కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటిస్తూ నిర్మించిన "ఇజం " ని బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో రీమక్ చెయ్యలని అనుకుంటున్నట్టు తెలిసింది.
పదిరోజుల క్రితం తెలుగులో రిలీజైన ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ కథాంశం బాలీవుడ్ ప్రేక్షకులకైతే నచ్చుతుందని దర్శకుడు పూరీ అనుకుంటున్నాడట.
ఇంతకుముందు పూరి జగన్నాథ్ సినిమా ‘పోకిరి’ ని బాలీవుడ్ లో ‘వాంటెడ్’ పేరుతో సల్మాన్ ఖాన్ హీరోగా రీమేక్ చేశారు. ఈమధ్య ‘బిజినెస్‌మేన్’, ‘టెంపర్’ కథల్ని అక్కడ రీమేక్ చేయాలని పూరి ప్రయత్నించినా ఎందుకో కుదర్లేదు.
బాలీవుడ్ చిత్రానికి కూడా కల్యాణ్‌రామ్ నిర్మాతగా వ్యవహరిస్తాడనీ, ఇందుకు సంబంధించి సల్మాన్‌ఖాన్‌తో సంప్రదింపులు మొదలెట్టారని సమాచారం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి