google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: తాలిబన్లకు ఫేస్ బుక్ షాక్ !

17, ఆగస్టు 2021, మంగళవారం

తాలిబన్లకు ఫేస్ బుక్ షాక్ !


FACEBOOK,INSTAGRAM


 అఫ్ఘనిస్తాన్లో అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లకు సోషియల్ మీడియా దిగ్గజం షాక్ ఇచ్చింది.

ఫేస్‌బుక్ తన విధానాల ప్రకారం తాలిబాన్ సేవలను నిషేధించింది.

అమెరికా చట్టం ప్రకారం తాలిబాన్ ఒక ఉగ్రవాద సంస్థ అని ఫేస్ బుక్ ఒక ప్రకటన విడుదల చేసింది.  తాలిబాన్ ఫేస్బుక్ అకౌంట్ ను నిషేధించింది.

 అధికారాన్ని చేజిక్కించుకున్న వెంటనే తాలిబాన్లు ఫేస్ బుక్‌లో ఖాతా తెరిచి,  వారికి సంబంధించిన  పోస్టులు పెడుతున్నారు. ఇది గమనించిన ఫేస్ బుక్ వెంటనే తొలిగించడం మొదలు పెట్టింది. అంతేకాదు నిషేదం కూడా పెట్టింది. ఇతర ఖాతాలనుంచి తాలిబాన్‌లను ప్రోత్సహించే కంటెంట్‌ను కూడా బ్రేక్ చేసింది ఫేస్‌బుక్.

ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్ అధినేత ఆడమ్ మోసేరి బ్లూమ్‌బెర్గ్  మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్ సంస్థ పేరు టెర్రరిస్టు జాబితాలో ఉన్నందున వారి గ్రూప్‌ని ప్రోత్సహించే లేదా ప్రాతినిధ్యం వహించే ఏ కంటెంటైనా నిషేధించబడిందని తెలిపారు. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి