google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: డయాబెటిక్ రోగులకు ఉపయోగపడే పెరటి మొక్కలు Backyard plants that useful for diabetic patients.

31, ఆగస్టు 2021, మంగళవారం

డయాబెటిక్ రోగులకు ఉపయోగపడే పెరటి మొక్కలు Backyard plants that useful for diabetic patients.

 డయాబెటిక్ రోగులకు ఉపయోగపడే పెరటి మొక్కలు. 

శరీరంలో ఇన్సూలిన్ తక్కువగా విడుదలైనప్పుడు మధుమేహం సమస్య వస్తుంది. మారుతున్న జీవనశైలితో ఊబకాయం, ఒత్తిడి వంటి సమస్యలతో  డయాబెటిక్ ప్రమాదం తొందరగా వచ్చే అవకాశం వుంటుంది.

ప్రపంచంలో దాదాపు 45 కోట్ల మంది డయాబెటిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు.  ఒక్కసారి డయాబెటిక్ బారీన పడితే నియంత్రణ చాలా కష్టమవుతోంది. నిత్యం మందులతో సహజీవనం చేయాల్సి వస్తోంది.

అయితే కేవలం కెమికల్ ట్యాబ్లెట్స్ మాత్రమే కాకుండా.. ఆయుర్వేద పద్దతులను అనుసరించడం ద్వారా కూడా డయాబెటిక్ సమస్యను నియంత్రించవచ్చు. ముఖ్యంగా మన ఇంట్లోనే కనిపించే కొన్ని మొక్కల ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు. 

వాటి గురించి తెలుసుకుందాం.

కలబంద మొక్క.

aloe vera plant for diabetic patients


కలబంద చాలా సమస్యలకు నివారిణి గా ఉపయోగపడ్తుంది. దీని లోపలి గుజ్జును శుభ్రం చేసుకుని కొద్దికొద్దిగా అలాగే తీసుకోవచ్చు. ఇది డయాబెటిక్ రోగులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రక్తంలో షుగర్ లెవల్స్‏ను కంట్రోల్ చేయడానికి సహాయపడే కొన్ని పదార్థాలు ఇందులో ఉన్నాయి. రక్తంలో గ్లూకోజ్ మొత్తాన్ని నియంత్రించడానికి కలబంద గొప్పగా పనిచేస్తుంది.

ఇన్సులిన్ ప్లాంట్.

Insulin Plant for Dibetic people


కాస్టస్ ఇగ్నెయస్ లేదా స్పైరల్ ఫ్లాగ్ అని పిలిచే ఈ ఇన్సులిన్ మొక్కకు ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్క డయాబెటిక్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మొక్క ఆకులు పుల్లగా ఉంటాయి. ఈ ఆకులను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించవచ్చు.

స్టెవియా ప్లాంట్.

stevia plant for diabetic patients


స్టెవియా మొక్క డయాబెటిక్ రోగులకు చాలా ఉపయోగపడుతుంది.. దీని ఆకులు తియ్యగా ఉంటాయి.ఈ ఆకులను పొడి చేసి టీ, లేదా షర్భత్‏లలో చక్కెరగా ఉపయోగించవచ్చు. దీని ఆకులు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఉపయోగపడతాయి. ఇందులో జీరో కేలరీలు ఉంటాయి. అలాగే సుగర్ వ్యాధిగ్రస్థుల శరీరంలోని కేలరీలను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది.

 వేప ఆకులు.

neem leaves help diabetic patients


డయాబెటిస్ ను నియంత్రించడంలో వేప అనేది దివ్యఔషదం. ఆయుర్వేదంలో వేప ఆకులకు చాలా ప్రాముఖ్యత ఉంది. వేప ఆకులలో గ్లైకోసైడ్స్, ఇంకా అనేక యాంటీ-వైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ మొత్తాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి