google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: UFO ఎగిరేపళ్ళాలు నిజంగా ఉన్నాయా?

26, ఆగస్టు 2021, గురువారం

UFO ఎగిరేపళ్ళాలు నిజంగా ఉన్నాయా?

blog/post/edit/4450771144974125185/2155933885186635480


UFO అంటే ఏమిటి? నిజంగానే గ్రహాంతరవాసులు వున్నారా?  భూమి మీద ఒక్కటే కాకుండా విశ్వంలోని వేరే ఇతర గ్రహాలలో  మనలాంటి లేదా మనకన్నా తెలివైన జీవులు వున్నారా? వారు ఫ్లైయింగ్ సాసర్ లాంటి తమ వాహనాల ద్వారా అప్పుడప్పుడూ భూమి మీదకు వస్తుంటారా..? వారివలన భూగ్రహానికి ఎదైనా ప్రమాదం ఉందా..?

వీటి గురించిన చర్చ ఈనాటిది కాదు. చాలా దశాబ్దాలుగా వీటికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన కథలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఇలాంటి విషయాలపై పరిశోధనలూ కూడా  కొనసాగుతోనే ఉన్నాయి.

ఇలాంటి అనేక అనుమానాలకు కారణమైంది UFO. దీనినే 'Unidentified flying object'అని అంటారు. ఎగిరే పళ్ళాలని, ఫ్లయింగ్ సాసర్లు అని కూడా పిలుస్తుంటారు.

రాకెట్ సైన్స్ అభివృద్ధి చెందిన తరువాత UFO లు ముఖ్యమైన చర్చనీయ అంశంగా మారాయి. కొంతమంది పరిశోధకులు వీటిని భూమిని సందర్శించే తెలివైన గ్రహాంతరవాసులు అని భావించారు.

1947 లో మొట్టమొదటిసారిగా UFO గురించి ప్రస్తావన వచ్చింది. వ్యాపారవేత్త కెన్నెత్ ఆర్నాల్డ్ విమానంలో వెళ్తున్నపుడు వాషింగ్టన్ లోని మౌంట్ రైనర్ సమీపంలో తొమ్మిది హై-స్పీడ్ వస్తువుల గుంపుని చూసినట్లు పేర్కొన్నాడు. అవి నెలవంక ఆకారంలో వున్నాయని, చాలా వేగంగా  అవి "నీటి మీద స్కిప్పింగ్ చేసే సాసర్ల" లాగా కదులుతున్నాయని చెప్పాడు. 

ఆ వార్తను ప్రచురించిన ఓ పత్రిక వస్తువులు సాసర్ ఆకారంలో ఉన్నాయని పొరపాటున ప్రంట్ చేసింది. అపాటినుంచి  ఫ్లయింగ్ సాసర్ అనే పదం స్థిరపడిపోయింది.

ప్రపంచంలో అనేకచోట్ల చాలామంది తాము వాటిని చూసినట్లుగా చెప్పిన ఉదంతాలున్నాయి.

మరియు 1948 లో US వైమానిక దళం ప్రాజెక్ట్ సైన్ అనే పేరుతో దర్యాప్తును ప్రారంభించింది. 

 UFO లు అధునాతన సోవియట్ విమానాలు అని ఈ ప్రాజెక్ట్‌లో పాల్గొన్నవారి మొదటి  అభిప్రాయం, అయితే ఇతర దేశాల పరిశోధకులు మాత్రం ఆ ఎగిరే వస్తువులు ఇతర గ్రహాల అంతరిక్ష నౌకలు కావచ్చు అని అభిప్రాయపడ్డారు.  

ప్రాజెక్ట్ బ్లూ బుక్‌పై అధికారిక విచారణల ద్వారా సుదీర్ఘకాలం కొనసాగింది. 1952 నుండి 1969 వరకు ప్రాజెక్ట్ బ్లూ బుక్ 12,000 కంటే ఎక్కువమంది సాక్ష్యాలు లేదా సంఘటనల నివేదికలను సంకలనం చేసింది 

 వారి నివేదిక ప్రకారం  UFO అనేది  సాక్ష్యాలలో 90 శాతం మంది చూసినవి ప్రకాశవంతమైన గ్రహాలు మరియు నక్షత్రాలు, ఉల్కలు, అరోరాస్, అయాన్ మేఘాలులేదా విమానం, బెలూన్లు, పక్షులు మరియు సెర్చ్ లైట్లు వంటి భూసంబంధమైన వస్తువులకు కావొచ్చని అలాగే వీటివల్ల  భద్రతాపరమైన ముప్పు లేదు అని.  

ఈ నివేదిక సుదీర్ఘ కాలం రహస్యంగా ఉంచడం వల్ల ప్రజలలో అనేక అనుమానాలను కలుగజేసింది.

 1966 లో 37 మంది శాస్త్రవేత్తలతో రెండవ కమిటీ ఏర్పాటు చేయబడింది. రెండు సంవత్సరాల తరువాత,  UFO కనిపించడం గురించి వివరణాత్మక అధ్యయనం చేసిన ఈ కమిటీ, దాని ఫలితాలను సైంటిఫిక్ స్టడీ ఆఫ్ అన్‌డెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్‌గా విడుదల చేసింది. 

ఒక్క అమెరికానే కాదు, రష్య, స్వీడన్, బ్రొటన్, టర్కీ లాంటి దేశాలు కూడా పరిశోధన చేసాయి.

ఆశ్చర్యకరంగా గత సంవత్సరం ఏప్రిల్ లో తొలిసారిగా అమెరికా రక్షణ మంత్రిత్వశాఖ ఊFఓ లకు సంబందించి 3 వీడియోలను విడుదల చేసింది. ఎస్ -18 ఫైటర్ జెట్‌లో ఏర్పాటు చేసిన ఇన్‌ఫ్రా-రెడ్ కెమెరా సహాయంతో వీటిని యుఎస్ నేవీ రికార్డ్ చేసింది. కాని వీటిని అధీకౄత సాక్ష్యాలుగా అమెరిక పరిగణించలేదు.

చాలామంది  UFO ఉదంతాల గురించి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూనే వున్నారు. గ్రహాంతరవాసులు నింజగా ఉన్నారని, అమెరిక శాస్థ్రవేత్తలు వారితో సంబంధాలు నెరుపుతున్నారని, కొందరైతే అమెరికలోని ఏరియా 51 లో గ్రహాంతరవాసులు బంధీలుగా ఉన్నారని నమ్ముతుంటారు.

కాని ఇంతవరకు జరిగిన పరిశోధనల్లో ఎక్కడకూడా గ్రహాంతరవాసులు వున్నారనిగానీ, ఎగిరేపళ్ళాల ఉనికి గాని, శాశ్త్రీయంగా నిర్ధారించబడలేదు.  




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి