బెర్ముడా ట్రయాంగిల్! ఈ పేరు వింటేనే అనేక కల్పితగాథలు.. కొన్ని దశాబ్దాలుగా శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని మిస్టరీ.
మియామీ, పోర్టారికో, బెర్ముడా ద్వీపానికి మధ్య ఉన్న బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతానికి రాగానే, అనేక నౌకలు, విమానాలు అదృశ్యమయి పోయాయి., దీనికి గల కారణాల కోసం అన్వేషణ కొనసాగుతోంది. కొన్ని శతాబ్దాలుగా ఇది అంతు చిక్కని రహస్యం. దీనిపై సినిమాలు వచ్చాయి, అనేక పుస్తకాలు రాయబడ్డాయి.
కానీ ఈ మిస్టరీని చేదించామని శాస్త్రవేత్తలు ప్రకటించారు.
బెర్ముడా ట్రయాంగిల్‌పై ఏర్పడే షడ్భుజాకార మేఘాలే ఈ మిస్టరీకి కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వారి సిద్ధాంతం ప్రకారం ఆ మేఘాలు గంటకు 273 కిలోమీటర్ల వేగంతో కదిలడం వల్ల, గాలి ఎయిర్ బాంబ్స్ లా మారుతుంది. ఈ ఎయిర్ బాంబ్స్ బెర్ముడా ట్రయాంగిల్ వద్ద పెను తుఫాన్ వంటి గాలి తీవ్రత ఏర్పరచి, విమానాలు, నౌకలు నీటిలో సులువుగా మునిగి పోయేలా చేస్తున్నాయని శాస్త్రవేత్త ర్యాండీ తెలిపారు.
రాడార్ శాటిలైట్ ఇమేజరీని ఉపయోగించి ఈ విషయాన్ని కనుగొన్నట్లు చెప్పారు.
ఈ ప్రాంతాన్ని డెవిల్స్ ట్రై యాంగిల్ అని కూడా అంటుంటారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి