ఆరొగ్యం కుదుటపడి, నేడో రేపో ఆసుపత్రి నుంచి డిస్చార్జ్ అవుతుందని ఆశగా ఎదురుచూస్తున్న అమ్మ అమ్మ అభిమానులకు దుర్వార్త..
ఐ.సీ.యూ..నుంచి గత కొద్ది రోజులుగా సాధారణ వార్డులో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు గుండెపోటు వచ్చినట్టు అపోలో హాస్పిటల్ వర్గాలు తెలియజేసాయి.
ఆమెకు నిన్న సాయంత్రం హార్ట్ స్ట్రోక్ వచ్చింది. జయను హుటాహుటిన అత్యవసర చికిత్సావిభాగంలోకి మార్చి, నిపుణులైన వైధ్య బృందంచేత చికిత్స చేస్తున్నారు.
లండన్ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ బీలే, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు వెంటనే అందుబాటులో వుండాలని కోరినట్ట్లు ఆసుపత్రి వర్గాలు తెలియజేసాయి.
తాజా పరిస్థితుల వల్ల, తమిళనాడు మొత్తం ఆందోళణ పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు అపోలో వద్దకు చేరుకుంటున్నారు. అదనపు పోలీసు బలగాలను రాష్ట్రంలోని సున్నితమైన ప్రాంతాల్లో మొహరించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి