google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: కృత్రిమ మెదడు ఆవిష్కరణ !

23, ఆగస్టు 2021, సోమవారం

కృత్రిమ మెదడు ఆవిష్కరణ !

 


 కృత్రిమ మెదడు ఆవిష్కరణ !

పరిశోధకులు మానవ శరీరంలోని ప్రతి అవయవాన్ని కృత్రిమంగా సృష్టించే దిశలో మరో ముందడుగు పడిది.

మెదడు సంబంధిత వ్యాధుల్లో ప్రత్యామ్నాయ వ్యవస్థ కోసం చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలు మరో మైలురాయిని చేరుకున్నాయి.

కొన్నిరకాల కృత్రిమ అవయవాలను సృష్టిస్తూ, అవయవాలు కోల్పోయినవారికి జీవితాన్ని ఇస్తున్న శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. 

ఈసారి శాస్త్రవేత్తలు కృత్రిమ మానవ మెదడును సృష్టించారు. ఈ మెదడుని మానవ మూలకణాల నుండి అభివృద్ధి చేశారు. జర్మన్ శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో కృత్రిమ మానవ మెదడును సృష్టించారు. ఈ చిన్నపరిణామంలో వున్న ఈ మెదడుకి కళ్ళు కూడా ఉన్నాయి. 

దీనిని ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ జెనెటిక్స్, జర్మనీ పరిశోధకులు తయారు చేశారు. 

సృషించిన మెదడులోని కళ్ళు ఐదు వారాల పిండంలా అభివృద్ధి చెందాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

భవిష్యత్తులో ఇది అనేక వ్యాధుల చికిత్సలో సహాయపడుతుంది.దీని నుండి అనేక కొత్త విషయాలు వెల్లడవుతాయి,

కృతిమంగా తయారుకాబడిన ఈ బ్రెయిన్ 3 మిమీ. వెడల్పుగా ఉంటుంది. 

ఇందులో ఉండే కళ్లలో కార్నియా, లెన్స్, రెటీనా ఉన్నాయి. దాని సహాయంతో అది కాంతిని చూడగలుగుతుంది. ఈ కళ్ళు న్యూరాన్లు, నరాల కణాల సహాయంతో మెదడుతో కూడా కమ్యూనికేట్ చేయగలవు. 

ప్రయోగశాలలో తయారు చేసిన ఈ రెటీనా భవిష్యత్తులో ఒఋష్టి కోల్పోయిన వ్యక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సెల్ స్టెమ్ జర్నల్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం, ఈ కళ్ళపై కాంతి కిరణాలు పడినపుడు, సంకేతాలు మెదడుకు చేరాయి. కళ్ళు చూసేవి మెదడుకు చేరుతున్నాయని ఇది రుజువు చేసింది. ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన మెదడులో మొదటిసారిగా ఇది కనిపించింది.

పరిశోధకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, చిన్న మెదడు సహాయంతో, పిండం అభివృద్ధి సమయంలో, పుట్టుకతో వచ్చే రెటీనా సంస్యలలో,రెటీనాపై కొన్ని ఔషధాలను పరీక్షించడం ద్వారా కన్ను మరియు మెదడు ఎలా కమ్యూనికేట్ చెందుతాయో తెలుసుకోవడం సాధ్యమవుతుందని చెప్పారు. 

కానీ 60 రోజుల్లో సుమారు 314 మినీ బ్రెయిన్‌లు తయారు చేయగా వీటిలో మూడు వంతులు పూర్తిగా అభివృద్ధి చెందాయి. అవి కనిపించే మానవ పిండాల వంటివి, రక్త సరఫరా లేకుండా అవి  ఎక్కువ కాలం జీవించలేవు. అందువల్ల అవి  క్రమంగా రెండున్నర నెలల్లో జీవం కోల్పోతాయి.

ఈ ఆవిష్కరణ పూర్తిగా విజయవంతం కాకపోయినప్పటికీ, భవిష్యత్ లో పూర్తిస్థాయిలో మానవ మెదడును కృత్రిమంగా సృష్టించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిశోధనలు మానవాళికి చాలా మేలు చేస్తుందని శాస్త్రవేత్తలు  చెబుతున్నారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి