google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: గుర‌క స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డాలంటే ., snoring problem

30, ఆగస్టు 2021, సోమవారం

గుర‌క స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డాలంటే ., snoring problem

  



గుర‌క  స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డాలంటే SNORING


నిద్రపోయే సమయలో గురక పెట్టే అలవాటు చాలా మందిలో ఉంటుంది. గురక వలన పక్కన ఉన్న మిగతావారుకూడా చాలా ఇబ్బందులకు గురౌతుంటారు.

గురక చాలా అసౌకర్యమైన నిద్రను కలగజేస్తుంది. కొన్ని పరిశోధనలలో గురక వలన గుండె సంబంధ వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం వుందని తెలిసింది.

 గురక రావడానికి ప్రధాన కారణాలు, ఇంకా  గురక నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే ఏమేమి  చిట్కాలు వున్నాయో తెలుసుకుందాం 

గుర‌క ఎందుకు వ‌స్తుంది?

నిద్రపోయే  సమయంలో గాలి ముక్కుల నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే మార్గంలో అడ్డంకులు వున్నత్లైతే అప్పుడు గురక వస్తుంది. 

అలాగే ఆ సమయంలో నోటి ద్వారా శ్వాస తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఆ మార్గంలో కూడా అవాంతరాలుంటే అప్పుడు కుచించుకుపోయిన మార్గం నుంచి గాలి వెళ్లాల్సి ఉండడంతో అది గురకకు దారితీస్తుంది. 

వాస్తవానికి గురక రావడానికి మరెన్నో కారణాలు వున్నాయి. మానసికపరమైన ఒత్తిడి, టెన్షన్ కూడా గురకకు కారణం అవుతాయి.

సాధారణంగా ముక్కుల ద్వారా గాలి తీసుకుంటాం. కానీ, నాసికా మార్గాల్లో అడ్డంకుల వల్ల కొందరు నోటితో శ్వాస తీసుకుంటుంటారు. అలర్జీలు, సైనస్ ఇన్ఫెక్షన్, ముక్కులోపలి భాగం వాచివుండటం, అడినాయిడ్స్ అన్నీ కూడా శ్వాస మార్గానికి అడ్డంకుని కలిగిస్తాయి.

అలాగే వయసు పెరుగుతున్నకొద్దీ  గొంతు భాగం సన్నబడుతుంది. దీనివల్ల గురక రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మహిళలతో పోలిస్తే పురుషుల్లో గురక సమస్య ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే పురుషులలో మద్యం, పొగతాగడం లాంటి అలవాట్లు వుండటం వల్ల, లేదా కొంతమందిలో  లోరజ్ పామ్, డైజిపామ్ లాంటి ట్రాంక్విలైజర్ ఔషధాలను వాడటం వల్ల వాయు నాళాలు తక్కువ వ్యాకోచంతో ఉంటాయి. 

అధిక బరువు ఉండడం వల్ల, లేదా మెడ, గొంతు భాగంలో అధిక బరువు పడినా గురకకు దారితీస్తుంది. 

సైనస్ సమస్యలో ముక్కు నాసికా రంధ్రాలు జామ్ అవుతాయి. దీంతో గాలి కష్టంగా వెళ్లాల్సి వచ్చి శబ్దం బయటకు వస్తుంది.  ముఖ్యంగా కార్పొరేట్‌ ఉద్యోగుల్లో ఎక్కువమంది పని వత్తిడి వల్ల నిద్ర పోయేటపుడు  గురక సమస్యతో బాధపడుతుంటారు. 

ఇక గుర‌క స‌మ‌స్య‌ను ఎలా అధికమించ‌వచ్చో  తెలుసుకుందాము.

 రాత్రి నిద్రపోయే ముందు అర టీ స్పోన్‌ తేనె, అర టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ కలిపి  తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.

 ఒక గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ చుక్కలు వేసి రాత్రి నిద్రపోయే ముందు నోటిలో పోసుకుని బాగా పుక్కిలించాలి. దీని వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ను చేతివేళ్లకు రాసుకుని వాసన చూస్తుంటే గురక తగ్గుతుంది.

 ఒక గ్లాసు వేడి నీటిలో అర టీ స్పూన్‌ యాలకుల చూర్ణం కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి నిద్ర‌పోతే మంచి ఫలితం కనిపించవచ్చు.

అలాగే రాత్రి పడుకునే ముందు మరిగే నీటిలో 4, 5 చుక్కలు యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి ఆవిరి పట్టాలి. ఇదికూడా గురక సమస్యను అధుపులో వుంచుతుంది.

దీనితో పాటుగా వీలున్నపుడు భ్రీతింగ్ ఎక్సర్ సైజెస్, మధ్యపానం, ధూమపానం వంటి వాటికి దూరంగా వుండటం లాంటివి చాలా ఉపయోగపడుతాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి