జనసేన అధినేత పవన్ కల్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాకేంద్రమైన ఏలూరులోనే ఓటు నమోదు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఆ జిల్లా నుంచి తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలు, నేతల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
త్వరలో ఆంధ్రప్రదేశె ప్రత్యేకహోదా విషయంలో నిర్ణయాత్మక పాత్ర పోషించాలని అడుగులువేస్తున్న పవన్ ఏలూరులో తన ఓటును నమోదుచేసేందుకు చర్యలు తీసుకోవాలని అక్కడి పార్టీ వర్గాల్ని కోరాడు.
ప్రస్తుతం ఆయనకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓటు హక్కు వుంది. కాగా ఏలూరులో నివాసానికి కూడా ఒక భవనాన్ని చూడాలని సూచించినట్టు తెలుస్తోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి