google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: జోరుగా వ్యాక్సినేషన్ Covid-19 vaccination

17, ఆగస్టు 2021, మంగళవారం

జోరుగా వ్యాక్సినేషన్ Covid-19 vaccination

 



VACCINATION


దేశంలో కరోనా విజృంభణ గత కొద్దిరోజులుగా నిలకడ ఉంది. 

కరోనా సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుండటంతో ప్రజలు తమతమ దైనందిన కార్యక్రమాల్లో మునిగిపోతున్నారు.

 దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ ప్రమాదం పొంచిఉందన్న వైద్య నిపుణుల సూచనలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా వుంది. 

దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేయడంతోపాటుగా  వ్యాక్సిన్ ఉత్పత్తిని సైతం వేగంగా చేపట్టేలా ప్రణాలికలను సిద్దం చేస్తోంది.  

ఈ క్రమంలో భారత్ లో టీకాడ్రైవ్‌ ముమ్మరంగా కొనసాగుతున్నది. సోమవారం రికార్డు స్థాయిలో 86.29లక్షల మందికి టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది.

దేశవ్యాప్తంగా వేసిన టీకా మోతాదుల సంఖ్య 55 కోట్ల మార్క్‌ను దాటిందని వెల్లడించింది. నిన్న ఒక్కరోజే  18-44 సంవత్సరాల వారు 31,44,650 మందికి తొలిడోస్, 5,22,629 మందికి సెకండ్‌ డోసు అందజేసినట్లు చెప్పింది. 

మూడో దశ టీకా డ్రైవ్‌ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 18-44 ఏళ్ల మధ్య 20,00,68,334 మంది మొదటి డోసు ఇచ్చారు. మరో 1,59,35,853 మందికి రెండో మోతాదు ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి