బరువుని తగ్గించే సోంపు వాటర్
దాదాపు ప్రతీ ఇంటిలో సోంపు గింజల్ని ఉపయోగిస్తూనే ఉంటారు. శరీర బరువును తగ్గించడానికి కూడా సోంపు ఉపయోగపడ్తుంది.
సోంపును సాధారణంగా భోజనం తర్వాత మౌత్ ఫ్రెషనర్ గా ఇంకా, జీర్ణక్రియ సాఫీగా జరిగేందుకు తీసుకుంటాం. నిజానికి దీనిని రోజులో ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. ఇది ఆస్తమా, ఉదర సంబంధ ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
సోంపుతో బరువు ఎలా తగ్గుతుంది?
సోంపు లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి. తద్వారా బరువు తగ్గడానికి సహాయపడతాయి. అంతే కాకుండా ఇవి జీర్ణక్రియ, జీవక్రియలో సహాయపడతాయి. ఇంకా ఆకలిని కూడా తగ్గిస్తుంది.
ఉదయాన్నే ఒక గ్లాసు సోంపు నీరు తాగడం వల్ల కడుపు నిండిన భావన వస్తుంది. దీంతో ఎక్కువ ఆహారాన్ని తీసుకోవాలనే కోర్కె తగ్గుతుంది.
సోంపు వాటర్
ఒక టీస్పూన్ సోంపు గింజలను తీసుకుని, ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టుకోవాలి. ఈ నీటిని పరగడుపున ఉదయం నిద్ర లేవగానే తాగడం వల్ల మంచి ప్రయోజనం వుంటుంది.
సోంపు జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో సోంపు వాటర్ తీసుకుంటే చాలా మంచింది.
సోంపులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటి ఉదయాన్నే తీసుకుంటే ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉంచుతుంది. ఎక్కువగా తినకుండా నిరోధిస్తుంది. దీంతో శరీర బరువు కచ్చితంగా తగ్గుతుంది.
ఫెన్నెల్ ఒక సహజ డిటాక్సిఫైయర్. అందువల్ల భోజనం చేసిన వెంటనే దీనిని తీసుకుంటే బాగా పనిచేస్తుంది. ఇది మన శరీరం నుంచి అనేక టాక్సిన్‌లను తొలగిస్తుంది.
సోంపులో జింక్, భాస్వరం, మాంగనీస్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఇది ఊబకాయంతోపాటు ఇతర వ్యాధులు రాకుండా కాపాడుతాయి.
ఎస్ట్రాగోల్, ఫెంచాన్, అనెథోల్ వంటివి సోంపులో ఉంటాయి. ఇవి తిన్న ఆహారం చక్కగా జీర్ణం కావడంతో సహాయపడుతాయి.
సోంపు నీరు తాగడం వలన శరీరంలో ఉండే అదనపు నీరు తొలగిపోతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి