ఈ మధ్య కాలంలో పూరిజగన్నాథ్ ఎప్పుడు హిట్ కొడతారో చెప్పలేని పరిస్థితి నెలకొని వుంది. రబస లాంటి హిట్ తర్వాత కూడా , అంతకు ముందులా పెద్దహీరోలెవరూ పూరీతో కలిసి చెయ్యడానికి ముందుకు రావడంలేదు. అయినా ఆయనతో ఏ ధైర్యంతో సినిమా చేసావని ఇజం హీరో కళ్యాణ్ రాం ని కదిలిస్తే ఇలా సమాధానం ఇచ్చాడు.
' వేలకు వేలుపోసి, కొన్న బ్రాండెడ్ సెల్‌ఫోన్ ఎన్నిరోజులు పనిచేస్తుందో ఎవరూ చెప్పలేము.! ఇక్కడ ఎవరికీ గ్యారెంటీ లేదు.,! ఏ కథ చేసినా, దాన్ని పూర్తి స్థాయిలో నమ్మాలి. ఓ కథని, వ్యక్తిని నమ్మలేనప్పుడు కలసి ప్రయాణం చెయ్యలేము. పూరిసార్‌పై నాకు కొండంత నమ్మకం ఉంది. ఈ సినిమాని బాగా తీశారాయన. కొన్ని సన్నివేశాల్ని చూసుకొంటున్నప్పుడు రోమాలు నిక్కబొడుచుకున్నాయి!, ఇప్పటి వరకూ ఆయన చేసిన సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా మరో ఎత్తు.' అని పూరీ జగన్నాథ్ ని ఆకాశానికెత్తేసాడు కళ్యాణ్ రాం.
జర్నలిజం నేపథ్యంలో కళ్యాణ్ రాం ,తానే స్వయంగా నటిస్తూ, నిర్మిస్తున్న ఈ మూవీ ఈనెల 21 న విడుదల అవుతోంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి