పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరి మెగాఆక్వాఫుడ్ పార్క్ ప్రాంతంలోని రైతులు నిన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను కలవడం, ఈనెల 19న ప్రతిపక్షనేత జగన్ ఆక్వాఫుడ్ పార్క్ ప్రాంతంలో పర్యటించనుండటంతో, సీఎం సీన్ లోకి ఎంటర్ అవక తప్పలేదు.
144 సెక్షన్ అమలు, ఆందోళనకారులపై కేసులు, తదితర పరిస్థితులపై ఆదివారం తన నివాసంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించారు. ఆక్వా ఫుడ్‌పార్క్‌పై భయాందోళనలను పరిగణలోకి తీసుకున్న సీఎం, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వబోమని భరోసా ఇచ్చినట్లు తెలిసింది.
అనంతరం భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు మీడియాతో మాట్లాడుతూ., ఆక్వాఫుడ్ పార్క్ ఏర్పాటుకు ఇప్పటికే రూ.25 కోట్లు ఖర్చు చేశారని, వేరే ప్రాంతానికి తరలించలేమని స్పష్టం చేశారు. రైతులు ఆందోళన చేస్తున్న సమస్యలపై నిబంధనలు ఉల్లంఘిస్తే ఆక్వాఫుడ్ పార్క్‌పై చర్యలు తీసుకుంటామన్నారు.
నిజానికి ఆక్వాఫుడ్ పార్క్ వద్దని ఎవరూ కోరుకోవట్లేదని, వ్యర్థాలతో నీరు కలుషితం అవుతుందని భయపడుతున్నారని తెలిపారు. వ్యర్థాలను పైపులద్వారా సముద్రంలోకి వెళ్లేలా ఏర్పాట్లు చేయించి, ప్రజల్లో, అలాగే జనసేన నేత పవన్ కళాణ్ కి ఉన్న అనుమానాలు, భయాలను తొలగిస్తామని ఆయన తెలియజేసాడు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి