google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: ఠాక్రే డిమాండ్‌ ఒప్పుకోం!!

26, అక్టోబర్ 2016, బుధవారం

ఠాక్రే డిమాండ్‌ ఒప్పుకోం!!



మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎమ్‌ఎన్‌ఎస్‌) అధినేత రాజ్‌ ఠాక్రేకు  బిజేపి అగ్రనాయకులు షాక్ ఇచ్చారు.

‘యే దిల్‌ హై ముష్కిల్‌’ సవ్యంగా విడుదల కావాలంటే, ఆ చిత్ర నిర్మాతలు ఆర్మీ సంక్షేమ నిధికి రూ.5కోట్లతో పాటు, ఇంకెప్పుడూ తమ సినిమాల్లో పాక్ కళాకారులకు అవకాశం ఇవ్వమనే ఒప్పంద పత్రం ఇవ్వాలని చేసిన ఠాక్రే డిమాండ్‌ను కేంద్రమంత్రులు మనోహర్‌ పరీకర్‌, వెంకయ్య నాయుడు ఖండించారు.

ఎమ్‌ఎన్‌ఎస్‌ పార్టీది తప్పుడు ప్రతిపాదన అని, దీంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని వెంకయ్య అన్నారు. మరోవైపు ఠాక్రే ప్రతిపాదనను సమావేశంలో తాను అంగీకరించలేదని మహారాష్ట్ర సీఎం పడ్ణవీస్ తెలియచేసాడు.

ఆర్మీ సంక్షేమ నిధికి విరాళం కోసం ప్రభుత్వం ఎవరినీ బలవంత పెట్టదని పరీకర్‌ ఢిల్లీలో మంగళవారం స్పష్టం చేశారు. స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాలనే ఆర్మీ స్వీకరిస్తుందని పరీకర్ తేల్చి చెప్పాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి