
బంగారం, వజ్రాల మారిదిగానే బిట్‌కాయిన్లు కూడా చలా పరిమితంగా లభ్యమవుతాయి. మరోవైపు ప్రజలు వీటిని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అందువల్ల సరఫరా, డిమాండ్ సూత్రం ప్రకారం దీనికి గిరాకీ పెరుగుతోంది.
రూపాయికి 100 పైసలు ఎలానో.. ఒక బిట్‌కాయిన్‌కు 100 షాతోషీలు ఉంటాయి. ప్రస్తుతం బిట్‌కాయిన్ల విలువ భారీగా పెరిగిన కారణంగా ఒక బిట్కాయిన్ కొనడం చాలా కష్టం. అలాంటి వారు షాతోషీలనూ లేదా, అందులో కొంత భాగాన్ని కొనుగోలు చేయడం ద్వారా కూడా పెట్టుబడి పెట్టొచ్చు.
ప్రభుత్వాల నియంత్రణ ఉండదు కాబట్టి కొంత మంది బిట్‌కాయిన్లను ఇష్టపడుతుంటారు. అన్ని లావాదేవీలు నమోదు అవుతాయి కాబట్టి వాటిని ఎవరు చేశారో బయటకు తెలియదు. తమ లావాదేవీల వివరాలు బయటకు తెలియకూడదు అనుకునేవారు బిట్‌కాయిన్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
క్రిప్టోకరెన్సీలపై ట్రేడింగ్ చేసేటప్పుడు ఎలాంటి నిబంధనలు, మార్గదర్శకాలు లేవు కాబట్టి ఏదైనా వివాదాలు తలెత్తితే.. ప్రభుత్వం నుంచి సహాయం లభించదు. కాబట్టి ఎలాంటి చట్టాలు అతిక్రమించకుండా ట్రేడింగ్ చెయ్యడం ముఖ్యం.
భారత్‌లో బిట్కాయిన్ కొనుగోలు కొనుగోలు/అమ్మకానికి పలు ఎక్స్ఛేంజీలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో వాజిర్ ఎక్స్, కాయిన్‌స్విచ్, జెబ్‌పే, కాయిన్‌డీసీఎక్స్ ముఖ్యమైనవి.
ఈ ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్ అక్కౌంట్ పొందిన తర్వాత క్రిప్టోకరెన్సీలపై పెట్టుబడులు పెట్టొచ్చు.కానీ భారత్‌లోని క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలు ఏ ప్రభుత్వ నియంత్రణ ఫ్రేమ్‌వర్క్ కిందకు రావు. భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీటికి లైసెన్సులు సైతం అవసరం లేదు. ప్రస్తుతం ఇవన్నీ స్వీయ-నియంత్రణ సంస్థ ఫ్రేమ్‌వర్క్ అనుగుణంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.
బిట్కాయిన్ ట్రేడింగ్ అకౌంట్ తెరిచేందుకు క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలన్నీ దాదాపుగా ఒకే తరహా సమాచారాన్ని సేకరిస్తాయి. బ్యాంక్ ఖాతా, కేవైసీ వివరాలతో పాటు మొబైల్ నెంబర్‌తో బిట్కాయిన్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. కేవైసీ వెరిఫికేషన్ కోసం ఆధార్ లేదా పాన్ కార్డులలో ఏదైనా ఉపయోగించుకోవచ్చు. రిజిస్టర్డ్ బ్యాంక్ ఖాతా నుంచి నగదును ట్రేడింగ్ అకౌంట్‌కు బదిలీ చేసుకోవచ్చు.
భారత్‌లో తమ బిట్కాయిన్ పెట్టుబడి లాభాలపై క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ చెల్లించాలి. ఒకవేళ బిట్కాయిన్ అమ్మకం, కొనుగోళ్లే ప్రధాన కార్యకలాపాలై ఉంటే, వ్యాపారాలపై విధించే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి