మనం మామూలుగా మొబైల్‌లో ఇంటర్నెట్ ఆన్ చేశామంటే.. అవసరమున్నా లేకపోయినా యాప్‌లన్నీ అప్‌డేట్ అయిపోతుంటాయి. అలాగే యాప్‌ల్లో అయితే వచ్చే వీడియోలు, ఫొటోలు కూడా డౌన్‌లోడ్ అవుతాయి. దీని వల్ల డేటా త్వరగా అయిపోయే సమస్య తరచూ కలుగుతూ వుంటూంది.
అయితే ఈ పరిస్థితి రాకుండా, మనకిష్టం వచ్చిన డేటాను మాత్రమే సేవ్ చేసుకునేందుకు వీలుగా ఫేస్‌బుక్ మెసెంజర్ లో కొత్త వెర్షన్ రాబోతోంది.
సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ త్వరలో మెసెంజర్ యాప్‌లో ఈ ఆప్షన్ ను తీసుకురానుంది. డేటా సేవర్ మోడ్‌లో చేయబోతున్న మార్పుల వల్ల అవసరమున్న సమాచారాన్నే డౌన్‌లోడ్ చేసుకునే వీలు కలుగుతుంది, దీనివల్ల మెసెంజర్‌లో వినియోగదారులు ఎంపిక చేసుకున్న ఫొటోలు, వీడియోలు మాత్రమే డౌన్‌లోడ్ అవుతాయి.అందువల్ల సాధ్యమైనంత మొబైల్ డేటాను సేవ్ చేసుకోవచ్చని సంస్థ చెబుతోంది.
అయితే మొబైల్ డేటా ద్వారా మెసెంజర్ యాప్‌ను వినియోగించినప్పుడు మాత్రమే ఈ సేవర్ మోడ్ పనిచేస్తుంది. వైఫై ద్వారా యాప్ తెరిస్తే మాత్రం ఈ మోడ్ పనిచేయదు. ప్రస్తుతం ఈ మోడ్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో ప్రయోగదశలో వుంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి