‘పశ్చిమగోదావరిజిల్లా భీమవరం సమీపంలో గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసహరించుకోకపోతే, అది మరో నందిగ్రాంగా మారే ప్రమాదంవుందని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గట్టిగా హెచ్చరించాడు.
తుండుర్రు, కంసాలిబేతవోలు, జొన్నలగరువు గ్రామాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, ఆ ప్రాంత రైతులతో కలిసి నిన్న ఏర్పాటు చేసిన ఓ భేటీలో మాట్లాడుతూ, ఆ గ్రామాల ప్రజలకు న్యాయం జరిగేవరకూ వారితో కలిసి పోరాడుతానని చెప్పాడు.
ఆక్వా పార్క్ వల్ల కులపోరాటాలు పెరిగే అవకాశం వుందనీ, 2 లక్షలమంది రైతులు నష్టపోతారని అన్నాడు. ఈ సమస్య పరిష్కారం కోసం హైకోర్ట్ కమిటీ వెయ్యాలని, అవసరమైతే తానే స్వయంగా సీయం చంద్రబాబుతో మాట్లాడుతానని కూడా పవర్ స్టార్ రైతులకు హామీ ఇచ్చాడు.
పవన్ మాట్లాడుతూ, గోదావరి, కృష్ణా నదుల పుష్కరాలని అత్యంత పవిత్రంగా నిర్వహించిన ప్రభుత్వం ఇప్పుడు ఆ నదులు కలుషితం అవుతాయంటే ఎలా మౌనంగా వుంటొందో తెలియడం లేదన్నాడు.
నా మాటపై చంద్రబాబుకు గౌరవం ఉందనీ, మొదట మీడియాద్వారా సమస్యను తీసుకు వెళ్తున్నాననీ, పరిష్కారం కాకపోతే.. సీఎంతో చర్చిస్తా’ అని పవన్ చెప్పారు.
భవిష్యతలో గాంధేయమార్గంలో శాంతియుతంగానే పోరాటం చేద్దాం’ అని పవన్ రైతులకు పిలుపిచ్చారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి