google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: పారిశ్రామిక వేత్త దారుణ హత్య!

31, అక్టోబర్ 2016, సోమవారం

పారిశ్రామిక వేత్త దారుణ హత్య!




ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సురేంద్ర కుమార్ బెంగళూరులో దారుణ హత్యకు గురయ్యారు.

బెంగుళూరు సంజయ‌నగర్‌లోని ఆయన నివాసంలో ఈ సంఘటన జరిగింది. నిన్న రాత్రి  పల్సర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సురేంద్రకుమార్‌పై ఆరు రౌండ్ల కాల్పులు జరపగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

వ్యక్తిగతంగా సురేందర్‌కు నలుగురు గన్‌మెన్లు ఉన్నారు, వారు లేని సమయం చూసుకునే దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

హత్య జరుగుతున్న సమయంలో  గన్‌మెన్లు  ఎవరూ అందుబాటులో లేకపోవడంపై  అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ హత్యకేసుకు సంబంధించి సురేంద్రకుమార్ పాత మేనేజర్‌ను అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి