google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: సెక్యుర్ సోషియల్ మీడియా! Facebook secure future

17, ఆగస్టు 2021, మంగళవారం

సెక్యుర్ సోషియల్ మీడియా! Facebook secure future

MEDIA SECURITY


 సోషల్‌ మీడియా రాకతో  సమాచార మార్పిడి చాలా సులభంగా మారింపోయింది కానీ ప్రైవసీ పెద్ద సమస్యగా మారింది. 

ఇద్దరు వ్యక్తులు చేస్తోన్న చాటింగ్‌ను కానీ,పంచుకునే వ్యక్తిగత సమాచారంగానీ సోషల్‌ మీడియా కంపెనీలు చూస్తే ఎలా అనే సందేహం అందర్లోనూ తప్పక వుంటుంది.

 అయితే దీనిని అరికట్టడానికి  మెసేజింగ్‌ యాప్‌ 'వాట్సాప్‌' ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ అనే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ సహాయంతో వాయిస్‌, వీడియో కాల్స్‌, టెక్ట్స్‌ మెసేజ్‌లు కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్యే ఉంటాయి. దీంతో యూజర్ల ప్రైవసీకి ఎలాంటి ఢోకా వుండదు.

సోషల్ మీడియా లీడింగ్ వెబ్ సైట్ ఐన  ఫేస్‌బుక్‌ కూడా ఈ ఫీచర్‌ను ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ యాప్‌లో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 

దీనివల్ల  ఇకపై ఫేస్‌బుక్‌లో పంపించుకునే సందేశాలను యూజర్, రిసీవర్‌ తప్ప మరెవరూ చూసే అవకాశం లభించదు. ప్రస్తుతం ఫేస్‌బుక్‌ ఈ ఫీచర్‌ను పరీక్షిస్తోంది.. మరికొద్ది రోజుల్లోనే అందరికీ అందుబాటులోకి రానుంది. 

ఇదిలా ఉంటే ఫేస్‌బుక్‌ త్వరలోనే ఈ ఫీచర్‌ను తన సహ భాగస్వామి ఇన్‌స్టాగ్రామ్‌లోనూ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. అలాగే వాట్సాప్ లో వున్న డిసప్పియర్    ఫీచర్‌ను ఫేస్‌బుక్‌లోనూ తీసుకురానున్నట్లు సమాచారం. దీంతో నిర్ణీత సమయం తర్వాత ఫేస్‌బుక్‌లో మీరు పంపించిన మెసేజ్‌ను అవతలి వ్యక్తికి కనిపించకుండా చేసుకోవచ్చు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి