గత కొద్దికాలంగా నెమ్మదించిన జంపింగ్ రాజకీయాలు మళ్ళీ మొదలయ్యాయి.
ప్రతిపక్ష వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలేట్టుంది.! పార్టీకి చెందిన బూరగడ్డ వేదవ్యాస్ త్వరలో పచ్చకండువా కప్పుకోనున్నారు. గత కొద్దిరోజులుగా పార్టీ వ్యవహారాలలో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న వేదవ్యాస్ ఈరోజు వైసీపీకి రాజీనామా చేశారు.
అనంతరం ఈ రోజు ఉదయం ఆయన చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు.
వేదవ్యాస్ ఈనెల 21న తన అనుచరులతో కలిసి, చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్టు తెలిసింది..

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి