google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: వాడి పడేసిన టిష్యూ పేపర్ ధర రూ.7.50 కోట్లు!! messi "used tissue paper" at auction

18, ఆగస్టు 2021, బుధవారం

వాడి పడేసిన టిష్యూ పేపర్ ధర రూ.7.50 కోట్లు!! messi "used tissue paper" at auction




 మీరు చదివింది అక్షరాల నిజం. 

వాడి కిందపడేసిన ఆ టిష్యూ పేపర్‌ను ఏకంగా రూ.7.5 కోట్లకు ఆన్‌లైన్‌లో వేలానికి పెట్టారు!

వెర్రి వేయివిధాలని అంటారు. అభిమానం పీక్స్ కి వెళ్ళిపోతే ఎలావుంటుందో అనేదానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణగా నిలుస్తుంది. 

 సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ వాడి, కిందపడేసిన ఆ టిష్యూ పేపర్‌ను Tissue paper ఏకంగా రూ.7.5 కోట్లకు ఆన్‌లైన్‌ వేలంలో అమ్మకానికి పెట్టారు.

ఇటీవల లియోనల్ మెస్సీ ఫుట్‌బాల్ క్లబ్‌ బార్సిలోనాకు గుడ్‌బై చెప్పాడు. ఈ సందర్భంగా మెస్సీ Messi కాస్త ఎమోషనల్ అయ్యాడు.

బార్సిలోనాతో తన రెండు దశాబ్ధాల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఉబికి వస్తున్న కన్నీటిని ఓ టిష్యూ పేపర్‌తో తుడుచుకున్నాడు.

ఆ టిష్యు పేపర్ని సేకరించి పెట్టుకున్న ఓ అభిమాని ఒక వెబ్సైట్లో అమ్మకానికి పెట్టాడు.

 ఏకంగా సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ కన్నీరు తుడిచిన టిష్యూ పేపర్‌ను దక్కించుకునేందుకు మెస్సీ వీరాభిమానులు చాలా మంది పోటీపడుతారని భావిస్తున్నారు. 

వేలంలో దాని ధరను 1 మిలియన్ డాలర్లు  (రూ.7.5 కోట్లు) గా నిర్ణయించారు. 

మెస్సీ కన్నీరు తుడిచిన టిష్యూను దక్కించుకోండంటూ ఆన్‌లైన్ యాడ్స్ కూడా ఇచ్చారు. 

దీంతో ఆ టిష్యూ పేపర్‌కు ఆయన వీరాభిమానుల మధ్య గట్టి పోటీ నెలకొంటోంది. వేలంపాటలో సదరు టిష్యు పేపర్ ఎంత ధరను తాకుతుందో చూడాలి.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి