google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: ఎక్కువమంది పిల్లల్ని కనండి!!

24, అక్టోబర్ 2016, సోమవారం

ఎక్కువమంది పిల్లల్ని కనండి!!





తరచూ వివాస్పద వ్యాఖ్యలతో వార్తలలో నిలిచే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మతాన్ని కాపాడుకోవడానికి హిందువులంతా ఎక్కువ మంది పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. మతం మనల్ని కాపాడేటప్పుడు, మతాన్ని మనం కాపాడుకోవాలని, అందుకోసం దేశంలోని హిందువులు తమ జనాభాను పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

దేశంలో రామభక్తులే లేకపోతే రామాలయం ఎలా కట్టగలుగుతాం' అని, అయోధ్య రామమందిరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ప్రశ్నించారు. సహరాన్‌పూర్ జిల్లా దేవ్‌బాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో గిరిరాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశ విభజన సమయంలో పాకిస్తాన్‌లో హిందూ జనాభా 22 శాతం ఉండగా ఇప్పుడు కేవలం ఒక్క శాతమే ఉందనీ, అప్పట్లో ఇండియాలో హిందువుల జనాభా 90 శాతం ఉండగా ఇప్పుడు 76 శాతానికి తగ్గిపోయిందని, 10 శాతంగా ఉన్న ముస్లిం జనాభా ఇప్పుడు 24 శాతానికి పెరిగిందని ఆయన గణాంకాలు వివరించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి