google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: హోంమంత్రికి ప్రమాదం

25, అక్టోబర్ 2016, మంగళవారం

హోంమంత్రికి ప్రమాదం




లిఫ్ట్ తెగిపడటంతో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప గాయపడ్డారు.

కాకినాడ సంజీవని ఆస్పత్రిలో ఆయన ఎక్కిన లిఫ్ట్ కేబుల్స్ఒ క్కసారిగా తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

పెద్దాపురం నెక్కంటి సీఫుడ్స్ లో అమ్మోనియం గ్యాస్ లీకై అస్వస్థతకు గురైన వారిని పరామర్శించేందుకు హోంమంత్రి ఈ  ఉదయం సంజీవని ఆస్పత్రికి వచ్చారు.

అనంతరం ఆయన కిందకి వెల్ళడానికి లిఫ్ట్ ఎక్కారు.  అయితే, హఠాత్తుగా లిఫ్ట్ వైర్లు తెగిపోవడంతో ఒక్కసారిగా చినరాజప్ప లిఫ్ట్ లోనే పడిపోయారు. ఆయన నడుముకు  గాయాలు కావటంతో సంజీవని ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయనను ఐసీయూలో వుంచి చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్రమాదంలో మంత్రితో పాటు ఓ కానిస్టేబుల్, ఫోటోగ్రాఫర్ కూడా గాయపడ్డారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి