చంద్రబాబుకు శంకుస్థాపనల పిచ్చి పట్టిందని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు.
ఏపీ కొత్త రాజధాని అమరావతికి ఇంకా ఎన్నిసార్లు శంకుస్థాపనలు చేస్తారని నిలదీశారు. శనివారం రఘువీరారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీకి రూ. 2 లక్షల కోట్ల నిధులు కేటాయిస్తున్నామన్న కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటన ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందన్నారు.
14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు అన్ని రాష్ట్రాలకు నిధులు వచ్చినట్టుగానే ఏపీకి కూడా నిధులు కేటాయిస్తున్నారని, అంతేతప్ప, ప్రత్యేక ప్యాకేజీ అంటూ అనడం అంతా బోగస్ అని మండిపడ్డారు. విభజన చట్టంలో ఉన్న హామీలను అమలు చేయకుండా, ప్రత్యేక ప్యాకేజీ అనడం ద్రోహం అని ఆయన విమర్శించారు.
ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తామనడం మోసానికి పరాకాష్ట అని, నిధులు దుర్వినియోగం చేయొచ్చన్న దురుద్దేశంతోనే చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ అంటున్నారని దుయ్యబట్టారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి