google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: కొత్తిమీరతో చర్మ సంరక్షణ health with coriander

17, ఆగస్టు 2021, మంగళవారం

కొత్తిమీరతో చర్మ సంరక్షణ health with coriander

కొత్తిమీరతో చర్మ సంరక్షణ  health with coriander


వంటలలో రుచిని పెంచేందుకు వాడే కొత్తిమీర వల్ల  అనేక ఆరోగ్యకర ప్రయోజనాలున్నాయి. 

కొత్తిమీరలో పీచు పదార్ధాలు, విటమిన్లు నిండుగా ఉన్నాయి. ఇందులో క్యాలరీలు తక్కువ. అలాగే యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్‏ను తొలగిస్తుంది. కొత్తిమీరలో పొటాషియం, ఐరన్, సోడియం మొదలైనవి ఉన్నాయి. 

కొత్తిమీర ఆకులు రసాన్ని  తేనెతో కలిపి రోజు పడుకునే ముందు తాగితే విటమిన్స్ అ, బ్1, బ్2, చ్, ఐరన్ లోపాలతో వచ్చే వ్యాదులు దరిచేరవు.

కొత్తిమీరతో చాలా చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. 

కొత్తిమీర చర్మానికి కాంతి పెంచడమే కాకుండా మొటిమలు, పిగ్మెంటేషన్, డ్రై స్కిన్, బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. కొత్తిమీరతో జుట్ట సమస్యలను కూడా నియంత్రించవచ్చు. 

కొత్తిమీర ఆకులతో చర్మ సమస్యలను ఎలా తగ్గించవచ్చో తెలుసుకుందాము.

 కొత్తిమీర ఆకులను మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అందులో ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ నిమ్మరసం , రెండు స్పూన్ల పచ్చిపాలను కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి, ముఖం, మెడపై అప్లై చేయాలి. అరగంట తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకుంటే  చర్మానికి మంచి కాంతిని కలిగిస్తుంది.

ఇక రెండవ పద్దతిలో కొత్తిమీర ఆకులను కడిగి మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. దానికి ఒక స్పూన్ నిమ్మరసం

 కలపిన తర్వాత,   ముఖం, మెడపై అప్లై చేసి ఇరవై ఐదు నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.  ఇది మృత కణాలను తొలగిస్తుంది. చర్మం మృదువుగా మారేందుకు, అలాగే మొటిమలు, మచ్చలు కూడా తగ్గేందుకు సహాయం చేస్తుంది.

చర్మం మీద ముడతలు,వృద్దాప్య సూచనలు  తగ్గించుకోవాలంటే  కొత్తిమీర   కలబంద జెల్ కలిపిన  మిశ్రమాన్ని ముఖం, మెడపై లేదా శరీరం మీది భాగాలలో  అప్లై చేసి ఇరవై నిమిషాలు అలాగే ఉంచి చల్లటి నీటితో కడగడం వల్ల ప్రయోజనం వుంటుంది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి