నిరంతరం కేంద్రంతో ఘర్షణాత్మక ధోరణి అవలంబిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చివాట్లు ఎదురయ్యాయి.
కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుండటంపై కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని సుప్రీం దుయ్యబట్టింది. సమస్యలకు పరిష్కారం చూపకుండా ఇతరులను నిందించడం తగదని హితవు పలికింది.
స్థానిక సంస్థలు తమ విధులను నిర్వహించుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగినన్ని హక్కులను కల్పించాలని కూడా స్పష్టం చేసింది. పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణలో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోకుండా చూడాలని కోర్టు ఆదేశించింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి