google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: గుర్నామ్‌ సింగ్ వీరమరణం

24, అక్టోబర్ 2016, సోమవారం

గుర్నామ్‌ సింగ్ వీరమరణం



పాకిస్థాన్‌ సైనికుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ బీ ఎస్ ఎఫ్ జవాను గుర్నామ్‌సింగ్‌ (26)  జమ్మూ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, శనివారం అర్థరాత్రి మృతి చెందారు.

ఈ నెల 21న జమ్మూకశ్మీర్‌ కథువా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు గుండా ఆరుగురు ఉగ్రవాదులు భారతలోకి చొరబడేందుకు ప్రయత్నించగా.. గుర్నామ్‌ తోటి జవాన్లను అప్రమత్తం చేసి, ఉగ్రవాదులపై విరుచుకుపడ్డారు. ఈ పోరాటంలో గుర్నాం తలలోకి తూటా దూసుకెళ్ళడంతో, ఆయనను ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.

ఆయన మృతదేహాన్ని స్వగ్రామం భలేశ్వర్‌ మగోవలికి ఆదివారం తీసుకొచ్చారు.

కాగా గుర్నాం తల్లి జస్వంత కౌర్‌.. తన కొడుకు వీరమరణం పొందితే, కంట తడి పెట్టనని అతడికి మాట ఇచ్చానని, ఆ మాట నిలబెట్టుకుంటానని గద్గద స్వరంతో పేర్కొన్నారు.

పాకిస్థాన్‌కు ధీటుగా జవాబు ఇవ్వాలని, అది యుద్దమైనా పర్వాలేదని గుర్నామ్‌ తండ్రి కుల్బీర్‌ సింగ్‌ ప్రధానిని కోరారు. గుర్నామ్‌ అంత్యక్రియలను ఈరోజు నిర్వహించనున్నారు.

మాతృభూమి రక్షణకు ప్రాణాలు అర్పించిన గుర్నామ్‌ పేరును అత్యున్నత సైనిక పురస్కారం అశోకచక్రకు సిఫారసు చేస్తున్నట్లు, బీఎ్‌సఎఫ్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ అరుణ్‌ కుమార్‌ తెలియజేసారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి