google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: తాలిబన్ల అధికారం - భారత్ లో వ్యాపారం ( india business with afghanistan)

17, ఆగస్టు 2021, మంగళవారం

తాలిబన్ల అధికారం - భారత్ లో వ్యాపారం ( india business with afghanistan)



 ఆఫ్ఘనిస్తాన్లో అధికారాన్ని తాలిబన్ల చేతిలోకి తీసుకున్న   నేపథ్యంలో ఆ దేశంతో వర్తక, వ్యాపార వాణిజ్యాలపై కాస్తంత ప్రభావం పడే అవకాశం వుంది. 

ఒకవేళ తాలిబన్ ప్రభుత్వంతో ఇండియాకు సత్సంబంధాలు లేకుంటే,  భారత దేశంలో ఏయే వస్తువుల ధరలు ప్రభావాన్ని  చూపుతాయో ఇప్పుడు చూద్దాం. 

  డ్రై ఫ్రూట్స్,కిస్మిస్‌‌, వాల్‌నట్స్‌, బాదం, పిస్తా, పైన్‌ నట్స్‌, చెర్రీ, ఇంకా కొన్నిరకాల ఆయుర్వేద మూలికలను  ఆప్ఘనిస్థాన్ నుంచి కొన్ని వస్తువుల్ని భారత్ దిగుమతి చేసుకుంటూ వుంది.  

ముఖ్యంగా ఎండు ద్రాక్ష, జిలకర  అక్కడి నుంచి పెద్ద ఎత్తున భారత్ వస్తున్నాయి. ఇప్పుడు వాటి ధర  పెరిగే అవకాశం ఉండొచ్చు.

అలాగే మన దేశం నుంచి ఆప్ఘనిస్థాన్ కు తేయాకు, కాఫీ, మిరియాలు, పత్తి వంటివి ఎగుమతి అవుతున్నాయి.

 పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే భారత కు అవసరమైన పెట్రో ఉత్పత్తులు 92 శాతాన్ని గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది.  గల్ఫ్ దేశాల్లో ఏ చిన్న అలజడి రేగినా, అది మన దేశంలోని పెట్రోల్, డీజిల్ పై ప్రభావం చూపిస్తుంది. 

 ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యంపై  అఫ్గాన్‌ పరిస్థితుల ప్రభావం తప్పకుండా ఉంటుంది.

ఆప్ఘనిస్థాన్, భారత్‌ మధ్య 2020-21 ఆర్థిక సంవత్సరంలో 1.52 బిలియన్‌ డాలర్ల వ్యాపారం జరిగింది. ఇందులో భారత్‌ ఎగుమతుల వాటా 826 మిలియన్‌ డాలర్లు కాగా, అఫ్గాన్‌ దిగుమతుల వాటా 510 మిలియన్‌ డాలర్లుగా ఉంది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి