రామ్‌గోపాల్ వర్మ ‘సర్కార్-3’ షూటింగ్ స్పాట్ సంచలనాలకు కేంద్రంగా మారుతోంది.
అమితాబ్ నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ స్పాట్ కి ఈమధ్య నందమూరి బాలకృష్ణ, కృష్ణవంశీ వెళ్ళిన విషయం తెలిసిందే.
తాజాగా అమితాబ్‌ను కలవడానికి బాహుబలి దర్శకుడు రాజమౌళి కూడా అ సినిమా సెట్స్‌కు వెళ్లాడు. ఈ విషయం రామ్‌గోపాల్ వర్మ తన ట్విట్టెర్ ద్వారా తెలియజేశాడు.
‘సర్కార్ సెట్స్‌పై యాక్టింగ్‌లో బాహుబలితో.. సినిమా మేకింగ్‌లో బాహుబలి’ అని వర్మ ట్వీట్ చేసాడు. దాంతోపాటే అమితాబ్, రాజమౌళి నిల్చుని మాట్లాడుకుంటున్న ఫోటోను షేర్ చేశాడు.
అయితే రాజమౌళి అక్కడకు ఎందుకు వెళ్లాడో, అమితాబ్ తో ఏమి మాట్లాడాడో మాత్రం వర్మ వెల్లడించలేదు.
అయితే తన తదుపరి సినిమాలో బిగ్ బీ చేత నటింపచేయాలనే ప్రయత్నంలో భాగంగా రాజమౌళి వెళ్ళి వుంటాడని పరిశ్రమ వర్గాలు అనుకుంటున్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి