google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: సుమంత్ కి U/A

18, అక్టోబర్ 2016, మంగళవారం

సుమంత్ కి U/A




 సుమంత్ హీరోగా, వీర్య దానం నేపథ్యంలో తీసిన  కామెడీ మూవీ ‘నరుడా డోనరుడా’ కి U/A సర్టిఫికట్ లభించించింది. ఐతే కొంచెం అడల్ట్ టచ్ ఉన్న కామెడీ సినిమా కాబట్టి, సెన్సార్ నుండి అభ్యంతరాలేవైనా వస్తాయేమోనని, ముందుగా వేసుకున్న అంచనాలను తలకిందులుచేస్తూ U/A పొందడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

దీని మాతృక  ‘విక్కీ డోనర్’ బాలీవుడ్ లో మంచి ఆదరణే పొందింది. అక్కడ వర్కవుట్ ఐన అడల్ట్ కాన్సెప్ట్ తో  తెలుగులో సినిమా తీయడం  సాహసమనే చెప్పొచ్చు.

హిట్ అనే మాట ప్రక్కనుంచితే,  సుమంత్ తెరమీద కనపడి చాలా రోజులైంది. అస్సలు తెలుగు ప్రేక్ష్కులు కూడా సుమంత్ ని మర్చిపోయే స్టేజ్ లో వున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యం చేసి,  ‘నరుడా డోనరుడా’ లో నటించడం సాహసమే అని చెప్పొచ్చు.

ఇప్పటికే మూవీ ఫస్ట్ లుక్, పోస్టర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిందనే చెప్పాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి