google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: ట్విటర్‌ కీలక నిర్ణయం!

18, ఆగస్టు 2021, బుధవారం

ట్విటర్‌ కీలక నిర్ణయం!

twitter


సోషల్ నెట్‌వర్కింగ్ సర్వీస్ ట్విటర్ సంచలన నిర్ణయం తీసుకుంది. 

ట్విటర్‌ ఖాతాలకు ఇచ్చే బ్లూటిక్‌ మార్క్‌ వెరిఫికేషన్ ప్రోగ్రామ్‌ను రివ్యూ ప్రాసెస్‌లో భాగంగా బ్లూటిక్‌ సేవలను ట్విటర్‌ నిలిపివేసినట్లు తెలిసింది.

 దీనివల్ల  కొత్త ట్విటర్‌ ఖాతాల బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ కోసం వచ్చే దరఖాస్తులను తీసుకోవడం జరగదు. 

గతవారంలో పలుఖాతాలను తప్పుగా వెరిఫికేషన్‌ చేసి బ్లూటిక్‌ను ఇచ్చినట్లు ట్విటర్‌ నిర్ధారించింది.  ఈ కారణం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కానీ ఈమధ్య కాలంలో ట్విటర్‌ ఖాతాల వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసి ఉంటే వారికి బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

  రాబోయే కొన్ని వారాల్లో బ్లూటిక్‌ వెరిఫికేషన్‌కు వచ్చే దరఖాస్తులను తిరిగి ప్రారంభిస్తామని ట్విటర్‌ ప్రతినిధి వెల్లడించారు.  ఇంతకుముందు 2017 సంవత్సరంలో, ఈ ఏడాది మొదట్లో కూడా బ్లూటిక్‌ సేవలను ట్విటర్‌ నిలిపివేసింది. 

 ట్విటర్ గత రెండు నెలల క్రితం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కొంతమంది పొలిటికల్ లీడర్ల ట్విటర్‌ ఎకౌంట్లకు  బ్లూ టిక్ తీసేసింది. తరువాత వచ్చిన నిరసనల నేపధ్యంలో మళ్ళీ ఆ టిక్‌లు ఇచ్చేసింది. 

ఈ వివాస్పద నిర్ణయం వల్ల  భారతప్రభుత్వం ట్విటర్‌కు  అల్టిమేటం జారీచేసింది. ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల విషయంలో కచ్చితంగా ట్విటర్‌ ప్రతి స్పందించాల్సిందే అని తేల్చి చెప్పింది. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి