ఉగ్రవాదులకు ఐఎస్ఐ సహకారంఇలాగే కొనసాగుతూ వుంటే చూస్తూ ఊరుకోబోమని, పాకిస్థాన్‌లోని ఉగ్రవాద మూకలపై ఒంటరిగా దాడి చేయడానికి వెనుకాడేది లేదని అమెరికా తీవ్రంగా హెచ్చరించింది.
ఉగ్రవాదానికి ఆర్థిక సాయాన్ని నిరోధించే శాఖకు కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆడం జుబిన్ ఈ హెచ్చరిక చేశారు. పాకిస్థాన్ ప్రభుత్వంలోనూ, ముఖ్యంగా ఐఎస్ఐలోనూ వున్న బలమైన శక్తులు తమ భూభాగం నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థలపై అదుపులేకుండా వుండటమే సమస్య గా మారిందని ఆయన అన్నారు.
ఉగ్రవాదులకు నిధులు, ఇతర సహకారాలను అడ్డుకోవడంలో పాకిస్థాన్‌తో కలిసి పనిచేయడానికి తామెపుడూ సిద్దమేనని. అయితే ఈ నెట్‌వర్క్‌లను ధ్వంసం చేయవలసిన అవసరం ఏర్పడితే ఒంటరిగా కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడమని తేల్చి చెప్పారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి