google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చిన ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్ Facebook removes Rahul Gandhi’s post!

20, ఆగస్టు 2021, శుక్రవారం

రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చిన ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్ Facebook removes Rahul Gandhi’s post!

rahuljee


 కాంగ్రెస్ పార్టీనేత రాహుల్ గాంధీకి ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్ Facebook, Instagramm భారీ షాక్ ఇచ్చాయి.

 ఫేస్‌బుక్ వేదికగా రాహుల్ గాంధీ చేసిన పోస్ట్ వల్ల  ఓ మైనర్ బాలిక కుటుంబసభ్యుల వివరాలు భహిర్గతం కావడంతో సదరు సంస్థలు పై చర్యను తీసుకున్నాయి. 

రాహుల్ గాంధీ పెట్టిన ఓ వివాస్పద పోస్ట్‌ను ఫేస్ బుక్ తొలగించింది. 

ఢిల్లీలో అత్యాచారం చేయబడి, దారుణహత్యకు గురైన, మైనర్ బాలిక కుటుంబసభ్యుల వివరాలను ఫేస్‌బుక్ వేదికగా రాహుల్ గాంధీ పోస్ట్ చేశారు. 

ప్రజల అభ్యంతరకర దృశ్యాలను, చిత్రాలను పోస్ట్ చేసినందుకు తొలగించామని, ఫేస్ బుక్, మరియు ఇన్ స్టాగ్రాం  వెల్లడించాయి.  

 మైనర్ బాధితురాలి తల్లిదండ్రుల గుర్తింపును వెల్లడించింది కాబట్టి ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్ లు రాహుల్ గాంధీ పోస్ట్‌ను తొలగించడం జరిగింది.  

అనేక అభ్యంతరాలు రావడంతో  మంగళవారం, ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోకు సంబంధించి  రాహుల్ గాంధీకి FACEBOOK నోటీసు జారీ చేసింది. బాధితుడి వివరాలను వెల్లడించినందుకు వివరణ ఇవ్వాలని కోరింది. ఆయన దగ్గరనుంచి  ఎలాంటి స్పందన లేకపోవడంతో పోస్ట్‌ను తొలగిస్తున్నట్లు పేర్కొంది.

 అటు రాహుల్ గాంధీ పోస్ట్ చేసిన వీడియోపై యాక్షన్ రిపోర్టుతో కావాలని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) ఫేస్‌బుక్‌ను కోరిన తర్వాత, రాహుల్ గాంధి పోస్ట్ మీద ఇలాంటి చర్యలు తీసుకున్నట్టు తెలిసింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి