google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: తాలిబన్ల బడులు తెరుచుకున్నాయి!

16, ఆగస్టు 2021, సోమవారం

తాలిబన్ల బడులు తెరుచుకున్నాయి!

 


అఫ్ఘన్ భాషలో తాలిబన్ అంటే విధ్యార్థి అని అర్థం. ఇప్పుడా విధ్యార్దులే అఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించి తమదైన శైలిలో ఇకనుంచి ప్రపంచానికి పాఠాలు నేర్పబొతున్నారు.

ఆఫ్గనిస్థాన్‌‌‌‌లో ఇరవైయేళ్ళ తర్వాత తాలిబన్ల శకం మళ్లీ మొదలయ్యింది. ఆఫ్గనిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని దేశం విడిచి పారిపోయారు.

దేశంలో యుద్ధం ముగిసినట్లు తాలిబన్లు ప్రకటించుకున్నారు. 

ఆఫ్గనిస్థాన్ అధ్యక్ష భవంతి సహా అన్ని ప్రాంతాలను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు.   

దేశంలో మరింత రక్తపాతం ఏర్పడటం ఇష్టంలేకే దేశం విడిచి వెళ్లిపోతున్నట్లు మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని   ప్రకటనలో తెలిపారు. 

అటు ఆఫ్గనిస్థాన్‌లో ఉంటున్న విదేశీయులు కూడా భారీ సంఖ్యలో కాబుల్ విమానాశ్రయం నుంచి నిష్క్రమిస్తున్నారు. 

20 ఏళ్ల తర్వాత మళ్లీ ఆఫ్గనిస్థాన్‌ అధికారాన్ని తాలిబన్లు సొంతం చేసుకున్నారు. 

ఆఫ్గనిస్థాన్ నుంచి తమ సేనలు  ఆగస్టు 31 లోగా నిష్క్రమిస్తాయని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించగా రెండు వారాలకు ముందే తాలిబన్లు ఆఫ్గన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

 ఆఫ్గనిస్థాన్‌‌‌‌లో అరాచక తాలిబన్ల శకం మళ్లీ మొదలవబోతోందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి