తనదైన శైలితో మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న శ్రీనివాస రెడ్డి, ఇదివరకు ‘గీతాంజలి’ వంటి సినిమాలో హీరోలాంటి క్యారెక్టర్ చేసాడు. ఇప్పుడు పూర్తిస్థాయి హీరోగా మారి ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా బిజినెస్ సెన్షేషన్ క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది.
ఇటీవలె ఈ సినిమాను చూసిన ‘ఇంకొక్కడు’ ఫేమ్ నిర్మాత కృష్ణారెడ్డి ఏడు కోట్ల రూపాయలు చెల్లించి హక్కులు కొన్నాడట. సినిమా చాలా బాగుండడంతోనే కృష్ణారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నాడని, దీంతో ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడు అయిన కనుమూరి శివరాజ్ చాలా ఆనందంగా ఉన్నాడట.
ఓ కమెడియన్ హీరోగా నటించిన మొదటి సినిమా ఆ స్థాయిలో అమ్ముడుపోవడమంటే విశేషమే. అందుకే సినీ పరిశ్రమ జయమ్మునిశ్చయమ్ముర గురించి ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
శివరాజ్ మాట్లాడుతూ.. ‘కేవలం మా సినిమా పాట చూసి, సినిమాను ప్రమోట్ చేసిన డైరెక్టర్ సుకుమార్ గారికి, సినిమా నచ్చి, ఈ చిత్రం హక్కులు తీసుకున్న ‘ఎన్.కె.ఆర్ ఫిలిమ్స్’ నీలం కృష్ణారెడ్డిగారికి కృతజ్ఞతలు’ అని తెలిపారు.
‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమాను నవంబర్ 17న రిలీజ్ కాబోతున్న ఈ మూవీలో పూర్ణ హీరోఇన్ గా నటిస్తోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి