google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: అమితాబ్ తెలుగులో నిజమేనా??

20, అక్టోబర్ 2016, గురువారం

అమితాబ్ తెలుగులో నిజమేనా??



క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఓ సెన్షేషన్ కాంబినేషన్ ని క్రియేట్ చెయ్యబోతున్నడా?

నిన్న జరిగిన సంఘటనలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తొంది. బాలకృష్ణ 101వ సినిమా 'రైతు ' లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ను ఓ పవర్ ఫుల్ పాత్రలో నటింపజేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది.

నిన్న ముంబై లో వర్మ సర్కార్ 3 మూవీ షూటింగ్ స్పాట్ లో బిగ్ బీ ని కలుసుకున్న వంశీ, బాలయ్య.. ఆయనకు తమ సినిమా కథను, అందులో ఆయన పాత్రను వివరించినట్టు తెలిసింది. మూవీలో అమితాబ్ కు ఓ నిజాయితిపరుడైన కలెక్టర్ పాత్రను ఇస్తున్నట్టు తెలిసింది.

ఏదో ఒకటీ అరా చిన్నపాత్రలు తప్ప, ఇంతవరకు అమితాబ్ తెలుగులో పెద్ద క్యారక్టర్లో నటించలేదు. బాలయ్య, బిగ్ బీ ల కలయిక నిజమైతే, అది తెలుగు ప్రేక్షకుల్ని సంతోషంలో ముంచెత్తడం ఖాయం.

అమితాబ్ ఈ మూవీలో నటించడానికి ఒప్పుకుంటారో లేదో త్వరలో తెలుస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి