google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: ఆగస్టు 2021

31, ఆగస్టు 2021, మంగళవారం

డయాబెటిక్ రోగులకు ఉపయోగపడే పెరటి మొక్కలు Backyard plants that useful for diabetic patients.

 డయాబెటిక్ రోగులకు ఉపయోగపడే పెరటి మొక్కలు. 

శరీరంలో ఇన్సూలిన్ తక్కువగా విడుదలైనప్పుడు మధుమేహం సమస్య వస్తుంది. మారుతున్న జీవనశైలితో ఊబకాయం, ఒత్తిడి వంటి సమస్యలతో  డయాబెటిక్ ప్రమాదం తొందరగా వచ్చే అవకాశం వుంటుంది.

ప్రపంచంలో దాదాపు 45 కోట్ల మంది డయాబెటిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు.  ఒక్కసారి డయాబెటిక్ బారీన పడితే నియంత్రణ చాలా కష్టమవుతోంది. నిత్యం మందులతో సహజీవనం చేయాల్సి వస్తోంది.

అయితే కేవలం కెమికల్ ట్యాబ్లెట్స్ మాత్రమే కాకుండా.. ఆయుర్వేద పద్దతులను అనుసరించడం ద్వారా కూడా డయాబెటిక్ సమస్యను నియంత్రించవచ్చు. ముఖ్యంగా మన ఇంట్లోనే కనిపించే కొన్ని మొక్కల ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు. 

వాటి గురించి తెలుసుకుందాం.

కలబంద మొక్క.

aloe vera plant for diabetic patients


కలబంద చాలా సమస్యలకు నివారిణి గా ఉపయోగపడ్తుంది. దీని లోపలి గుజ్జును శుభ్రం చేసుకుని కొద్దికొద్దిగా అలాగే తీసుకోవచ్చు. ఇది డయాబెటిక్ రోగులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రక్తంలో షుగర్ లెవల్స్‏ను కంట్రోల్ చేయడానికి సహాయపడే కొన్ని పదార్థాలు ఇందులో ఉన్నాయి. రక్తంలో గ్లూకోజ్ మొత్తాన్ని నియంత్రించడానికి కలబంద గొప్పగా పనిచేస్తుంది.

ఇన్సులిన్ ప్లాంట్.

Insulin Plant for Dibetic people


కాస్టస్ ఇగ్నెయస్ లేదా స్పైరల్ ఫ్లాగ్ అని పిలిచే ఈ ఇన్సులిన్ మొక్కకు ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్క డయాబెటిక్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మొక్క ఆకులు పుల్లగా ఉంటాయి. ఈ ఆకులను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించవచ్చు.

స్టెవియా ప్లాంట్.

stevia plant for diabetic patients


స్టెవియా మొక్క డయాబెటిక్ రోగులకు చాలా ఉపయోగపడుతుంది.. దీని ఆకులు తియ్యగా ఉంటాయి.ఈ ఆకులను పొడి చేసి టీ, లేదా షర్భత్‏లలో చక్కెరగా ఉపయోగించవచ్చు. దీని ఆకులు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఉపయోగపడతాయి. ఇందులో జీరో కేలరీలు ఉంటాయి. అలాగే సుగర్ వ్యాధిగ్రస్థుల శరీరంలోని కేలరీలను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది.

 వేప ఆకులు.

neem leaves help diabetic patients


డయాబెటిస్ ను నియంత్రించడంలో వేప అనేది దివ్యఔషదం. ఆయుర్వేదంలో వేప ఆకులకు చాలా ప్రాముఖ్యత ఉంది. వేప ఆకులలో గ్లైకోసైడ్స్, ఇంకా అనేక యాంటీ-వైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ మొత్తాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.


30, ఆగస్టు 2021, సోమవారం

ఇంజనీరింగ్ విద్యార్థులకు అత్యంత ఉపయోగకరమైన వెబ్‌సైట్‌లు Best websites for Engineering Students

WEBSITES FOR ENGINEERING STUDENTS


ఇంజనీరింగ్ విద్యార్థులకు అత్యంత ఉపయోగకరమైన వెబ్‌సైట్‌లు Best websites for Engineering Students

1. ఇంజినీరింగ్.కామ్  Engineering.com

 ఇది ఇంజనీరింగ్ మరియు దాని అప్లికేషన్, కాన్సెప్ట్‌ల వివరణ, సూత్రాలు, సాఫ్ట్‌వేర్ ట్యుటోరియల్స్, మరియు వీడియో ట్యుటోరియల్స్ అందిస్తుంది. అంతేకాకుండా, వివిధ విభాగాలు మరియు సంబంధిత ఇంజనీరింగ్ ఉద్యోగాల జాబితాను తెలియజేస్తుంది.  ఇంటర్వ్యూలను క్రాక్ చేయడానికి చిట్కాలు కూడా ఈ సైట్‌లో విధ్యార్థులకు లభిస్థాయి. ఇంకా ఎలక్ట్రానిక్స్, 3 డి ప్రింటింగ్, సాఫ్ట్‌వేర్ డిజైనింగ్, గేమ్‌లు, పజిల్స్ లైబ్రరీలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

2.  స్టాన్‌ఫోర్డ్ ఇంజనీరింగ్ ఎవ్విరీవేర్  Stanford Engineering Everywhere

స్టాన్‌ఫోర్డ్ ఇంజనీరింగ్ ఎవిరీవేర్ అనేది యుఎస్ అంతటా విద్యార్థులకు కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రాధమిక విధ్య ను నేర్చుకోవడానికి, స్టాన్‌ఫోర్డ్ అండర్ గ్రాడ్యుయేట్లు అధ్యయనం చేసే  కోర్సుల వివరాలను  అందించడానికి రూపొందించబడిన ఉచిత వెబ్ సైట్. ఈ వెబ్ సైట్ లోని మెటీరియల్స్ విథ్యార్థులకే కాకుండా విద్యావేత్తలకు కూడా అందుబాటులో ఉన్నాయి.  కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఎవరికైనా ఉచితంగా అందుబాటులో ఉండేలా క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ కింద అందుబాటులో ఉంచబడ్డాయి.

3. ఇంటరెస్టింగ్ ఇంజనీరింగ్ Interesting Engineering

 ఒక సీనియర్ ప్రొఫెసర్ ద్వారా నడపబడే వెబ్‌సైట్ లో  ఇంజనీరింగ్‌కు సంబంధించిన  సమస్యలను మరియు సందేహాలను పంపగల విభాగాన్ని కలిగి ఉంది.  ఇంజనీరింగ్ పరిశోధన మరియు ఆసక్తికరమైన ఇంజనీరింగ్ విషయాలపై ఇతర ట్యుటోరియల్స్ కోసంలను ఈ సైట్ ను  చూడవచ్చు.

4. ఆర్డునో Arduino

 ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విద్యార్థులు తప్పకుండా తెలుసుకోవాల్సిన వెబ్ సైట్ ఆర్డునో. ఆర్దునొ అనేది  ఉపయోగించడానికి చాలా సులభమైన, సౌకర్యవంతమైన వెబ్ సైట్. ఇందులో కొనుక్కోవడం కోసం వీలుగా ఉండే మెటీరియల్స్ అలాగే ఉచిత ఆన్‌లైన్ వీడియో ట్యుటోరియల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.   ఎలక్ట్రానిక్స్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌ ఫ్రెషర్స్ కి ఇది ఉత్తమమైన వెబ్ సైట్.

5.  యం ఐ టి ఓపెన్ కోర్స్ వేర్ MIT Open Course Ware

మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దాని దాదాపు అన్ని కోర్సులకు సంబంధించి పాఠాలకు ఈ వెబ్ సైట్ ఆన్‌లైన్ యాక్సెస్‌ను అందిస్తుంది,  విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అపరిమిత డౌన్లోడింగ్ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లో  మెకానికల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మరియు కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, మేనేజ్‌మెంట్ మరియు లిబరల్ ఆర్ట్స్ ఉన్నాయి. ఈ సైట్ అందించే సమాచారం విస్తృతంగా   విద్యార్థులకు సహాయపడుతుంది. ఈ వెబ్ సైట్ ప్రధానంగా సైన్స్, టెక్నాలజీ మరియు ఇంజనీరింగ్ కోర్సులకు సంబందించినదే కానీ, ఇందులోని ఆన్‌లైన్ కోర్సు మెటీరియల్స్ కంప్యూటర్ సైంటిస్టులు మరియు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు కూడా ఎంతో ఉపయుక్తమైనవి. 

6.W3 skools

ప్రోగ్రామింగ్ మరియు కోడింగ్ లాంగ్వేజ్‌ల పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం అత్యుత్తమమైన వెబ్ సైట్ w3 school. AJAX, SQL, ASP, CSS, జావాస్క్రిప్ట్ మరియు HTML మార్కప్ కోడ్‌పై సులభంగా అర్థం చేసుకునే పద్దతిలో లోతైన ట్యుటోరియల్‌లను అందిస్తుంది. ఇంజనీరింగ్ విద్యార్ధులు తమ తమ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మరియు వారు ఎంచుకున్న వృత్తిలో విజయం సాధించడానికి అవసరమైన సమాచారాన్ని సంపూర్ణం గా. డబ్ల్యూ 3 స్కూల్స్ వెబ్‌సైట్ సహజమైన మార్గ నిర్ధేశం చేస్తుంంది,   కొత్తవారు తమ డిజైన్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి, మరియు వారి స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక కంప్యూటింగ్ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన సమాచారాన్ని పూర్తిగా అందజేస్తుంది.

7. కోడ్‌కాడమీ Codecademy

కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్‌లో అత్యంత వినూత్నమైన విద్యా సైట్‌లలో ఒకటైన కోడ్‌కాడమీ ప్రొఫెషనల్ స్థాయిలో కోడ్ నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులకు రెండు రెండు విధాలుగా సప్పోర్ట్ను అందిస్తుంది.  ప్రాథమిక కోర్సు  వెబ్‌సైట్ ద్వారా ఉచితంగా లభిస్తుంది.  ప్రొఫెషనల్ అకడమిక్ అడ్వైజర్ల సహాయం కోరుకునే విద్యార్థులు నెలవారీ రుసుముతో కోడ్‌కాడమీ ప్రో కి అప్‌గ్రేడ్ చేయవచ్చు. విద్యార్థులు తక్కువ ఖర్చుతోనే ఉపయోగకరమైన నాణ్యమైన విధ్యను పొందవచ్చు. 

8. ఇంజనీర్ గర్ల్ Engineer Girl

ప్రత్యేకంగా  ఐటి రంగం పట్ల ఆసక్తి ఉన్న మహిళల కోసం తయరుచేయబడిన వెబ్ సైట్ ఇది.  ఇది మహిళా ఇంజనీర్‌కి కెరీర్ గైడ్‌గా ఉన్న సైట్.  ఇది టెక్నాలజీ పోటీలు మరియు ఇతర ఇంజనీరింగ్ వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందిస్తుంది. ఇందులో "ఉమెన్ ఇంజనీర్స్" విభాగం మరియు "కెరీర్" విభాగం వుంటుంది. మహిళలకు ఇంజనీరింగ్ మరియు ఉద్యోగావకాశాల  గురించి సమాచారాన్ని అందిస్తుంది.

9. ఈ ఫండా  Efunda

ఈ ఫండా  ఇంజనీర్ల కోసం అన్ని సూత్రాలు మరియు ముఖ్యమైన విషయజ్ఞానాన్ని  కలిగి ఉంది. ఇందులోని డైరెక్టరీ విభాగం వివిధ అంశాలపై ప్రాథమిక జ్ఞానాన్ని అందిస్తుంది. మ్యాగజైన్ విభాగంలో  వివిధ మ్యాగజైన్‌ల నిల్వ వుంటుంది. ఇంజనీరింగ్ విద్యార్థులకు భౌతిక శాస్త్రం, గణితం మరియు రసాయన శాస్త్రాల గురించి ఈ సైట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది,   డైలీ ఫార్ములాలు, యూనిట్ కన్వర్షన్ లెక్కలు మొదలైనవి ఒకే చోట జాబితా చేయబడి ఉంటాయి. ఇందులో ఉన్న మరొక గొప్ప విశేషం కాలిక్యులేటర్ విభాగం, ఇది ఇంజనీరింగ్ విధ్యార్థులు లెక్కించడానికి ఆన్‌లైన్ లో వున్న  గొప్ప సాధనం.


అత్యంత చవకైన స్మార్ట్‌ఫోన్‌ "జియోఫోన్‌ నెక్ట్స్‌"..!! Jio phone next

  

jiophone next, jio smart phone, smart phone jio, lowest price smart phone


అత్యంత చవకైన స్మార్ట్‌ఫోన్‌  త్వరలో జియోఫోన్‌ నెక్ట్స్‌..!!

రిలయన్స్‌ జియో ఇప్పుడు మరో సంచలనానికి తెరతీయనుంది. 

ప్రపంచంలో అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ జియోఫోన్ నెక్ట్స్ jio phone nextను సెప్టెంబర్‌ 10న ముఖేష్ అంబానీ మార్కెట్‌లో విడుదల చేయనున్నారు. ఈ ఫోన్‌ కొనుగోలు చేసేందుకు ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  కొనుగోలుదారుల ఆసక్తిని గమనించిన కంపెనీ  ఈ ఫోన్‌కి ప్రీ బుకింగ్స్‌ పెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వచ్చే వారం నుంచి ప్రీ బుకింగ్స్‌ ప్రారంభం కానున్నట్లు జియో వర్గాలు చెబుతున్నాయి. 

ఫోన్‌ ధర ఎంతంటే..

గత జూన్ నెలలో జరిగిన 44వ రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముకేష్ అంబానీ జియోఫోన్ నెక్ట్స్  ఫోన్ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈఫోన్‌ ఫీచర్లు, ధర ఎంత ఉంటుందనే దానిపై అధికారకమైన సమాచారం లేనప్పటికీ ఈ ఫోన్ రూ.3,500 వుండొచ్చని తెలుస్తోంది.

ఈ ఫోన్‌ ఫీచర్స్‌..

జియో ఫోన్ నెక్స్ట్  5.5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే, 4జీ ఓఎల్ టీఈ డ్యూయల్ సిమ్, 2/3జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 215 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 11  13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2,500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.

టెలికాం రంగంలో మొదటి స్థానంలో ఉన్న జియో తన యొక్క యూజర్లను పెంచేందుకుగాను   రూరల్‌ ఇండియాని టార్గెట్‌ చేస్తూ గూగుల్‌తో కలిసి తక్కువ ధరలోనే ఈ జియోఫోన్ నెక్ట్స్ ను మార్కెట్‌ లో విడుదల చేయనుంది.

గుర‌క స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డాలంటే ., snoring problem

  



గుర‌క  స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డాలంటే SNORING


నిద్రపోయే సమయలో గురక పెట్టే అలవాటు చాలా మందిలో ఉంటుంది. గురక వలన పక్కన ఉన్న మిగతావారుకూడా చాలా ఇబ్బందులకు గురౌతుంటారు.

గురక చాలా అసౌకర్యమైన నిద్రను కలగజేస్తుంది. కొన్ని పరిశోధనలలో గురక వలన గుండె సంబంధ వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం వుందని తెలిసింది.

 గురక రావడానికి ప్రధాన కారణాలు, ఇంకా  గురక నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే ఏమేమి  చిట్కాలు వున్నాయో తెలుసుకుందాం 

గుర‌క ఎందుకు వ‌స్తుంది?

నిద్రపోయే  సమయంలో గాలి ముక్కుల నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే మార్గంలో అడ్డంకులు వున్నత్లైతే అప్పుడు గురక వస్తుంది. 

అలాగే ఆ సమయంలో నోటి ద్వారా శ్వాస తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఆ మార్గంలో కూడా అవాంతరాలుంటే అప్పుడు కుచించుకుపోయిన మార్గం నుంచి గాలి వెళ్లాల్సి ఉండడంతో అది గురకకు దారితీస్తుంది. 

వాస్తవానికి గురక రావడానికి మరెన్నో కారణాలు వున్నాయి. మానసికపరమైన ఒత్తిడి, టెన్షన్ కూడా గురకకు కారణం అవుతాయి.

సాధారణంగా ముక్కుల ద్వారా గాలి తీసుకుంటాం. కానీ, నాసికా మార్గాల్లో అడ్డంకుల వల్ల కొందరు నోటితో శ్వాస తీసుకుంటుంటారు. అలర్జీలు, సైనస్ ఇన్ఫెక్షన్, ముక్కులోపలి భాగం వాచివుండటం, అడినాయిడ్స్ అన్నీ కూడా శ్వాస మార్గానికి అడ్డంకుని కలిగిస్తాయి.

అలాగే వయసు పెరుగుతున్నకొద్దీ  గొంతు భాగం సన్నబడుతుంది. దీనివల్ల గురక రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మహిళలతో పోలిస్తే పురుషుల్లో గురక సమస్య ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే పురుషులలో మద్యం, పొగతాగడం లాంటి అలవాట్లు వుండటం వల్ల, లేదా కొంతమందిలో  లోరజ్ పామ్, డైజిపామ్ లాంటి ట్రాంక్విలైజర్ ఔషధాలను వాడటం వల్ల వాయు నాళాలు తక్కువ వ్యాకోచంతో ఉంటాయి. 

అధిక బరువు ఉండడం వల్ల, లేదా మెడ, గొంతు భాగంలో అధిక బరువు పడినా గురకకు దారితీస్తుంది. 

సైనస్ సమస్యలో ముక్కు నాసికా రంధ్రాలు జామ్ అవుతాయి. దీంతో గాలి కష్టంగా వెళ్లాల్సి వచ్చి శబ్దం బయటకు వస్తుంది.  ముఖ్యంగా కార్పొరేట్‌ ఉద్యోగుల్లో ఎక్కువమంది పని వత్తిడి వల్ల నిద్ర పోయేటపుడు  గురక సమస్యతో బాధపడుతుంటారు. 

ఇక గుర‌క స‌మ‌స్య‌ను ఎలా అధికమించ‌వచ్చో  తెలుసుకుందాము.

 రాత్రి నిద్రపోయే ముందు అర టీ స్పోన్‌ తేనె, అర టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ కలిపి  తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.

 ఒక గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ చుక్కలు వేసి రాత్రి నిద్రపోయే ముందు నోటిలో పోసుకుని బాగా పుక్కిలించాలి. దీని వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ను చేతివేళ్లకు రాసుకుని వాసన చూస్తుంటే గురక తగ్గుతుంది.

 ఒక గ్లాసు వేడి నీటిలో అర టీ స్పూన్‌ యాలకుల చూర్ణం కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి నిద్ర‌పోతే మంచి ఫలితం కనిపించవచ్చు.

అలాగే రాత్రి పడుకునే ముందు మరిగే నీటిలో 4, 5 చుక్కలు యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి ఆవిరి పట్టాలి. ఇదికూడా గురక సమస్యను అధుపులో వుంచుతుంది.

దీనితో పాటుగా వీలున్నపుడు భ్రీతింగ్ ఎక్సర్ సైజెస్, మధ్యపానం, ధూమపానం వంటి వాటికి దూరంగా వుండటం లాంటివి చాలా ఉపయోగపడుతాయి.

29, ఆగస్టు 2021, ఆదివారం

మార్కెట్లో మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.

 

Simple Electric Scooter, electric schooter


ప్రస్తుతం విద్యుత్‌ ఆధారంగా నడిచే వాహనాల హవా నడుస్తోంది. 

ఈ క్రమంలోనే చాలా కంపెనీలు సైతం అధునాతన ఫీచర్లతో కూడిన ఎలక్ట్రిక్‌ స్కూటర్లను తయారు చేస్తున్నాయి. 

ఈ జాబితాలోకి కొత్తగా చేరింది  "సింపుల్‌ ఎనర్జీ".

ప్రస్తుతం మార్కెట్లో ప్రజలు కూడా ఎలక్ట్రిక్‌ స్కూటర్ల వినియోగంపై ఆసక్తి చూపిస్తుండడంతో  రోజుకో కంపెనీ ఎలక్ట్రిక్‌ వాహనాలను విడుదల చేస్తున్నాయి. 

తాజాగా మార్కెట్లోకి సింపుల్‌ ఎనర్జీ అనే స్టార్టప్‌ కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను విడుదల చేసింది. 

ఈ స్కూటర్‌లో 4.8 కిలోవాట్స్ గల పోర్టబుల్ లిథియం-అయాన్ బ్యాటరీని ఇచ్చారు. డిటాచబుల్‌, పోర్టబుల్‌ ఫీచర్‌తో సులభంగా బ్యాటరీ చార్జ్‌ చేసుకోవచ్చు. 

నిమిషం చార్జింగ్ చేస్తే 2.5 కిలోమీటర్లు వెళ్ళగలుగుతుంది.  పూర్తిగా చార్గింగ్  చేస్తే ఏకంగా 203 కిలో మీటర్లు వెళ్లొచ్చు. 

గంటకు 105 కి.మీల వేగంతో దూసుకుపోగలిగే ఈ స్కూటర్‌లో 7 అంగుళాల కస్టమైజబుల్ డిజిటల్ డ్యాష్ బోర్డ్, ఆన్ బోర్డ్ నావిగేషన్, జియో ఫెన్సింగ్, ఎస్ఓఎస్ మెసేజ్, డాక్యుమెంట్ స్టోరేజీ, టైర్ ప్రజర్ మానిటరింగ్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అధునాతన ఫీచర్లు అందించారు. 

బెంగళూరుకు చెందిన ఈ స్టార్టప్‌  స్కూటర్‌ ధరను రూ. 1.10 లక్షలుగా నిర్ణయించింది. స్కూటర్‌ను రూ. 1947 చెల్లించి బుక్‌ చేసుకోవచ్చు. 


జుట్టు రాలడం, తెల్లబడడం, చుండ్రు సమస్యలకు పరిష్కారం. hair oil for dandruff and hair fall.

 



 hair oil for dandruff and hair fall. 

మారుతున్న జీవనశైలి, పెరుగుతన్న వీతావరణ కాలుష్యం, తీవ్రమైన మానసిక ఒత్తిడి, దీనికి తోడు అపసవ్యమైన ఆహారపు అలవాట్లు, జుట్టు సమస్యలకు ప్రధాన కారణమవుతాయి. దీనివల్ల  జుట్టు రాలిపోవడం, చుండ్రు, వెంట్రుకలు త్వరగా తెల్లబడడం లాంటివి జరుగుతుంటాయి.

 ఈ సమస్యలన్నిటినీ అదుపులో పెట్టడానికి, అలాగే ఆరోగ్యకరమైన జుట్టుని తిరిగి పొందడానికి ఉల్లి నూనె సహాయం చేస్తుంది.

ఉల్లిపాయ నూనె తో చాలా ఉపయోగాలున్నాయి.

ఉల్లిపాయ హెయిర్ ఆయిల్ మీ జుట్టుని ఆరోగ్యంగా, కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది. అంతేకాదు జుట్టు ఒత్తుగా పొడవు పెరిగేలా చేస్తోంది. 

ఉల్లిపాయ నూనె తాయరుచేసుకునే విధానం:

మెత్తగా గ్రైండ్ చేసుకున్న  ఉల్లిపాయ పేస్ట్ ని కొబ్బరి నూనెతో కలిపి బాగా రంగు మారే వరకు వేడి చేసుకోవాలి, దించుకుని, వేడి తగ్గిన తర్వాత వడగట్టుకుని జాగ్రత్త చేసుకోవాలి.

ఉల్లిపాయ నూనెను వెంట్రుకల కుదుళ్లకు పట్టేలా వృత్తాకారంగా నెత్తిమీద మర్దనా చేస్తూ అప్లై చేయాలి. ఇలా చేయడం వలన రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో జుట్టు మూలాలను బలోపేతం చేసి, జుట్టు రాలడాన్ని అరికడుతుంది.

ఉల్లిపాయలో మంచి పోషకాలున్నాయి. ఇవి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.

ముఖ్యంగా కాలుష్యంతో బలహీనమైన జుట్టు కుదుళ్లకు మంచి బలాన్ని ఇవ్వడంలో ఉల్లిపాయ నూనె సహాయపడుతుంది

ఉల్లిపాయ హెయిర్ ఆయిల్  ఫోలికల్స్‌ను పెంచుతుంది ఇది జుట్టు ఒత్తుగా వుండేలా తోడ్పడుతుంది.

ఉల్లిపాయ రసం చుండ్రును నియంత్రించడంలో సహాయపడుతుంది. మెరిసే బలమైన జుట్టును ఇస్తుంది.

ఉల్లిపాయ హెయిర్ ఆయిల్‌  onion hair oil లోని శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలు స్కాల్ప్ ఇన్‌ఫెక్షన్‌లతో పోరాడతాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్థాయి.

ఉల్లిపాయలో సహజంగా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అందుకే జుట్టు పొడవుగా, ఒత్తుగా చేస్తుంది.



 

27, ఆగస్టు 2021, శుక్రవారం

ఆపిల్ ఐ ఫోన్ 13 Apple iPhone 13

 

https://linktelugu.blogspot.com/2021/08/13-apple-iphone-13.html


ప్రతి ఆపిల్ ఐఫోన్ Apple iPhone మార్కెట్లోకి రాకముందే సంచలనం సృష్టిస్తుంది. చాలామంది ఐఫోన్ కొత్త వెర్షన్ వస్తుందని తెలిసిన వెంటనే దానిగురించి తెలుసుకోవాలని ఉత్సాహపడతారు.

 ప్రతి ఆపిల్ ఐఫోన్ మార్కెట్లోకి రాకముందే సంచలనం సృష్ఠిస్తుంటుంది.  చాలామంది ఐఫోన్ కొత్త వెర్షన్ వస్తుందని తెలిసిన వెంటనే దానిగురించి తెలుసుకోవాలని ఉత్సాహపడతారు.  ఐఫోన్ వరుసగా విడుదల చేస్తూ వస్తున్న వెర్షన్స్ అన్నీ వేటికవే ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీ అప్ డేట్స్ తో వస్తుంటాయి. అందుకే ఆపిల్ ఐఫోన్ క్రేజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. 

ఆపిల్ ఐఫోన్ 12 Apple iPhone 13 విజయవంతంగా మార్కెట్లో దూసుకుపోతోంది. ఇప్పడు తాజాగా ఆపిల్ ఐఫోన్ 13  లాంచ్ చేయడానికి రెడీ అవుతోంది. ఈ అప్‌గ్రేడ్ 2021 లో ఐ ఫోన్ ప్రేమికులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫోన్‌లలో ఒకటి.  లాంచ్ తేదీ, ధరల శ్రేణి అదేవిధంగా స్పెసిఫికేషన్‌లతో సహా దాని వివరాల గురించి అధికారికంగా ధృవీకరణ లేనప్పటికీ,  ఆపిల్ వచ్చే నెలలో ఐఫోన్ 13 సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం.

 ఐఫోన్ 13 ఫోన్‌లు  అప్‌గ్రేడ్ చేసిన ఫేస్ ఐడి హార్డ్‌వేర్‌ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీని అర్థం ఈ I PHONE 13 మాస్క్‌తో కూడా ముఖాన్ని స్కాన్ చేయగలదు . అదేవిధంగా  పొగమంచు గ్లాసెస్ ధరించినా కూడా ముఖాన్ని స్కాన్ చేసే అద్భుత ఫీచర్ తో రాబోతోంది ఐఫోన్ 13.  

దీని CAD రెండర్లు ఐఫోన్ 12 లో ఉన్నట్లుగా కుడి వైపు కాకుండా ఎడమ వైపున ముందు కెమెరాను కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఇది డెవలప్‌మెంట్ టిప్‌స్టర్ జోన్ ప్రోసర్ సహకారంతో వస్తుంది.

యాపిల్ ఇప్పటికే ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక అప్‌డేట్‌ను విడుదల చేసింది, దీని సహాయంతో ఐఫోన్ X,లేదా అంతకంటే పై సిరీస్ ఫోన్ లు కలిగి ఉన్న వినియోగదారులు కూడా మాస్క్‌తో  ఫేస్-అన్‌లాక్ చేయవచ్చు, కానీ, దీని కోసం వారు ఆపిల్ వాచ్ తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది.  ఆపిల్ వాచ్ వంటి అదనపు పరికరాలు అవసరం లేకుండా ఐఫోన్ 13 లో ఈ సౌకర్యం పొందవచ్చని తెలుస్తోంది.

ఆపిల్ రాబోయే ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్‌లతో పాటు వనిల్లా ఐఫోన్ 13 కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

రెగ్యులర్ ఐఫోన్ 13 , ఐఫోన్ 13 మినీ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరాలు ఉంటాయని, అదే  ప్రో మోడళ్లలో ట్రిపుల్ కెమెరాలుఉండొచ్చు. ముఖ్యంగా, ప్రో మోడల్స్ 120hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తాయి. ఇది ఇప్పటికే ఐప్యాడ్ ప్రో  మోడళ్లలో “ప్రోమోషన్ డిస్‌ప్లే” గా ఫీచర్ చేశారు.

షియోమీ సరికొత్త గ్యాడ్జెట్స్ XIAOMI


draft.blogger.com/blog/post/edit/4450771144974125185/2120872744303874523



 ప్రజల జీవనశైలిని మరింత స్మార్ట్ చేసే క్రమంలో, అధునాతన టెక్నాలజీతో షియోమీ సరికొత్త గ్యాడ్జెట్స్ ప్రవేశపెట్టింది.

 XIAOMI షియోమి  స్మార్ట్ లివింగ్ ఈవెంట్‌లో భాగంగా 6 ఉత్పత్తులను విడుదల చేసింది. ఈ ఉత్పత్తులు ప్రజల జీవనశైలిని స్మార్ట్ చేయడానికి సహాయపడతాయని కంపెనీ చెబుతోంది. 

ఇందులో భాగంగా  Wi-Fi  కనెక్టివిటీ కోసం Mi రూటర్ 4A,  Mi 360 హోమ్ సెక్యూరిటీ కెమెరా, Mi TV 5x 3  సిరీస్, Mi స్మార్ట్ బ్యాండ్ 6 లను లాంచ్ చేసింది. వీటితోబాటుగా  షియోమి షూలను కూడా విడుదల చేసింది 

పై గాడ్జెట్స్ మొత్తం IOT టెక్నాలజి మీద ఆధారపడి పనిచేస్తాయి. 

గాడ్జట్ ని ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయడం ద్వారా మన పనిని IOT సులభతరం చేస్తుంది. మరోవిధంగా చెప్పాలంటే షియోమి తయారుచేసిన అన్ని గాడ్జట్స్ ని ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయగలము., ఇవన్నీ  ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ పరిజ్ణానం ఆధారంగా ఆపరేట్ కాబడుతాయి.  

IOT అనేది నెట్‌వర్కింగ్ టెక్నాలజీపై పనిచేస్తుంది.

దీని సహాయంతో, మీరు మీ ఇంటిలోని పరికరాలను ఇంటర్నెట్ సహాయంతో కనెక్ట్ చేయవచ్చు. ఆ పరికరాలన్నీ ఎక్కడి నుండైనా పర్యవేక్షించవచ్చు.

షియోమి స్మార్ట్ ఈవెంట్‌లో లాంచ్ చేసిన ప్రోడక్ట్ ఇలా  వున్నాయి. 

1. Mi రూటర్ 4A

 ఇది 3 గిగాబైట్ నెట్‌వర్క్ పోర్ట్‌లను కలిగి ఉంటుంది. డ్యూయల్ కోర్ CPU, 4  హై గెయిన్ యాంటెన్నా అందుబాటులో ఉంటాయి. వీటి సహాయంతో, 1167 Mbps ఇంటర్నెట్ స్పీడ్  అందుబాటులో ఉంటుంది.

2. Mi 360 హోమ్ సెక్యూరిటీ కెమెరా

ఈ కెమెరా డ్యూయల్ బ్యాండ్ వైఫై సిస్టమ్‌తో వస్తుంది. 2 రకాల వాయిస్ కాలింగ్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఇది F1.5 అపార్చర్ కలిగిఉంది. నైట్ విజన్ సెన్సార్ ఇంకా ఈ కెమెరా డ్యుయెల్ వే వాయిస్ కాలింగ్‌ సౌకర్యం ఉంది. 

3. Xiaomi రన్నింగ్ షూస్

బ్లాక్, బ్లూ, గ్రే కలర్ ఆప్షన్‌లతో  Xiaomi రన్నింగ్ షూస్ కూడా ఈ ఈవెంట్‌లో లాంచ్ అయ్యాయి. ఇందులో PU హీల్ స్టెబిలైజర్, యాంటీ-ట్విస్ట్ సపోర్ట్ లేయర్, TPU ఫ్లెక్స్ యూనిట్, క్లౌడ్ బాంబ్ పాప్‌కార్న్ మిడ్‌సోల్, అల్ట్రా స్ట్రాంగ్ రబ్బర్ గ్రిప్ ఉన్నాయి. దీని ధర రూ .2,699 గా ప్రకటించారు.

4. Mi TV 5x సిరీస్

ఈ టీవీ  43, 50, 55 అంగుళాల స్క్రీన్  సైజు వేరియంట్‌లతో లాంచ్ అయింది. టీవీ స్టాండ్ మెటల్‌తో తయారైంది. బాడీ రేషియో 96.6%. ఇందులో 100 కోట్లకు పైగా కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయని తెలియజేసింది.

ఇందులో డాల్బీ విజన్, HDR10+, HDR 10, 40W స్టీరియో స్పీకర్‌లు ఉన్నాయి. పేరంటల్ లాక్, మరియు సురక్షితమైన కంటెంట్‌ను వెతకడానికి ఆప్షన్ ఉంది.  15 భాషలు అందుబాటులో ఉంటాయి. అలాగే 30 OTT యాప్‌ల నుండి 75 కి పైగా ఉచిత లైవ్ ఛానెల్‌లు అందుబాటులో ఉంటాయి.

5. Miస్మార్ట్ బ్యాండ్ 6

80 కి పైగా పూర్తి స్క్రీన్ వాచ్ ఫేస్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటర్ ప్రూఫ్, రియల్ టైమ్ హార్ట్ బీట్ మానిటర్, SpO2 స్థాయి, నోటిఫికేషన్ అలెర్ట్ లను పంపవచ్చు. ఈ స్మార్ట్ బ్యాండ్‌లో మాగ్నెటిక్ ఛార్జింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంది. చార్జింగ్ చేసేటపుడు  పట్టీని తొలగించాల్సిన అవసరం లేదు.Mi స్మార్ట్ బ్యాండ్‌లో 1.56-అంగుళాల AMOLED  టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. 30 ఫిట్‌నెస్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి.

6.మీ నోట్‌బుక్ అల్ట్రా షియోమి

షియోమీ ఇండియాలో రెండు కొత్త ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. ఈ కొత్త ల్యాప్‌టాప్‌లు Mi నోట్‌బుక్ ప్రో,  Mi నోట్‌బుక్ అల్ట్రా.  ఈ సెకండ్ జనరేషన్ ల్యాప్‌టాప్ల ను గత సంవత్సరంMi నోట్‌బుక్ 14 కి అప్‌గ్రేడ్‌గా లాంచ్ చేశారు. ఈ కొత్త మోడల్స్ 3.2క్ డిస్‌ప్లే, 11 వ జెనరేషన్ ఇంటెల్ టైగర్ లేక్ ప్రాసెసర్‌ని కలిగి ఉంటాయి.

Mi నోట్‌బుక్ ప్రో ధర 8GB RAM మరియు కోర్ i5  ప్రాసెసర్ వేరియంట్‌కు రూ .56,999,  16GB RAM, కోర్ i5 ప్రాసెసర్‌కు రూ .59,999, అదేవిధంగా  16MB RAM , కోర్ i7 ప్రాసెసర్ వేరియంట్‌కు రూ .72,999 గా నిర్ణయించారు.


26, ఆగస్టు 2021, గురువారం

UFO ఎగిరేపళ్ళాలు నిజంగా ఉన్నాయా?

blog/post/edit/4450771144974125185/2155933885186635480


UFO అంటే ఏమిటి? నిజంగానే గ్రహాంతరవాసులు వున్నారా?  భూమి మీద ఒక్కటే కాకుండా విశ్వంలోని వేరే ఇతర గ్రహాలలో  మనలాంటి లేదా మనకన్నా తెలివైన జీవులు వున్నారా? వారు ఫ్లైయింగ్ సాసర్ లాంటి తమ వాహనాల ద్వారా అప్పుడప్పుడూ భూమి మీదకు వస్తుంటారా..? వారివలన భూగ్రహానికి ఎదైనా ప్రమాదం ఉందా..?

వీటి గురించిన చర్చ ఈనాటిది కాదు. చాలా దశాబ్దాలుగా వీటికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన కథలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఇలాంటి విషయాలపై పరిశోధనలూ కూడా  కొనసాగుతోనే ఉన్నాయి.

ఇలాంటి అనేక అనుమానాలకు కారణమైంది UFO. దీనినే 'Unidentified flying object'అని అంటారు. ఎగిరే పళ్ళాలని, ఫ్లయింగ్ సాసర్లు అని కూడా పిలుస్తుంటారు.

రాకెట్ సైన్స్ అభివృద్ధి చెందిన తరువాత UFO లు ముఖ్యమైన చర్చనీయ అంశంగా మారాయి. కొంతమంది పరిశోధకులు వీటిని భూమిని సందర్శించే తెలివైన గ్రహాంతరవాసులు అని భావించారు.

1947 లో మొట్టమొదటిసారిగా UFO గురించి ప్రస్తావన వచ్చింది. వ్యాపారవేత్త కెన్నెత్ ఆర్నాల్డ్ విమానంలో వెళ్తున్నపుడు వాషింగ్టన్ లోని మౌంట్ రైనర్ సమీపంలో తొమ్మిది హై-స్పీడ్ వస్తువుల గుంపుని చూసినట్లు పేర్కొన్నాడు. అవి నెలవంక ఆకారంలో వున్నాయని, చాలా వేగంగా  అవి "నీటి మీద స్కిప్పింగ్ చేసే సాసర్ల" లాగా కదులుతున్నాయని చెప్పాడు. 

ఆ వార్తను ప్రచురించిన ఓ పత్రిక వస్తువులు సాసర్ ఆకారంలో ఉన్నాయని పొరపాటున ప్రంట్ చేసింది. అపాటినుంచి  ఫ్లయింగ్ సాసర్ అనే పదం స్థిరపడిపోయింది.

ప్రపంచంలో అనేకచోట్ల చాలామంది తాము వాటిని చూసినట్లుగా చెప్పిన ఉదంతాలున్నాయి.

మరియు 1948 లో US వైమానిక దళం ప్రాజెక్ట్ సైన్ అనే పేరుతో దర్యాప్తును ప్రారంభించింది. 

 UFO లు అధునాతన సోవియట్ విమానాలు అని ఈ ప్రాజెక్ట్‌లో పాల్గొన్నవారి మొదటి  అభిప్రాయం, అయితే ఇతర దేశాల పరిశోధకులు మాత్రం ఆ ఎగిరే వస్తువులు ఇతర గ్రహాల అంతరిక్ష నౌకలు కావచ్చు అని అభిప్రాయపడ్డారు.  

ప్రాజెక్ట్ బ్లూ బుక్‌పై అధికారిక విచారణల ద్వారా సుదీర్ఘకాలం కొనసాగింది. 1952 నుండి 1969 వరకు ప్రాజెక్ట్ బ్లూ బుక్ 12,000 కంటే ఎక్కువమంది సాక్ష్యాలు లేదా సంఘటనల నివేదికలను సంకలనం చేసింది 

 వారి నివేదిక ప్రకారం  UFO అనేది  సాక్ష్యాలలో 90 శాతం మంది చూసినవి ప్రకాశవంతమైన గ్రహాలు మరియు నక్షత్రాలు, ఉల్కలు, అరోరాస్, అయాన్ మేఘాలులేదా విమానం, బెలూన్లు, పక్షులు మరియు సెర్చ్ లైట్లు వంటి భూసంబంధమైన వస్తువులకు కావొచ్చని అలాగే వీటివల్ల  భద్రతాపరమైన ముప్పు లేదు అని.  

ఈ నివేదిక సుదీర్ఘ కాలం రహస్యంగా ఉంచడం వల్ల ప్రజలలో అనేక అనుమానాలను కలుగజేసింది.

 1966 లో 37 మంది శాస్త్రవేత్తలతో రెండవ కమిటీ ఏర్పాటు చేయబడింది. రెండు సంవత్సరాల తరువాత,  UFO కనిపించడం గురించి వివరణాత్మక అధ్యయనం చేసిన ఈ కమిటీ, దాని ఫలితాలను సైంటిఫిక్ స్టడీ ఆఫ్ అన్‌డెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్‌గా విడుదల చేసింది. 

ఒక్క అమెరికానే కాదు, రష్య, స్వీడన్, బ్రొటన్, టర్కీ లాంటి దేశాలు కూడా పరిశోధన చేసాయి.

ఆశ్చర్యకరంగా గత సంవత్సరం ఏప్రిల్ లో తొలిసారిగా అమెరికా రక్షణ మంత్రిత్వశాఖ ఊFఓ లకు సంబందించి 3 వీడియోలను విడుదల చేసింది. ఎస్ -18 ఫైటర్ జెట్‌లో ఏర్పాటు చేసిన ఇన్‌ఫ్రా-రెడ్ కెమెరా సహాయంతో వీటిని యుఎస్ నేవీ రికార్డ్ చేసింది. కాని వీటిని అధీకౄత సాక్ష్యాలుగా అమెరిక పరిగణించలేదు.

చాలామంది  UFO ఉదంతాల గురించి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూనే వున్నారు. గ్రహాంతరవాసులు నింజగా ఉన్నారని, అమెరిక శాస్థ్రవేత్తలు వారితో సంబంధాలు నెరుపుతున్నారని, కొందరైతే అమెరికలోని ఏరియా 51 లో గ్రహాంతరవాసులు బంధీలుగా ఉన్నారని నమ్ముతుంటారు.

కాని ఇంతవరకు జరిగిన పరిశోధనల్లో ఎక్కడకూడా గ్రహాంతరవాసులు వున్నారనిగానీ, ఎగిరేపళ్ళాల ఉనికి గాని, శాశ్త్రీయంగా నిర్ధారించబడలేదు.  




24, ఆగస్టు 2021, మంగళవారం

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ vs హోండా యాక్టివా 6g

/4450771144974125185/2805210327061140163



ఇప్పుడు స్కూటర్ల విభాగంలో బ్యాటరీతో నడిచే వాహనాలను పోటాపోటీగా విడుదల చేస్తున్నారు. ఇటీవల ఓలా అధునాతన ఫీచర్లతో విడుదలైంది. దీనికి పోటీగా అన్నట్టు ప్రముఖ వాహన నిర్మాణ సంస్థ హోండా 'యాక్టివా 6 జి'  పరుతో ఓ ఎలక్ట్రిక్  బైక్ ను మార్కెట్లోకి విడుదల చేయబోతొంది.

దీనితో ఎలక్ట్రిక్ వాహనాల హడావుడి గట్టిగానే మొదలైనట్టు కనిపిస్తోంది. 

ఈ రెండిటినీ పోల్చి చూస్తే ఎలా ఉంటుందో గమనిస్తే.. 

 ఇటీవల ఓలా అద్భుతమైన ఫీచర్లతో విడుదలై,  బుకింగ్ సమయంలో రికార్డులు సృష్టించింది. 

కానీ, స్కూటర్ విడుదల అయ్యాక దాని ధరతో వినియోగదారులు కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టు రిపోర్టులు చెబుతున్నాయి. 

ఇదిలా ఉంటె, దేశంలోఅత్యంత ప్రజాదరణ పొందిన హోండా యాక్టివా 6 జి,  ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కి ప్రధాన పోటీధారుగా మారుతుందని భావిస్తున్నారు. 

రెండింటిని పోల్చి చూసినపుడు  

ఓలా ఎలక్ట్రిక్ సొగసైన,క్లాసిక్ డిజైన్ ఫిలాసఫీని ఉపయోగించింది. ఇది ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్‌ లతో కూడిన సాధారణ ఆప్రాన్‌తో పాటు ముందు ఒక చిన్న LED  హెడ్‌ల్యాంప్‌ను అమర్చింది. ముందు భాగంలో సింగిల్ టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక వైపున సింగిల్ సైడెడ్ స్వింగార్మ్ వుంది. వెనుక భాగం అన్ని వైపులా టర్న్ సిగ్నల్స్ తో, ళేడ్ టెయిల్‌ లైట్‌లను కలిగి ఉంది.

ఇక హోండా యాక్టివా డిజైన్ ఆకట్టుకునేలా ఉంది. ఇది బాణం ఆకారంలో ఉన్న  హెడ్‌ల్యాంప్‌ను కలిగి ఉంది, టర్న్ ఇండికేటర్లు,  ఫ్రంట్ ఆప్రాన్ ఫాక్స్ ఎయిర్ వెంట్స్,  క్రోమ్ ఇన్సర్ట్‌లను పొందుపరచబడి వుంది.  వెనుక భాగంలో ఒక టర్ప్ ఇండికేటర్‌ల చుట్టూ ఉన్న ఒక  LED టైల్‌లైట్ జోడించింది. యాక్టివా 6 జిలో డ్యూయల్ టెలిస్కోపిక్ ఫోర్కులు,సింగిల్ సైడెడ్ స్వింగార్మ్ వున్నాయి.

 ఓలా ఇ-స్కూటర్ ఆకారంలో హోండా కంటే కొంచెం పెద్దది. ఒలా పొడవైన వీల్‌బేస్ కలిగి ఉంది. తక్కువ బరువుగా వుండటం వల్ల  ట్రాఫిక్‌లో డ్రైవింగ్ ని సులభతరం చేసె అవకాశం వుంది.

ఓలా ఎస్ 1 TFT ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే (ఇంటిగ్రేటెడ్ నావిగేషన్‌తో), డిస్క్ బ్రేక్‌లు, 12-అంగుళాల అల్లాయ్ వీల్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, మోనోషాక్ రియర్ సస్పెన్షన్ వంటి చాలా ఆకట్టుకునే ఫీచర్లతో నిర్మించబడింది. ఇందులో డ్రైవింగ్ సౌండ్‌ను ఎనేబుల్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంది. అంతేకాకుండా అదనపు సౌలభ్యం కోసం, రివర్స్ మోడ్ కూడా ఉంది. 

Ola బ్యాటరి   సాధారణ ఛార్జర్ ద్వారా ఛార్జ్ చేయడానికి దాదాపు 4.5 గంటలు పడుతుంది. భవిషత్తులో హైపర్‌ఛార్జర్ కేవలం 18 నిమిషాల్లో బ్యాటరీకి 75 కి.మీ. మైలేజి ని ఇస్తుంది.  

మరోవైపు, హోండా యాక్టివా ఫీచర్ల జాబితాను ఇలా ఉంది. 

ఇది ఉక్కు చక్రాలను కలిగి, రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్‌ల సాంకేతికతను కలిగి వుంది. 

అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక మోనోషాక్ సస్పెన్షన్, ఆల్-ఎల్ఈడి లైటింగ్, మొదలైనవి ఉన్నాయి. ఇంధనం నింపాల్సిన ప్రతిసారీ సీటు తెరిచి ఉంచాల్సిన అవసరం లేదు. 

హోండా యాక్టివా 6 జి ఇంజిన్ సైజు 109.51చ్చ్ ఇంజిన్ టైప్ ఫోర్ స్ట్రోక్, కూల్డ్ ఫ్యాన్, సింగిల్ సిలిండర్, పెట్రోల్ మాక్స్. ఫవర్ 7.79  మాక్స్. 

ఇక ధరల విషయానికి వస్తే..

హోండా యాక్టివా ధర(భారతీయ మార్కెట్లో ) ప్రస్తుతం రూ. 69,080 నుండి రూ. 72,325 వరకూ ఉంది. 

ఓలా ఎస్ 1,  విషయానికొస్తే, వాటి ధర రూ. 85,099, ఎస్ 1 ప్రో రూ.  1.10 లక్షలు (పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ).


బూస్టర్ డోసుతో కరోనా మటాష్!

blog/post/edit/4450771144974125185/1326888187400588969


 కోవిడ్-19 వ్యాక్సీన్‌ బూస్టర్ డోసు తీసుకున్న 60 ఏళ్లకు పైబడిన వృద్ధులకు తిరిగి కరోనా సోకడం, లేదా తీవ్ర అనారోగ్యం పాలవడం లాంటి సమస్యలు ఎదురుకావడం చాలా తక్కువని పరిశోధనల్లో తేలింది.

పైజర్-బయోటెక్ సంయుక్తంగా పరిశోధన చేసి, తయారు చేసిన నివేదికలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి.

ఇజ్రాయెల్ ఆరోగ్యమంత్రిత్వశాఖ నుంచి అందిన సమాచారం  ప్రకారం 'ఫైజర్ వ్యాక్సీన్‌' రెండు డోసుల టీకా తీసుకున్న తరువాత మూడవ డోసు కూడా తీసుకోవడం వలన అత్యధిక రక్షణ లభిస్తున్నదని తేలింది. 

మూడవ డోసు వాక్సిన్ వేసుకున్న వారిని పరీక్షించిన అనంతరం వైద్య నిపుణులు ఈ విషయాన్ని ప్రకటించారు. 

60 ఏళ్లు పైబడిన వృద్దులు  టీకా మూడవ డోసు తీసుకుంటే వారికి కరోనా నుంచి నాలుగింతల రక్షణ లభిస్తున్నదని గుర్తించారు.

కరోనా మూడోవేవ్ వస్తోంది!

 

blog/post/edit/4450771144974125185/8301423265179588905


నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐడిఎం) నిపుణుల కమిటీ మూడో వేవ్ కరోనా గురించి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది.

అక్టోబర్‌లో గరిష్ట స్థాయికి చేరవచ్చని, ముఖ్యంగా పిల్లలపై ప్రభావం వుండొచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

కరోనా థర్డ్ వేవ్ అక్టోబర్‌లో రావచ్చు. ప్రత్యేకించి పెద్దలకంటే, పిల్లలు ఎక్కువ ప్రమాదంలో పడే అవకాశం వుంది కాబట్టి వారి చికిత్స కోసం వైద్యపరంగా ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని కమిటీ పేర్కొంది. 

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచనల మేరకు ఏర్పాటు చేసిన ఈ కమిటి పిల్లలు, వైద్యులు, సిబ్బంది, వైద్య పరికరాల చికిత్స సౌకర్యాలు ఉదా: వెంటిలేటర్లు, అంబులెన్సులు మొదలైనవి అందించాలని, అంచనా వేసిన దానికంటే ఎక్కువ మంది పిల్లలు కరోనావైరస్ సంక్రమణను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని  ప్రధాన మంత్రి కార్యాలయానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది.

పిల్లలకు కోవిడ్ టీకాలు వేయడానికి కేంద్రం ప్రాధాన్యం ఇవ్వాలని, తీవ్రమైన అనారోగ్యాలు,  వైకల్యాలున్న పిల్లలకు టీకాలు వేయించాలని కమిటి సూచించింది. 

అక్టోబర్ చివరి నాటికి కరోనా మూడవ వేవ్ గరిష్ట స్థాయికి చేరుకోవచ్చు. 

23, ఆగస్టు 2021, సోమవారం

దిల్ రాజు 'రౌడీ బాయ్స్' మోషన్ పోస్టర్ విడుదల

rowdy boys


 ప్రముఖ నిర్మాత దిల్ రాజు  తన  వారసుడిని హీరోగా పరిచయం చేస్తున్నారు. 

రాజు తన తమ్ముడి కొడుకును హీరోగా లాంఛ్ చేస్తున్న సినిమా పేరు రౌడీ బాయ్స్. 

ఆయన సోదరుడు శిరీష్ తనయుడు ఆశీష్‌ రెడ్డిని హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. 

ఈ సినిమాకు రౌడీ బాయ్స్ అనే టైటిల్ ఖరారు చేస్తూ ఈరోజు మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.

ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.  హుషారు సినిమా దర్శకుడు శ్రీహర్ష కొనెగంటి ఈ రౌడీ బాయ్స్ ని తెరకెక్కిస్తున్నాడు. 

2021 అక్టోబర్‌లో  ఈ మూవీ  విడుదల కానుంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ కాగా  దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.  

కృత్రిమ మెదడు ఆవిష్కరణ !

 


 కృత్రిమ మెదడు ఆవిష్కరణ !

పరిశోధకులు మానవ శరీరంలోని ప్రతి అవయవాన్ని కృత్రిమంగా సృష్టించే దిశలో మరో ముందడుగు పడిది.

మెదడు సంబంధిత వ్యాధుల్లో ప్రత్యామ్నాయ వ్యవస్థ కోసం చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలు మరో మైలురాయిని చేరుకున్నాయి.

కొన్నిరకాల కృత్రిమ అవయవాలను సృష్టిస్తూ, అవయవాలు కోల్పోయినవారికి జీవితాన్ని ఇస్తున్న శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. 

ఈసారి శాస్త్రవేత్తలు కృత్రిమ మానవ మెదడును సృష్టించారు. ఈ మెదడుని మానవ మూలకణాల నుండి అభివృద్ధి చేశారు. జర్మన్ శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో కృత్రిమ మానవ మెదడును సృష్టించారు. ఈ చిన్నపరిణామంలో వున్న ఈ మెదడుకి కళ్ళు కూడా ఉన్నాయి. 

దీనిని ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ జెనెటిక్స్, జర్మనీ పరిశోధకులు తయారు చేశారు. 

సృషించిన మెదడులోని కళ్ళు ఐదు వారాల పిండంలా అభివృద్ధి చెందాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

భవిష్యత్తులో ఇది అనేక వ్యాధుల చికిత్సలో సహాయపడుతుంది.దీని నుండి అనేక కొత్త విషయాలు వెల్లడవుతాయి,

కృతిమంగా తయారుకాబడిన ఈ బ్రెయిన్ 3 మిమీ. వెడల్పుగా ఉంటుంది. 

ఇందులో ఉండే కళ్లలో కార్నియా, లెన్స్, రెటీనా ఉన్నాయి. దాని సహాయంతో అది కాంతిని చూడగలుగుతుంది. ఈ కళ్ళు న్యూరాన్లు, నరాల కణాల సహాయంతో మెదడుతో కూడా కమ్యూనికేట్ చేయగలవు. 

ప్రయోగశాలలో తయారు చేసిన ఈ రెటీనా భవిష్యత్తులో ఒఋష్టి కోల్పోయిన వ్యక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సెల్ స్టెమ్ జర్నల్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం, ఈ కళ్ళపై కాంతి కిరణాలు పడినపుడు, సంకేతాలు మెదడుకు చేరాయి. కళ్ళు చూసేవి మెదడుకు చేరుతున్నాయని ఇది రుజువు చేసింది. ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన మెదడులో మొదటిసారిగా ఇది కనిపించింది.

పరిశోధకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, చిన్న మెదడు సహాయంతో, పిండం అభివృద్ధి సమయంలో, పుట్టుకతో వచ్చే రెటీనా సంస్యలలో,రెటీనాపై కొన్ని ఔషధాలను పరీక్షించడం ద్వారా కన్ను మరియు మెదడు ఎలా కమ్యూనికేట్ చెందుతాయో తెలుసుకోవడం సాధ్యమవుతుందని చెప్పారు. 

కానీ 60 రోజుల్లో సుమారు 314 మినీ బ్రెయిన్‌లు తయారు చేయగా వీటిలో మూడు వంతులు పూర్తిగా అభివృద్ధి చెందాయి. అవి కనిపించే మానవ పిండాల వంటివి, రక్త సరఫరా లేకుండా అవి  ఎక్కువ కాలం జీవించలేవు. అందువల్ల అవి  క్రమంగా రెండున్నర నెలల్లో జీవం కోల్పోతాయి.

ఈ ఆవిష్కరణ పూర్తిగా విజయవంతం కాకపోయినప్పటికీ, భవిష్యత్ లో పూర్తిస్థాయిలో మానవ మెదడును కృత్రిమంగా సృష్టించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిశోధనలు మానవాళికి చాలా మేలు చేస్తుందని శాస్త్రవేత్తలు  చెబుతున్నారు.


ప్లేట్లేట్ కౌంట్ పెరగడానికి


ప్లేట్లేట్ కౌంట్ పెరగడానికి 


ప్లేట్ లెట్ కౌంట్ పడిపోవడమనేది చాలాసార్లు ప్రాణాలకే ప్రమాదం తీసుకువస్తుంది.

సాధారణంగాహై ఫీవర్‌, డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు వచ్చినపుడు రక్తంలో ప్లేట్‌ లెట్స్‌ కౌంట్‌ పడిపోతుంటుంది.  

ముక్కు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, గాయాలు తగలడం, మలంలో,యూరిన్లో  బ్లడ్‌ రావడం, వంటి వల్ల కూడా ప్లేట్‌ లెట్‌ కౌంట్‌ తగ్గిపోతుంది. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్‌ని సంప్రదించి,సరైన వైధ్య చికిత్స తీసుకొవడం మంచిది.  

 శరీరంలో ప్లేట్‌ లెట్స్‌ తగ్గినపుడు ఎవరో మరొకరి ఒంట్లోని ప్లేట్‌లెట్స్‌ కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది.  

 ప్లేట్‌ లెట్స్‌ పడిపోకుండా ఉండేందుకు, సంఖ్యను పెంచుకునేందుకు, లేదా వాటి సమతౌల్యాన్ని కాపాడుకునేందుకు  మనంతట మనమే కొన్ని ఆహారపధార్థాలను తీసుకోవడం ద్వారా జాగ్రత్త పడొచ్చు. 

ప్లేట్‌ లెట్స్‌ సంఖ్య తగ్గినపుడు దానిమ్మను తినడం చాలా మంచిది. దానిమ్మ పండు గింజలను తింటే రక్తం వృద్ధి చెందుతుంది. అలాగే ప్లేట్‌ లెట్స్‌ కౌంట్‌ కూడా పెరుగుతుంది. జ్యూస్‌ చేసుకొని తాగినా గానీ మంచి ఫలితం ఉంటుంది.

గుమ్మడి కాయలో కూడా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. గుమ్మడికాయను జ్యూస్‌లా చేసి,  లేదా మెత్తగా పేస్ట్‌లా చేసి ఆ  ఆ రసంలో కాసింత తేనె వేసుకొని తాగితే ప్లేట్‌ లెట్స్‌ కౌంట్‌ పెరుగుతుంది.

అలాగే ప్లేట్ లెట్ కోసం తీస్య్కోవాల్సిన మరో ముఖ్యమైన పండు బొప్పాయి. బొప్పాయి లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.  ప్లేట్‌ లెట్స్‌ సంఖ్య తగ్గినవాళ్లు బొప్పాయిని నిత్యం తీసుకుంటే, వెంటనే కౌంట్‌ పెరుగుతుంది. భవిష్యత్తులో ప్లేట్‌ లెట్‌ సంఖ్య తగ్గకుండా చూసుకోవాలనుకుంటే కూడా బొప్పాయిని తీసుకోవచ్చు. బొప్పాయి ఆకులను ఉడకబెట్టి వాటి రసాన్ని తీసి, ఆ తర్వాత ఆకులను తింటే ప్లేట్‌ లెట్స్‌ కౌంట్‌ పెరుగుతుంది.

ఇవే కాకుండా తగినంత నిద్రపోవడం, రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం వల్ల బ్లడ్‌ సర్క్యూలేషన్‌ మెరుగుపడి, ప్లేట్‌ లెట్‌ కౌంట్‌ పెరుగుతుంది. 

చేపలు వంటి సి ఫుడ్స్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ప్లేట్‌ లెట్‌ కౌంట్‌ని పెంచుకోవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. 

అలాగే టమోటాలు, నిమ్మ, ఆరంజ్‌ లాంటి పండ్లను డైలీ డైట్‌లో నేర్చుకోవడం వల్ల ప్లేట్‌ లెట్‌ కౌంట్‌ పెంచుకోవచ్చు


22, ఆగస్టు 2021, ఆదివారం

బ్లాక్‌ వాటర్‌ అంటే ఏంటి?

blackwater


ఈ మధ్య కాలంలో బ్లాక్ వాటర్‌ గురించి ఎక్కువగా వినపడుతోంది. 

సెలిబ్రిటీలు లేదా ఆరోగ్యంపట్ల ఎక్కువగా స్పృహ వున్నవాళ్ళు ఈ వాటర్‌ని తాగేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. 

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హీరోయిన్‌ శ్రుతిహాసన్‌, బాలీవుడ్ న‌టి మ‌లైకా ఆరోరా ఎప్పటి నుంచో ఈ నలుపు నీళ్లు తాగుతున్నారు.  

సోష‌ల్ మీడియాలో బ్లాక్ వాట‌ర్ గురించి ఇప్పుడు పెద్ద చర్చ జ‌రుగుతోంది. బ్లాక్‌ వాటర్‌ స్పెషల్‌ ఏంటి? ఈ నలుపు నీళ్లు ఎక్కడ దొరుకుతాయి? ఈ వాటర్‌ ధర ఎంత? అని నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. 

సాధార‌ణంగా మ‌నం తాగే మిన‌ర‌ల్ వాట‌ర్ ఖ‌రీదు ఒక లీట‌ర్‌కు రూ.20 నుంచి 30 వరకు ఉంటుంది. కానీ దానికి మూడింతలు ధరతో బ్లాక్ వాటర్ ల‌భిస్తుంది. లీటర్‌ బ్లాక్‌ వాటర్‌ బాటిల్‌కు దాదాపు రూ. 100 ఉంటుంది. 

ఈ వాటర్‌లో  ఆరోగ్యానికి సంబంధించి పలు ఉపయోగాలు దాగున్నాయి. 

లీట‌ర్ బ్లాక్ వాట‌ర్‌లో 70 మిన‌ర‌ల్స్ ఉంటాయి. అవి జీర్ణ‌శ‌క్తిని పెంపొందిస్తాయి.  ఈ వాటర్‌ తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. దాంతో పాటు మెటబాలిజం పెంపొందిస్తుంది. అలాగే అసిడిటీ ప్రాబ్లెం రాకుండా చూసుకుంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

వీటన్నింటితోపాటు వయసు కనపడకుండా నిత్య యవ్వనంగా కనిపించేలా చేసే పోషకాలు ఈ బ్లాక్ వాటర్ లో ఉంటాయట, 

ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే సెలబ్రిటీలు ఈ వాటర్‌ తాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 

21, ఆగస్టు 2021, శనివారం

చిరంజీవి 'గాడ్ ఫాదర్' మోషన్ పోస్టర్ రిలీజ్! MEGASTAR GOD FATHER

 

godfather


రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. 

రేపు చిరు బర్త్ డే సందర్భాన్ని పురస్కరించుకుని  'గాడ్ ఫాదర్'  మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు.

మలయళంలో మోహన్లాల్ హీరోగా నటించిన లూసీఫర్ మూవీనే తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్నారు. 

ఈ మూవీ కి మోహన్ రాజా దర్శకుడు కాగా, కొణిదెల ప్రొడక్షన్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

రేపు చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన తదుపరి సినిమాలకు సంబంధించిన అప్డేట్స్  విడుదలయ్యే అవకాశం  వుంది.

మోటరోలా ఎడ్జ్ 2021 స్మార్ట్​ఫోన్​ లాంచ్ Motorola Edge 2021


 

MOTOROLA EDGE 2021

మొబైల్​ తయారీ సంస్థ మోటరోలా(Motorola) ఈ మధ్య కాలంలో విడుదల చేసిన మోటరోలా ఎడ్జ్ సిరీస్​ 

ఎడ్జ్ 20, ఎడ్జ్ 20 లైట్, ఎడ్జ్ 20 ఫ్యూజన్, ఎడ్జ్ 20 ప్రో వరుసక్రమంలోనే ఇప్పుడు అమెరికాలో మరో కొత్త మోడల్​ను    ఎడ్జ్ 2021 మోడల్​ను ఆవిష్కరించింది.  

మోటరోలా ఎడ్జ్ 2021 సింగిల్​ వేరియంట్​లో మాత్రమే లభిస్తుంది. 8జీబీ ram ​/256gb స్టోరేజ్​ మోడల్ $ 500 రూ. ధర వద్ద రిలీజైంది. 

అయితే ఈ ప్రారంభపు ఆఫర్ ముగియడంతో ప్రస్తుతం ఇది $700 (సుమారు రూ. 52,000) ధర వద్ద అందుబాటులో ఉంది. 

మోటరోలా ఎడ్జ్ 2021 స్పెసిఫికేషన్లు

మోటరోలా ఎడ్జ్ 2021 స్మార్ట్​ఫోన్​ 6.4 -అంగుళాల ఫుల్ HD ప్లస్​ LCD ప్యానెల్‌తో వస్తుంది. 

ఇది స్నాప్‌డ్రాగన్ 778G SOC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. దీనిలో 8GB RAM, 256 జీబీ స్టోరేజ్‌ వుంది. ఇది 30W టర్బోపవర్ ఛార్జింగ్ సపోర్ట్‌ గల 5,000 MAH బ్యాటరీతో వస్తుంది.  

కెమెరా విషయానికి వస్తే, దీని వెనుకవైపు  ఇందులో 108 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ సెన్సార్ కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సార్ కెమెరాలతో  ట్రిపుల్-కెమెరాని అందించింది. 

ఇక, 32 MP ఫ్రంట్ కెమెరాను కూడా చేర్చింది. 

ఎడ్జ్ 2021 లో 4జీ సపోర్ట్​, వైఫై 6,5జీ, బ్లూటూత్, ఎన్​ఎఫ్​సీ వంటివి అందించింది. ఇక దీనిలోని సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్ IP52 రేటింగ్‌ను కలిగి ఉంటుంది. 

ప్రస్తుతానికి, మోటరోలా ఎడ్జ్ 2021 అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఏడాది చివరికల్లా కెనడాలో లాంచ్​ అవుతుంది. భారత్​తో సహా ఇతర దేశాల మార్కెట్​లో లాంచింగ్​పై ఎటువంటి వివరాలు ఇంకా తెలియరాలేదు. 

 


పిల్లల టీకా కి ఓకే చెప్పిన భారత్ ZyCoV-D Vaccine

blog/post/edit/4450771144974125185/8421846512807196846


 జైడస్ క్యాడిలాZydus సంస్థ తయారు చేసిన 'జైకోవ్ డి కోవిడ్​ వ్యాక్సిన్​'ZyCoV-D ఎమర్జెన్సీ వినియోగానికి భారత్​ గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. 

భారత్​లోనే తయారైన ఈ వ్యాక్సీన్​కి డ్రగ్ రెగ్యులేటర్ నుంచి ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ (EUA) అన్నీ అనుమతుల్నీ మంజూరుచేసింది. 

ఈ వ్యాక్సిన్​ను పెద్దలకే కాదు,12 నుంచి 18 సంవత్సరాల మధ్య గల పిల్లలకి కూడా ఉపయోగించవచ్చు.

పిల్లల కోసం అందుబాటులోకి వచ్చిన మొట్టమొదటి భారతీయ వ్యాక్సిన్​గా దీన్నిచెప్పుకోవచ్చు. 

ఈ వ్యాక్సిన్​ ద్వారా దేశం కరోనాతో పూర్తి స్థాయిలో పోరాడుతోందని ప్రధాని మోడి ప్రకటించారు.

భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కోవాగ్జిన్, జైడస్ క్యాడిలా ఉత్పత్తి చేసిన 'జైకోవ్ డి ' ZyCoV-D  రెండు వ్యాక్సీన్లు మాత్రమే భారత్​లో పిల్లలపై ప్రయోగాలు చేస్తున్నాయి. 

భారత్​లోనే తయారుచేయబడిన రెండో వ్యాక్సీన్ ఇది. 

ఈ వ్యాక్సీన్ ని పెద్దలు, 12 సంవత్సరాల కంటే పెద్ద పిల్లలు తీసుకోవచ్చు.   

ఈ 'జైకోవ్ డి' వ్యాక్సీన్ మూడు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి డోసు తీసుకున్న తర్వాత 28 రోజులకు రెండో డోస్ ఆ తర్వాత 56వ రోజు మూడో డోస్ తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ వ్యాక్సీన్‌ లో మరొక విశేషం ఏంటంటే అన్ని వ్యాక్సీన్లలా ఇంజెక్షన్ రూపంలో కాకుండా, పెయిన్ లెస్ ఇంట్రాడర్మల్ అప్లికేటర్ ద్వారా వేస్తారు.. సూది ఉండదుకాబట్టి పిల్లలకు నొప్పితెలియకుండా ఈ వ్యాక్సీన్ ఇవ్వొచ్చు.

కాగా ఈ వాక్సిన్ ని 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ మధ్యలో దీన్ని నిల్వ చేయాల్సి ఉంటుంది.ఈ వ్యాక్సీన్ ధర ఇంకా నిర్ణయించలేదు. 

ఆగస్టు నుంచి డిసెంబర్ లోపల 216 కోట్ల వ్యాక్సీన్ డోసులు సిద్ధమవుతాయని Zydus కంపెని ప్రకటించింది. 


ఇక ముగ్గురేసి పిల్లల్ని కనొచ్చు! CHINA

 

china


చైనాలో జంటలు ఇక ముగ్గురేసి పిల్లల్ని కనొచ్చు. 

ఈ మేరకు అధికార కమ్యూనిస్టుపార్టీ తెచ్చిన ప్రతిపాదనకు దేశ పార్లమెంటు 'నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌' లోని స్థాయీ సంఘం శుక్రవారం లాంఛనంగా ఆమోదముద్ర వేసింది. 

ఇందుకు అనుగుణంగా జనాభా,కుటుంబ నియంత్రణచట్టాన్ని ఫార్లమెంట్ సవరించింది. 

గత దశాబ్ధకాలంలో పొరుగుదేశం భారత్ లో జనాభా తమ దేశం కంటే వేగంగా పెరుగుతుండటం, అలాగే చైనాలో  వేగంగా తగ్గిపోతున్న జననాల రేటును దృష్టిలో పెట్టుకుని ఈ చట్టాన్ని ముందుకు తీసుకువచ్చారు.

పెరుగుతున్న ఖర్చుల వల్లగాని, అధిక సంతానం పట్ల దంపతుల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేఖతను తగ్గించడానికి చైనా  ఈ చట్టంలో అనేక సామాజిక, ఆర్థిక తోడ్పాటు చర్యలను ప్రకటించింది.

 కుటుంబాలపై పడే ఆర్థికభారం, పిల్లల్ని పెంచడానికి, చదువు చెప్పించడానికి అయ్యే వ్యయాలకోసంగాను  ప్రభుత్వం ఆర్థికసాయం, పన్నులు, బీమా, విద్య, గృహ నిర్మాణం, ఉపాధి వంటి అంశాల్లో పలు ఉపశమన చర్యలను   చేపడుతుంది. 

దీర్ఘకాల జనాభావృద్ధిని ప్రోత్సహించడానికి చైనా కమ్యూనిస్టు పార్టీ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 

దాని ప్రకారం ఇద్దరు పిల్లల విధానాన్ని సడలించాలని, ముగ్గురు పిల్లల్ని కనేందుకు అనుమతించాలని సూచించింది. 

2016 కు ముందు దశాబ్దాల పాటు చైనాలో ఏక సంతాన విధానం ఉండేది. 


20, ఆగస్టు 2021, శుక్రవారం

హీరోగా బండ్ల గణేష్! BANDLA GANESH AS HERO!


BANDLA GANESH AS HERO


 నటుడు, భారీచిత్రాల నిర్మాత, మరియు రాజకీయనేత బండ్ల గణేశ్ కథానాయకుడిగా మారబోతున్నారు. 

తమిళంలో ఘనవిజయం సాధించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ 'ఒత్త సెరుప్పు అళవు7' (సింగిల్‌ స్లిప్పర్‌ సైజ్-7) మూవీని గణేష్ తెలుగులో రీమేక్ చేయబొతున్నారు. 

తమిళంలో స్వీయదర్శకత్వంలో పార్థీబన్ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సాధించడమే కాకుండా పలు అవార్డులను సొంతంచేసుకుంది.

ఈ సినిమాలో వున్న మరో విశేషం ఏంటంటే  మూవీ మొత్తం ఒకే ఒక క్యారెక్టర్‌ వుంతుంది. కాగా ఈ సినిమాను హిందీలో అభిషేక్‌ బచ్చన్‌ రీమేక్‌ చేస్తుడటం గమనార్హం.

తెలుగు రీమేక్‌కు వెంకట్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. 

సెప్టెంబరు ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది.

రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చిన ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్ Facebook removes Rahul Gandhi’s post!

rahuljee


 కాంగ్రెస్ పార్టీనేత రాహుల్ గాంధీకి ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్ Facebook, Instagramm భారీ షాక్ ఇచ్చాయి.

 ఫేస్‌బుక్ వేదికగా రాహుల్ గాంధీ చేసిన పోస్ట్ వల్ల  ఓ మైనర్ బాలిక కుటుంబసభ్యుల వివరాలు భహిర్గతం కావడంతో సదరు సంస్థలు పై చర్యను తీసుకున్నాయి. 

రాహుల్ గాంధీ పెట్టిన ఓ వివాస్పద పోస్ట్‌ను ఫేస్ బుక్ తొలగించింది. 

ఢిల్లీలో అత్యాచారం చేయబడి, దారుణహత్యకు గురైన, మైనర్ బాలిక కుటుంబసభ్యుల వివరాలను ఫేస్‌బుక్ వేదికగా రాహుల్ గాంధీ పోస్ట్ చేశారు. 

ప్రజల అభ్యంతరకర దృశ్యాలను, చిత్రాలను పోస్ట్ చేసినందుకు తొలగించామని, ఫేస్ బుక్, మరియు ఇన్ స్టాగ్రాం  వెల్లడించాయి.  

 మైనర్ బాధితురాలి తల్లిదండ్రుల గుర్తింపును వెల్లడించింది కాబట్టి ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్ లు రాహుల్ గాంధీ పోస్ట్‌ను తొలగించడం జరిగింది.  

అనేక అభ్యంతరాలు రావడంతో  మంగళవారం, ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోకు సంబంధించి  రాహుల్ గాంధీకి FACEBOOK నోటీసు జారీ చేసింది. బాధితుడి వివరాలను వెల్లడించినందుకు వివరణ ఇవ్వాలని కోరింది. ఆయన దగ్గరనుంచి  ఎలాంటి స్పందన లేకపోవడంతో పోస్ట్‌ను తొలగిస్తున్నట్లు పేర్కొంది.

 అటు రాహుల్ గాంధీ పోస్ట్ చేసిన వీడియోపై యాక్షన్ రిపోర్టుతో కావాలని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) ఫేస్‌బుక్‌ను కోరిన తర్వాత, రాహుల్ గాంధి పోస్ట్ మీద ఇలాంటి చర్యలు తీసుకున్నట్టు తెలిసింది.

మధుమేహం ఉన్నవారు ఏం తినాలి? Diabetic care

 మధుమేహం ఉన్నవారు ఏం తినాలి?



ఈరోజు WHO  లెక్కలప్రకారం దాదాపు  45 కొట్ల మందికి పైగా డయాబెటిక్ Diabetic పేషంట్లు  ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు.

ఇందులో ప్రతి సంవత్సరం 10 లక్షలమందికి పైగా సుగర్ వ్యాధి వలన మరణిస్తున్నారు. 

చికిత్స తప్ప, నివారణ పూర్తిగా లేని ఈ వ్యాదిని అదుపులో ఉంచుకోవడానికి, కొన్ని ఆహారపదార్థాలు ఉన్నాయి.

ఇవి బ్లడ్‌లో షుగర్‌ లెవల్స్‌‌‌ sugar level ను అదుపులో ఉంచుతాయి.

డయాబెటిక్ పేషంట్లు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం కాబట్టి  వ్యాధి   వల్ల వచ్చే గుండె సంబంధిత సమస్యలు, హార్ట్ స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధులు, అంధత్వం మొదలైన వాటి ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే కష్టమైనా సరే కొన్ని తినాల్సివస్తుంది.   

చక్కెర స్థాయిలను సహజంగా నియంత్రించే ఆహారాలను సుగర్ పేషంట్లు తరచూ   గా తీసుకుంటూ ఉండాలి. 

అలాంటి కొన్ని ఆహారపదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము.

 ఫ్లేవనాయిడ్స్, గ్లైకోసైడ్స్, ట్రైటెర్పెనాయిడ్స్ Flavonoids , Glycosides, Triterpenoids అనే రసాయనాలు వేపలో ఉంటాయి. ఇవి రక్తంలోని గ్లూకోజ్ అదుపుచేయడంలో సహాయపడతాయి. వేపను  రోజుకు రెండుసార్లు పొడి రూపంలో  తీసుకోవచ్చు లేదా టీ, గోరువెచ్చని నీటితో నైనా కలిపి తీసుకోవచ్చు.

మధుమేహంతో భాదపడేవారికి  కాకరకాయ రసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో చరాటిన్, మోమోర్డిసిన్ ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. 

అలాగే మన వంటగదిలో నిత్యం కనిపించే  అల్లం  లెక్కలేనన్ని ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇన్సులిన్ insulin  ని నియంత్రించడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఇలాంటిదే మరొకటి నేరేడు పండు. దీనిలో జామోబోలిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఈ పండు యొక్క విత్తనం కూడా సుగర్ నియంత్రణలో అత్యంత ప్రభావాన్ని చూపుతుంది.

శరీరంలో గ్లూకోస్ టాలరెన్స్ glucose tolerance ని మెరుగుపరచడంలో మెంతి కూర కూడా సహాయపడుతుంది. ఇందులో ఉన్న  ఫైబర్   చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.

వీటికితోడుగా ఆరోగ్యకరమైన జీవనశైలి, యోగా, వాకింగ్, లాంటివి కలిగివుంటే సుగర్ వ్యాదిని అదుపులో వుంచుకోవడం సాధ్యమవుతుంది.





మొదటి మ్యాచ్‌లోనే ఫాస్టెస్ట్ ఆఫ్ సెంచెరీ! fastest half century in debut match !

 

fastest half century in debut match


అరంగేట్రం మ్యాచ్ ఆడుతున్నప్పుడు సహజంగా కలిగే తడబాటు,  భారీ అంచనాల ఒత్తిడినీ అదిగమించి   ఓ యువ క్రికెటర్ తన మొదటి మ్యాచ్ లోనే వేగవంతమైన అర్దసెంచెరీ fastest half century సాధించాడు.

రువాండా బ్యాట్స్‌మెన్ మార్టిన్ అకాయెజు వయస్సు 18 ఏళ్లు మాత్రమే. కానీ తను ఆడిన మొదటి మ్యాచ్ లోనే   బౌలర్లపై సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడి, 16 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. 

ఘనా, రువాండా జట్ల మధ్య జరుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ లో, అంతర్జాతీయ క్రికెట్‌ మొదటి మ్యాచ్ ఆడుతున్న మార్టిన్ అకాయెజు 16 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించి, తన జట్టుని విజపథాన నడిపాడు.

19, ఆగస్టు 2021, గురువారం

ప్రధానికి గుడి! Temple for Modi!

temple of modi


 రాజకీయ నాయకులకు, సెలబ్రిటీలకు వారి వారి అభిమానులు గుడులు కట్టించడం అనేవిషయం అప్పుడప్పుడూ మనం వింటూనే ఉంటాము. 

ఈ క్రమంలోనే తాజాగా మహారాష్ట్రలోని పుణేలో బీజేపీ కార్యకర్త ఒకరు ప్రధాని నరేంద్రమోదీకి చిన్నసైజు దేవాలయం నిర్మించి, అందులో MODI గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు..

 మహారష్త్ర పుణెకు చెందిన  మయూర్‌ ముండే అనే  మోడీకి విరాభిమాని, ప్రథానిపై తనకున్న అభిమానాన్ని చాటుతూ ఏకంగా రూ. 2 లక్షల రూపాయల ఖర్చుతో temple నిర్మించాడు. 

ఇందు కోసంగాను మయూర్‌ జైపూర్‌ మార్బల్‌ను ఉపయోగించాడు. 

మయూర్‌ మాట్లాడుతూ.. ఆయోధ్యలో రాముడికి దేవాలయాన్ని నిర్మించిన వ్యక్తికి ఓ దేవాలయం ఉండాలనేది నా భావన. అందుకోసమే మోదీకి ఆలయాన్ని నిర్మించాను’అని చెప్పుకొచ్చాడు.

కానీ ట్విస్ట్ ఏమిటంటే ఈ దేవాలయ విషయం పి.యం.ఓ కి చేరడంతో  రాత్రికిరాత్రే విగ్రహాన్ని తొలగించేసారు. 

ఆలయానికి సంబంధించిన వార్త మీడియాలో రావడంతో బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది.    

రియల్ మీ మొదటి ల్యాప్ టాప్ 'REALME LAPTOP 'REALITY BOOK'

/post/edit/4450771144974125185/3730116090524131540


 రియల్‌మీ ఈరోజు తన మొదటి ల్యాప్‌టాప్ 'రియాలిటీ బుక్‌ను' ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది.  

అధునాతనమైన ఫీచర్స్ గల రియాలిటీ బుక్  కొనుగోలుదారుల  అంచనాలు పెంచేలా వుంది.

రియల్‌మీ రియాలిటీ బుక్ డిజైన్, ఫీచర్లు,స్పెసిఫికేషన్‌లు మొదలగు వివరాలు ఈవిధంగా వున్నాయి. 

 ఈ ల్యాప్‌టాప్‌కు 15.5 మిమీ మందంగల  స్లిమ్ డిజైన్ ఇచ్చారు.  బరువు 1.38 కిలోలు.  

ఆపిల్ మాక్‌బుక్ తో పోల్చి చూస్తే దీన్ని మరింత స్లిమ్ గా తయారుచేసారు.  

 ల్యాప్‌టాప్‌ మెటల్ బాడీతో వుండటంవల్ల స్ట్రాంగా వుంటుందని చెప్పొచ్చు.

14 అంగుళాల 2కే ఫుల్ విజన్ ఐపియస్ డిస్‌ప్లేని కలిగివుంది.     

 ఐరిస్ Xa ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్‌తో 11 వ జనరేషన్ ఇంటెల్ కోర్ i5 చిప్‌సెట్ ఈ ల్యాప్‌టాప్‌కు అమర్చారు. 

ఈ ల్యాప్‌టాప్ 512 GB వరకు SSD స్టోరేజ్ అలాగే, 8 GB ర్యాం వరకు లభిస్తుంది.   

 ల్యాప్ టాప్ వేడెక్కకుండా దీనికి డ్యూయల్ ఫ్యాన్ కూలింగ్ సిస్టమ్‌ను అమర్చారు. 

ఇక వైఫై 6 టెక్నాలజీ కనెక్టివిటీతో అందుబాటులోకి వస్తుంది.

ఇందులో 65 వాట్స్ సూపర్ ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీ సపోర్ట్ గా ఇచ్చారు. అందువల్ల ఇది 30 నిమిషాల్లో 50% వరకు ఛార్జ్ అవుతుంది. 

సింగిల్ ఛార్జ్‌లో 11 గంటల బ్యాకప్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.    

ముందుగా విండోస్ 10 తో ఇన్‌స్టాల్ చేయబడి, విండోస్ 11 ని ఉచితంగా అప్‌డేట్ సౌకర్యాన్ని కలగజేసింది.

 సౌండ్ క్వాలిటీ కోసం, ఇందులో డ్యూయెల్ ఆడియో సపోర్ట్ ఇవ్వగల  హర్మన్ కంపెనీ 2 స్పీకర్లు ఉన్నాయి. 

ఫింగర్ సెన్సార్ ని  పవర్ బటన్‌లో ఇచ్చారు.  

 ఫోన్‌ని ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసుకోవడానికి  కనెక్ట్ టెక్నాలజీని అమర్చారు.

దీనిని రెండు వేరియంట్లలో లాంచ్ చేశారు. 

ఇంటెల్ కోర్ i3 చిప్‌సెట్, 8mb ram, 256 GB ఉన్న వేరియంట్ ధర రూ .44,999. 

ఇంటెల్ కోర్ i5 చిప్‌సెట్, 8mb ram, 512 GB వేరియంట్ ధర రూ .56,999. 

ఫ్లిప్‌కార్ట్, లేదాకంపెనీ అధికారిక వెబ్‌సైట్, అలాగే ఆన్ లైన్ స్టోర్‌ల నుండి కూడా కొనుగోలుచేయవచ్చు.  

ఆగస్టు 30 న మధ్యాహ్నం 12 గంటలనుండి ల్యాప్టాప్ అమ్మకాలు ప్రారంభమవుతాయి.



18, ఆగస్టు 2021, బుధవారం

వాడి పడేసిన టిష్యూ పేపర్ ధర రూ.7.50 కోట్లు!! messi "used tissue paper" at auction




 మీరు చదివింది అక్షరాల నిజం. 

వాడి కిందపడేసిన ఆ టిష్యూ పేపర్‌ను ఏకంగా రూ.7.5 కోట్లకు ఆన్‌లైన్‌లో వేలానికి పెట్టారు!

వెర్రి వేయివిధాలని అంటారు. అభిమానం పీక్స్ కి వెళ్ళిపోతే ఎలావుంటుందో అనేదానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణగా నిలుస్తుంది. 

 సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ వాడి, కిందపడేసిన ఆ టిష్యూ పేపర్‌ను Tissue paper ఏకంగా రూ.7.5 కోట్లకు ఆన్‌లైన్‌ వేలంలో అమ్మకానికి పెట్టారు.

ఇటీవల లియోనల్ మెస్సీ ఫుట్‌బాల్ క్లబ్‌ బార్సిలోనాకు గుడ్‌బై చెప్పాడు. ఈ సందర్భంగా మెస్సీ Messi కాస్త ఎమోషనల్ అయ్యాడు.

బార్సిలోనాతో తన రెండు దశాబ్ధాల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఉబికి వస్తున్న కన్నీటిని ఓ టిష్యూ పేపర్‌తో తుడుచుకున్నాడు.

ఆ టిష్యు పేపర్ని సేకరించి పెట్టుకున్న ఓ అభిమాని ఒక వెబ్సైట్లో అమ్మకానికి పెట్టాడు.

 ఏకంగా సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ కన్నీరు తుడిచిన టిష్యూ పేపర్‌ను దక్కించుకునేందుకు మెస్సీ వీరాభిమానులు చాలా మంది పోటీపడుతారని భావిస్తున్నారు. 

వేలంలో దాని ధరను 1 మిలియన్ డాలర్లు  (రూ.7.5 కోట్లు) గా నిర్ణయించారు. 

మెస్సీ కన్నీరు తుడిచిన టిష్యూను దక్కించుకోండంటూ ఆన్‌లైన్ యాడ్స్ కూడా ఇచ్చారు. 

దీంతో ఆ టిష్యూ పేపర్‌కు ఆయన వీరాభిమానుల మధ్య గట్టి పోటీ నెలకొంటోంది. వేలంపాటలో సదరు టిష్యు పేపర్ ఎంత ధరను తాకుతుందో చూడాలి.


వాట్సాప్ లో న్యూ ఫీచర్! NEW FEATURE IN WHATSAPP


 

whats app

మార్కెట్‌లో పోటీని తట్టుకునేందుకుగాను ఎప్పటికప్పుడు  వాట్సాప్ సరికొత్త ఫీచర్స్ తీసుకొస్తోంది. 

 యూపీఐ ద్వారా పేమెంట్స్ చేసేందుకుగాను ఫెసిలిటీ కల్పించిన వాట్సాప్, తజాగా  పేమెంట్ చేసే క్రమంలో న్యూ ఫీచర్‌ను తీసుకొచ్చింది. అదేంటంటే, పేమెంట్స్ చేసేటపుడు అందుకు తగ్గిన భావాన్ని కూడా ఇమేజ్ లేదా, ఇతర థీం రూపంలో చెప్పే సౌలభ్యం వుంటుంది. 

ఇప్పటికే గూగుల్ పే యాప్‌లో పేమెంట్‌తో పాటు బ్యాక్ గౌండ్‌లో అందుకు తగ్గ భావాన్ని తెలిపేలా థీమ్ లేదా ఇమేజ్ కూడా జతచేసే ఫీచర్ వుంది. అలానే వాట్సాప్‌లోనూ పేమెంట్ చెల్లింపుతో పాటుగా థీమ్ కూడా సెండ్ అయ్యేలా అప్‌డేట్ తీసుకొచ్చింది.

కానీ ఈ థీమ్‌ను కేవలం ఇండియాలోని వాట్సాప్ యూజర్స్‌కు మాత్రమే అందుబాటులో తీసుకురావడం విశేషం. 

వినియోగదారులు మనీ సెండ్ చేసే సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌ థీమ్‌ ద్వారా తమ ఎక్స్‌ప్రెషన్స్ కూడా వ్యక్తపరచొచ్చని వాట్సాప్ తెలిపింది.  

ఇకమీదట సందర్భాన్నిబట్టి  బ్యాక్ గ్రౌండ్ థీమ్‌ను ఎంచుకొని యూజర్స్ తమ భావాన్ని తెలుపొచ్చు. 

 ఇలా  వాట్సాప్ వినియోగదారులు మనీతో పాటు థీమ్ సెండ్ చేయడం ద్వారా అనుభూతులు, భావాలను కూడా పంచుకున్నట్లు అవుతుంది.  


హెల్త్ కి ఉప్పు కీడుచేస్తుందా? HEALTH ISSUES WITH SALT

https://linktelugu.blogspot.com/2021/08/httpslinktelugu.blogspot.comsalt.html

HEALTH ISSUES WITH SALT

 కూరల్లో రుచికోసం గానీ, నిల్వచేసుకునే ఊరగాయల్లాంటి వాటికోసం గానీ విరివిగా వాడే ఉప్పుకు చాలా ప్రాధాన్యత వుంది. 

ముఖ్యంగా ఉప్పుని ఆసియా వైపు దేశాలు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

  ఉప్పు సముద్రపు నీటితో తయారవుతుంది. దీనిలో సోడియం క్లోరైడ్ అనే రసాయనం వుంటుంది.     

 ఉప్పు గురించి శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో హెల్త్ కి సంబంధించి పలు విషయాలు వెలుగుచూశాయి.  

ప్రతి ఆహారపదార్థంలోనూ మనం తప్పక వాడుతున్న ఉప్పుతో చాలా జాగ్రత్తగా ఉండాలి. 

ఉప్పు ఎక్కువగా వాడటం వల్ల హైబీపీ సమస్యలతో పాటుగా, ఎముకల సమస్యలు కూడా వస్తాయి.

ఉప్పు ఎక్కువగా తీసుకునే వారిలో గుండెజబ్బులు, ఒబేసిటీ, కిడ్నీసమస్యలు, జీర్ణకోశ క్యాన్సర్‌ వంటి సమస్యలు వస్తాయి. అలాగే  మంట, నొప్పి, దురదల వంటివి వస్తాయి. 

బాడీలో షుగర్ కంట్రోల్ గా ఉంచుకోవడం కోసం కూడా సాల్ట్ కంటెంట్ తక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి.  

షుగర్ ఎక్కువ తీసుకుంటే ఎంత ప్రమాదమో, ఉప్పు వాడినా కూడా అంతే ప్రమాదం వుంది.  

ఒక మనిషి రోజుకి 6 గ్రాముల ఉప్పుమాత్రమే తీసుకోవాలని పరిశోథనలు తెలియజేస్తున్నాయి.

డబ్ల్యూ హెచ్ వో కూడా ఉప్పు రెగ్యులర్ గా వాడుకోవడాన్ని కంట్రోల్ చెయ్యాలని సూచించింది.  

ఉప్పు వలన కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఉప్పు మన శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుతుంది. శరీరంలోని ఆమ్లక్షార వ్యవస్థను క్రమబద్దీకరించే చర్యలో సోడియం ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది. 

సోడియం తగ్గితే  హార్మోనులు పంపే సంకేతాలు శరీరంలో సరిగా ప్రసరించవు. ఇంకా విషాహారం వలన జీర్ణవ్యవస్థలో  కలిగే అసౌకర్యాన్ని ఉప్పునీరు నియంత్రిస్తుంది. 


ట్విటర్‌ కీలక నిర్ణయం!

twitter


సోషల్ నెట్‌వర్కింగ్ సర్వీస్ ట్విటర్ సంచలన నిర్ణయం తీసుకుంది. 

ట్విటర్‌ ఖాతాలకు ఇచ్చే బ్లూటిక్‌ మార్క్‌ వెరిఫికేషన్ ప్రోగ్రామ్‌ను రివ్యూ ప్రాసెస్‌లో భాగంగా బ్లూటిక్‌ సేవలను ట్విటర్‌ నిలిపివేసినట్లు తెలిసింది.

 దీనివల్ల  కొత్త ట్విటర్‌ ఖాతాల బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ కోసం వచ్చే దరఖాస్తులను తీసుకోవడం జరగదు. 

గతవారంలో పలుఖాతాలను తప్పుగా వెరిఫికేషన్‌ చేసి బ్లూటిక్‌ను ఇచ్చినట్లు ట్విటర్‌ నిర్ధారించింది.  ఈ కారణం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కానీ ఈమధ్య కాలంలో ట్విటర్‌ ఖాతాల వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసి ఉంటే వారికి బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

  రాబోయే కొన్ని వారాల్లో బ్లూటిక్‌ వెరిఫికేషన్‌కు వచ్చే దరఖాస్తులను తిరిగి ప్రారంభిస్తామని ట్విటర్‌ ప్రతినిధి వెల్లడించారు.  ఇంతకుముందు 2017 సంవత్సరంలో, ఈ ఏడాది మొదట్లో కూడా బ్లూటిక్‌ సేవలను ట్విటర్‌ నిలిపివేసింది. 

 ట్విటర్ గత రెండు నెలల క్రితం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కొంతమంది పొలిటికల్ లీడర్ల ట్విటర్‌ ఎకౌంట్లకు  బ్లూ టిక్ తీసేసింది. తరువాత వచ్చిన నిరసనల నేపధ్యంలో మళ్ళీ ఆ టిక్‌లు ఇచ్చేసింది. 

ఈ వివాస్పద నిర్ణయం వల్ల  భారతప్రభుత్వం ట్విటర్‌కు  అల్టిమేటం జారీచేసింది. ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల విషయంలో కచ్చితంగా ట్విటర్‌ ప్రతి స్పందించాల్సిందే అని తేల్చి చెప్పింది. 


హత్య కేసులో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నిర్దోషి! SASHI THAROOR OUT OF MURDER CASE

 

SASITHAROOR


 2014సం.లో  దేశవ్యాప్తంగా సంచలనం సృష్ఠంచిన సునంద పుష్కర్ మృతి కేసులో, నిందితుడైన ఆమె భర్త కాంగ్రెస్ పొలిటికల్ లీడ్qర్, ఎంపి శశిథరూర్ ను ఢిల్లీ సెషన్స్ కోర్టు బుధవారం నిర్దోషిగా ప్రకటించింది. 

2014 సంవత్సరం జనవరి నెలలో సునంద పుష్కర్ హోటల్ గదిలో శవమై కనిపించారు. 

మరణించిన సమయంలో సునంద మోతాదుమించి డ్రగ్స్ తీసుకున్నట్లు వైద్య నివేదిక సూచించింది. సునందపుష్కర్ కేసును హత్య అనే కోణంలో పోలీసులు విచారణ జరిపారు.  

ఆత్మహత్య ప్రేరణ కింద కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పై కేరళ పోలీసులు కేసు నమోదు చేసారు. ఈ కేసును ఢిల్లీ సెషన్స్ కోర్టు  డిశ్చార్జ్ చేసింది.

17, ఆగస్టు 2021, మంగళవారం

తాలిబన్లకు ఫేస్ బుక్ షాక్ !


FACEBOOK,INSTAGRAM


 అఫ్ఘనిస్తాన్లో అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లకు సోషియల్ మీడియా దిగ్గజం షాక్ ఇచ్చింది.

ఫేస్‌బుక్ తన విధానాల ప్రకారం తాలిబాన్ సేవలను నిషేధించింది.

అమెరికా చట్టం ప్రకారం తాలిబాన్ ఒక ఉగ్రవాద సంస్థ అని ఫేస్ బుక్ ఒక ప్రకటన విడుదల చేసింది.  తాలిబాన్ ఫేస్బుక్ అకౌంట్ ను నిషేధించింది.

 అధికారాన్ని చేజిక్కించుకున్న వెంటనే తాలిబాన్లు ఫేస్ బుక్‌లో ఖాతా తెరిచి,  వారికి సంబంధించిన  పోస్టులు పెడుతున్నారు. ఇది గమనించిన ఫేస్ బుక్ వెంటనే తొలిగించడం మొదలు పెట్టింది. అంతేకాదు నిషేదం కూడా పెట్టింది. ఇతర ఖాతాలనుంచి తాలిబాన్‌లను ప్రోత్సహించే కంటెంట్‌ను కూడా బ్రేక్ చేసింది ఫేస్‌బుక్.

ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్ అధినేత ఆడమ్ మోసేరి బ్లూమ్‌బెర్గ్  మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్ సంస్థ పేరు టెర్రరిస్టు జాబితాలో ఉన్నందున వారి గ్రూప్‌ని ప్రోత్సహించే లేదా ప్రాతినిధ్యం వహించే ఏ కంటెంటైనా నిషేధించబడిందని తెలిపారు.