google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: కరోనా కి ముక్కు ద్వారా వ్యాక్సిన్!

13, ఆగస్టు 2021, శుక్రవారం

కరోనా కి ముక్కు ద్వారా వ్యాక్సిన్!



 ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాని నియంత్రించేందుకు మరో ముందడుగు పడింది.

ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ క్లినికల్ ట్రైల్స్ కి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది .

భారత్‌ బయోటెక్‌ రూపొందించిన ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్‌ (నాజల్‌ వ్యాక్సిన్‌)కు ఒకే చెప్పింది కేంద్ర ప్రభుత్వం. 


ఇప్పటికే 18 నుంచి 60 ఏళ్ల వయసుల వారిపై నిర్వహించిన తొలి దశ క్లినికల్‌ ట్రయల్స్‌  విజయవంతంగా పూర్తయ్యినట్లు తెలిసింది.

రెండు, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహణకు అనుమతి మంజూరు చేసినట్టు  డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయో టెక్నాలజీ  వెల్లడించింది. 


 ‘కొవాగ్జిన్‌’ టీకాను తయారు చేసిన భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ.. ముక్కు ద్వారా ఇచ్చే టీకా అడెనోవైరస్‌ వెక్టార్డ్‌  అభివృద్ధిపై ఫోకస్ చేసింది.  

గతేడాది సెప్టెంబరులో భారత్‌ బయోటెక్‌, యూఎస్‌లోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఇన్‌ సెయింట్‌ లూయీస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. 

కాగా ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్‌ కరోనాపై సమర్థంగా పనిచేస్తున్నట్లు ఇప్పటికే జంతువులపై జరిపిన పరిశోధనలో వెల్లడైంది. ప్రపంచలోనే తొలిసారి ముక్కు ద్వారా వేసే కోవిడ్ వ్యాక్సిన్‌ను భారత్‌ బయెటెక్‌ అభివృద్ధి చేస్తోంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి