google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: చంద్రబాబు కుటుంబంపై ఆత్మాహుతి దాడి చేస్తాం !!

26, అక్టోబర్ 2016, బుధవారం

చంద్రబాబు కుటుంబంపై ఆత్మాహుతి దాడి చేస్తాం !!




విశాఖ మారణకాండ ఫలితాన్ని త్వరలోనే సీయం చంద్రబాబు అనుభవిస్తాడని మావోయిస్టు పార్టీ ఏపీ కమిటీ అధికార ప్రతినిధి శ్యామ్‌ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశాడు.

ఏవోబీ ఎన్‌కౌంటర్‌లో కోలుకోలేని దెబ్బతిన్న మావోయిస్టులు తీవ్రంగా స్పందించారు. ' లోకేష్, చంద్రబాబు మా నుంచి తప్పించుకోలేరు, అవసరమైతే చంద్రబాబు కుటుంబంపై ఆత్మాహుతి దాడి చేస్తాము, ఎల్లకాలం పోలీసులు, మిలట్రీ కాపాడలేరని మావోయిస్టులు తీవ్రంగా హెచ్చరించారు.

కోవర్టు ద్వారా అన్నంలో విషం కలిపి,  స్పృహతప్పిన మావోయిస్టులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని  శ్యామ్‌ ఆరోపించారు. పోలీసుల ఆధీనంలో ఉన్న మావోయిస్టులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  అవార్డులు, రివార్డుల కోసం పోలీసులు,మిలటరి కిరాయి హత్యలకు పాల్పడుతోందన్నారు.

అమరవీరుల త్యాగాలకు తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని,  రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తామని వారు చెప్పారు.

 2003 అక్టోబర్ 1న అలిపిరి వద్ద జరిగిన మందు పాతర దాడిలో చంద్రబాబు తృటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే.

మావోయిస్టుల ప్రకటనతో ఒక్కసారిగా రాష్ట్రం వేడెక్కింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి