Garlic-Ayurveda
వెల్లుల్లితో ఉపయోగాలు
వంటల్లో మాత్రమే కాదు. ఆరోగ్యాన్ని అందించడంలో కూడా వెల్లుల్లికి ఒక ప్రత్యేక స్థానం ఉంది.
వెల్లుల్లి మొత్తం శరీరంలోని 22 రకాల వ్యాధులనుంచి రక్షణ ఇస్తుంది. అతి ప్రాచీనమైన ఆయుర్వేద గ్రంథాలలో వెల్లుల్లి ప్రస్తావన ఉంది.
వెల్లుల్లిలో ఔషధ గుణాలు చాలా ఎక్కువ. ప్లేగు వ్యాధిని తగ్గిస్తుంది. కొవ్వుని కరిగిస్తుంది. అలాగే కడుపులోని చెడు బ్యాక్టీరియాని నాశనం చేస్తుంది. కోలెస్టరాల్‌ని, కేన్సర్ ను అదుపులో వుంచుతుంది. అధిక రక్త పోటుని నివారిస్తుంది. ఇంకా వెల్లుల్లి జీర్ణశక్తిని పెంచుతుంది.
ఇక ఆస్తమా, శ్వాస పీల్చుకోవడం వల్ల ఇబ్బంది వంటి రుగ్మతలను తగ్గించడానికి వెల్లుల్లి చక్కగా ఉపయోగపడుతుంది. నోటి వ్యాధులకు వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. సుగర్ వ్యాధిగ్రస్తుల రక్తంలో చక్కెరస్థాయిలను నియంత్రిస్తుంది.
వెల్లుల్లిలో అనేక పోషకాలు ఇంకా ఔషధ గుణాలు ఉంటాన్నాయి.
ఇలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందాలంటే వెల్లుల్లిని ఏ విధంగా తీసుకోవాలో తెలుసుకుందాం.
రోజూ ఉదయాన్నే పరగడుపునే రెండు వెల్లుల్లి రెబ్బలను నేరుగా అలాగే నమిలి తినవచ్చు.
ఉదయాన్ని పరగడుపున వెల్లుల్లి రసం తాగవచ్చు.
పచ్చిగా తినలేనివారు వెల్లుల్లి రెబ్బలను కాల్చి తినవచ్చు.
పెనం మీద కొంచెం నెయ్యి వేసి, అందులో వెల్లుల్లి వేయించి తినవచ్చు.
వెల్లుల్లి కషాయంలా చేసుకుని తాగవచ్చు. ముందుగా రెండుమూడు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని నీటిలో మరిగించి ఆ నీటిని రోజుకు 2 సార్లు కప్పు మోతాదులో తాగవచ్చు.
ఇలా వెల్లుల్లిని ఏదో ఒక రూపంలో తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది.
వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
లివర్ సమస్యలున్నారు వెల్లుల్లి తింటే ఎంతో మంచిది.
వెల్లుల్లిని తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి.
వెల్లుల్లి టాబ్లెట్స్ రూపంలో కూడా మార్కెట్ లో లభిస్తున్నాయి. రోజూ తినే ఆహారంలో వెల్లుల్లిని ఏదొక రూపంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా జీవించవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి