Cholesterol Drug
చెడు కొలెస్ట్రాల్‌కు ఇంజెక్షన్ రూపంలో సరికొత్త ఔషధం..
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ప్రస్తుతం స్టాటిన్స్ అనే ఔషధాన్ని ఇస్తుంటారు. అయితే దీనిని తరచూ తీసుకోవాల్సి వుంటుంది. కానీ కొత్తగా వచ్చిన ఓ ఔషదం సంవత్సరానికి రెండుసార్లు తీసుకుంటే సరిపోతుంది.
శరీరంలోని చెడు కొలస్ట్రాల్ తో భాదపడ్తున్న రోగులకు ఓ గుడ్‌న్యూస్ వచ్చింది.
ఇంజెక్షన్ రూపంలో అందుబాటులోకి వచ్చిన ఈ మెడిసిన్‌తో చెడు కొలెస్ట్రాల్ బాధితులకు విముక్తి లభించే అవకాశం వుందని నిపుణులు పేర్కొంటున్నారు.
దీనికి ‘ఎక్లిసిరెన్’ అని పేరు పెట్టారు. అయితే ఈ ఇంజెక్షన్‌ను సంవత్సరానికి రెండుసార్లు తీసుకోవాలి. దీనిని యూకే ఆరోగ్య సంస్థ ఎన్‌హెచ్‌ఎస్ బుధవారం నుంచి ప్రారంభించింది. నిపుణులు దీనిని ‘గేమ్ చేంజింగ్’ ట్రీట్మెంట్ గా పేర్కొంటున్నారు.
కొత్త ఇంజెక్షన్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది..
ఈ కొత్త ఇంజెక్షన్ వల్ల చెడు కొలెస్ట్రాల్50 శాతంవరకు తగ్గిపోతుంది.
రక్త నాళాలలో కొవ్వు ఎక్కువగా పెరుకుపోయినపుడు స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ధమనులకు తీవ్ర నష్టం కలిగిస్తుంది.
చెడు కొలెస్ట్రాల్‌తో ఇబ్బంది పడే వారు ప్రతీ 6 నెలలకు ఎక్లిసిరిన్ ఇంబెక్షన్ వేసుకోవాల్సి ఉంటుంది. దీనివలన తరచూ తీసుకునే కొలెస్ట్రాల్ మెడిసిన్ నుంచి ఉపశమనం లభించనుంది. కొత్త ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత రోగులలో కొలెస్ట్రాల్ 50 శాతం వరకు తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇది గుండె జబ్బులను నిరోధించి, ప్రాణాలను కాపాడేందుకు ఎంతో ఉపయోగకరంగా వుంటుందని తెలుస్తోంది. ఈ కొలెస్ట్రాల్ ఇంజెక్షన్ స్టాటిన్స్ కంటే చాలా ప్రభావవంతమైనది. కొన్ని కారణాలతో మెడిసిన్ తీసుకోలేని వారు కూడా ఈ ఇంజెక్షన్‌ను వేసుకోవచ్చు.
ఇంజెక్షన్ ఎలా పనిచేస్తుంది..
ఈ ఇంజెక్షన్ PCSK9 అనే ప్రోటీన్‌ను నిరోధించడం ద్వారా కాలేయం, రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. PCSK9 ప్రోటీన్ కారణంగా శరీర అవయవాలు కొలెస్ట్రాల్‌ను తొలగించలేకపోతుంటాయి. కొత్త ఇంజెక్షన్‌తో ఈ ప్రోటీన్‌ను అడ్డుకోవడం చాలా సులభం.
దీనివలన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గడంతో, వ్యాధులు సంభవించే ప్రమాదం కూడా తగ్గుతుంది.
ఇంజెక్షన్ ధర..
ఒక ఇంజెక్షన్ ఖరీదు దాదాపు రూ .2 లక్షలు వుండొచ్చని అనుకుంటున్నారు . దీనిని సంవత్సరానికి రెండుసార్లు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏటా దాదాపు రూ .4 లక్షలు ఇంజెక్షన్‌ల కోసం చెల్లించాల్సి ఉంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి