google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: రష్యాలో హిట్లర్‌ రహస్య స్థావరం !

24, అక్టోబర్ 2016, సోమవారం

రష్యాలో హిట్లర్‌ రహస్య స్థావరం !



ప్రపంచాన్ని గడగడలాడించిన జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ అవశేషాలు ఇంకా పూర్తిగా మాసిపోలేదు.

 ఉత్తర ధ్రువానికి 1000 కిలోమీటర్ల దూరంలో పరిశోధకులు తవ్వకాలు జరుపుతుండగా,  జర్మన్‌ నియంత హిట్లర్‌కు చెందిన ఒక రహస్య స్థావరం బయటపడింది. కొన్ని దశాబ్దాలుగా ఎవరికీ తెలియని ఈ ప్రాంతాన్ని అలెగ్జాండ్రా ల్యాండ్‌ అని అంటారు.ఇది రష్యా భూభాగంలో ఉంది.

పరిశోధకుల త్రవ్వకాల్లో బంకర్లు, పెట్రోల్‌ డబ్బాలు,బుల్లెట్లు,షూలు లాంటివి 500 పైగా అవశేషాలు బయటపడ్డాయి. ఈ వస్తువులపై స్వస్తిక ముద్ర కూడా ఉందని పరిశోధకులు తెలిపారు.

 హిట్లర్‌ రష్యాపై దండయాత్ర చేసిన తర్వాత స్వీయ రక్షణ కోసం 1942లో ఈ రహస్య స్థావరాన్ని నిర్మించి ఉంటాడని భావిస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి