google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: డేటీంగ్ కి ట్రంపే పిలిచాడు!!

23, అక్టోబర్ 2016, ఆదివారం

డేటీంగ్ కి ట్రంపే పిలిచాడు!!



మహిళలతో లైంగికపరమైన పలు వివాదాల్లోకి  రిపబ్లికన్ అభ్యర్థి  డొనాల్డ్ ట్రంప్ మరింతగా కూరుకుపోతున్నాడు. ఎన్నికలు దగ్గరయ్యేకొద్దీ,  ట్రంప్ శృంగార జీవితం విశ్వరూపం దాలుస్తోంది.

తాజాగా సెక్సీ తార సల్మాహయక్ విషయంలో మరోసారి వార్తల్లోకి ఎక్కాడు.

కొంత కాలం క్రితం సల్మాహయక్  తనని డేటీంగ్ కి పిలిస్తే, తాను నిరాకరించానని చెప్పిన ట్రంప్ మాటలన్నీ సుద్ద అబద్దమని హయక్ వెల్లడీంచింది.

ఆమె మాటల్లోనే చెప్పాలంటే,  సల్మా అందానికి పడిపోయిన డొనాల్డ్ ట్రంప్, సల్మాహయక్ బాయ్ ఫ్రండ్ నుంచి ఆమె నెంబర్ తీసుకుని డేటింగ్‌కు రావాలని కోరారు. అయితే ఆమె డేటింగ్ చేయనంటూ తెగేసి చెప్పింది.

దాదాపు 10 మంది పైగా మహిళలతో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్, ఈ గండం నుంచి బయటపడ్డానికి  తెగ కష్టపడుతున్నారు. మీటింగ్ పెట్టిన ప్రతి చోట తాను ఏ మహిళను వేధించలేదని చెప్పడానికే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాడు. ఓ మీటింగ్ లో అలాంటి సందర్భంగానే  గతంలో సల్మాహయక్ తనను డేటింగ్‌కు రమ్మని ఆహ్వానించిందని, కానీ మహిళలపై తనకు ఎంతో  గౌరవం ఉండడంతో సల్మా ఆహ్వానాన్ని తోసిపుచ్చానంటూ ట్రంప్ వివరించాడు.

ట్రంప్ కామెంట్స్‌తో  కోపం వచ్చిన సల్మాహయక్ ఇలా బయటకొచ్చి, ట్రంప్ ని కడిగిపారేసింది. తనను డేటింగ్‌కు పిలిచిన వ్యక్తే తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించింది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి