google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: వాడకం ఎలావుంటుందో చూపిస్తా..!!

16, అక్టోబర్ 2016, ఆదివారం

వాడకం ఎలావుంటుందో చూపిస్తా..!!




భారత టెస్టు జట్టు కేప్టన్ విరాట్‌ కోహ్లీ తెలివితేటలను ఇకపై మరింత ఎక్కువగా ఉపయోగించుకుంటానని వన్డే కెప్టెన్‌ ధోనీ అన్నాడు. కోహ్లీ విజయవంతంగా టెస్త్ జట్టును నడిపిస్తూవున్న నేపథ్యంలో ధోనీ ఇలా అన్నాడు.

 కివీస్‌తో వన్డే సిరీస్‌ ఈరోజు నుంచి మొదలవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని మీడియాతో మాట్లాడిన మహీ.. ‘ఇప్పటికే నేను కోహ్లీని మైదానంలో ఎక్కువగా వినియోగించుకోవడం మొదలుపెట్టాను,  వీలైనంత ఎక్కువగానే విరాట్‌ను సంప్రదించి అతని సూచనలు తీసుకుంటున్నాను. కోహ్లీ తెలివితేటలను ఇకపై కూడా వాడుకుంటామ’ని తెలిపాడు.

 కాగా.. జట్టులో యువ ఆటగాళ్ల చేరికతో బాధ్యత మరింత పెరిగిందని అన్నాడు. 'నేను టీం లోకి చేరినప్పటి నుంచి ఆటలోను, జట్టులోనూ చాలా మార్పులొచ్చాయి. టీమ్‌లోకి చాలామంది వచ్చి వెళ్లారు. సీనియర్‌ ఆటగాడైనంత మాత్రాన,లేదా కెప్టెన్‌ లేదా వైస్‌ కెప్టెన్‌ అయినంత మాత్రాన జట్టులో మన పాత్రేమీ మారదు. పైగా అదనపు బాధ్యతలు కూడా పెరుగుతాయ'ని ధోని అన్నాడు.

కాగా భారత్-కివీస్ మధ్య మొదటి వండే మ్యాచ్ ఈరొజు ధర్మశాల వేదికగా జరగనుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి