అంతవరకూ సమంతతో ప్రేమ వ్యవహారంలో నాగచైతన్య సైలెంట్‌గానే మేనేజ్ చేస్తూ వచ్చినా.. ఇటీవలి ‘ప్రేమమ్’ ఇంటర్వ్యూల సందర్భంగా ఓపెన్ అయిపోయాడు.
ఇప్పుడు సమంత కూడా ట్విట్టెర్ లో ధైర్యంగా చైతు గురించి మాట్లాడుతోంది.
బుధవారం సాయంత్రం అభిమానులతో జరిగిన ట్విట్టర్ సంభాషణలో ప్రశ్నలకు సమంత ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది.
‘ఏ మూడు లేక పోతే మీరు జీవించలేరు..?’ అని ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘చైతూ, మస్కతీ ఐస్‌క్రీమ్, వర్క్’ అని సమాధానమిచ్చింది సమంత.
అలాగే ఓ అభిమాని సరదాగా ‘చైతన్య ఎందుకు? నన్ను పెళ్లి చేసుకోకూడదా?’ అని అడిగినందుకు, స్పందిస్తూ ‘చేసుకోకూడదు. ఎందుకంటే నేను నిన్ను 8 సంవత్సరాల క్రితం కలవలేదు. మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కాదు కదా’ అంటూ తెలివిగా సమాధానమిచ్చింది.
ఎనిమిదేళ్ళనుంచీ స్నేహం చేసుకుంటున్న బెస్ట్ ఫ్రెండ్స్, అలా అలా ప్రేమికులైపొయారన్నమాట!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి