google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: వర్మ బస్తీమే సవాల్!!

4, డిసెంబర్ 2016, ఆదివారం

వర్మ బస్తీమే సవాల్!!



వంగవీటి సినిమాపై తనకు వస్తున్న బెదిరింపులకు లొంగే ప్రసక్తేలేదని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తేల్చిచెప్పాడు.

ఈ సినిమాపై వస్తున్న వివాదాలకు పుల్ స్టాప్ పెట్టేందుకు కొడాలి నాని మధ్యవర్తిగా నిన్న వంగవీటి రాధ ఫ్యామిలీతో జరిగిన చర్చలు సంతృప్తికరంగా జరగలేదని వర్మ తెలియజేసాడు. పైగా తనకు నవ్వుతూ వార్నింగ్ ఇచ్చారని, అయితే ఇలాంటి వార్నింగ్ లు ఎన్నో చూశానని, వంగవీటి కుటుంబం చెప్పిన మార్పులను తాను అంగీకరించనని వర్మ కుండలుబద్దలు కొత్తినట్టు ట్విట్టర్ లో వ్యాఖ్యానించాడు.

కాగా మరో వర్గం నేత దేవినేని నెహ్రూ మాత్రం వర్మతో సానుకూలంగా స్పందించాడు. దర్శకులకు తన సినిమాను తన ఇష్టం వచ్చినట్టు తీసుకునే హక్కు వుందని ఆయన చెప్పాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి