google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: కరణ్ జోహర్ కాళ్ళబేరానికి..

22, అక్టోబర్ 2016, శనివారం

కరణ్ జోహర్ కాళ్ళబేరానికి..



విడుదలకు తీవ్ర నిరశనలు, కష్టాలు ఎదురవుతూ వుండటంతో, ‘యే దిల్‌ హై ముష్కిల్‌’ నిర్మాతలు దిగొచ్చినట్టే కనిపిస్తోంది.

ఈ మేరకు నిన్న, చిత్ర దర్శక నిర్మాతలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన(ఎంఎన్‌ఎస్‌) అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రేలతో  సమావేశమయ్యారు.

 పాకిస్థాన్‌ నటులతో మరోసారి కలిసి పనిచేయబోమని, భవిష్యత్‌ చిత్రాల్లో వారిని తీసుకోబోమని  ‘యే దిల్‌ హై ముష్కిల్‌’ నిర్మాతలు వారికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

అంతేగాక, దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజవాన్లకు నివాళిగా  సినిమాకు ముందు ఓ సన్నివేశాన్ని ప్రసారం చేయనున్నట్లు ముఖేశ్‌ భట్‌ తెలిపారు. చిత్రం విడుదలకు సీఎం ఫడణవీస్‌ సానుకూలంగా స్పందించారని చిత్రం యూనిట్ తెలియజేసింది.

 ఉరీ ఉగ్రదాడి నేపథ్యంలో భారతీయ సినిమాల్లో పాక్‌ నటీనటులను నిషేధించాలంటూ ఆందోళనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. మామూలుగా ఐతే ఈ మూవీకి ఎలాంటి ఇబ్బందులు వుండేవి కాదు. కానీ, కరణ్‌ జోహార్‌ కాస్త పాక్ కళాకారులవైపు సానుకూలంగా మాట్లాడ్డంతో యే దిల్‌ హై ముష్కిల్‌ విడుదలకు కష్టాలు ఎదురయ్యాయి.

రణబీర్‌ కపూర్‌, ఐశ్వర్యరాయ్‌, అనుష్క శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో పాక్‌ నటుడు ఫవాద్‌ ఖాన్‌ కూడా నటీంచడంతో, దీంతో ఈ చిత్ర విడుదలను నిలిపివేయాలని మహారాష్ట్ర నవనిర్మాణ్‌సేన సహా,పలువురు పిలుపునిచ్చారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి