మెగాస్టార్ చిరంజీవి నూటయాబైయ్యవ సినిమా ‘ఖైదీ నంబర్ 150’.
దీపావళి సందర్భంగా నిర్మాత, చిరు తనయుడు రామ్‌చరణ్ డాన్స్ లుక్ లో ఉన్న చిరు ఫొటోలను ఈరోజు అభిమానులతో పంచుకున్నారు. దీనిపై దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తనదైన శైలిలో స్పందించారు. ‘నేను ఏడేళ్ల కిందట చూసిన చిరంజీవి కంటే ఏడేళ్లు చిన్నగా ఉన్నారు’ అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు.
బాస్ ఈజ్ బ్యాక్, అంటూ ఇక రామ్‌చరణ్, వరణ్‌తేజ్‌లు కామెంట్ చేయగా, ‘కొందరు వయసుకి తగ్గ పాత్రలు చేస్తారు., ఆయనకి మాత్రం పాత్రను బట్టి వయసు డిసైడ్ అవుతుంది’ అంటూ చిరు పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు క్రేజీ స్టార్ సంపూర్ణేష్‌బాబు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి