పాకిస్థాన్ నటులను వెనకేసుకొచ్చిన బాలీవుడ్ ప్రముఖులను స్టార్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చీల్చి చెండాడాడు.
సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్థాన్‌నటులకు మద్దతు ఇవ్వడం క్షమించరాని నేరమని అన్నాడు. దేశం కంటే సినిమాలు, క్రికెట్ గొప్పవి కావనీ, దేశం తర్వాతే ఏదైనా తేల్చి చెప్పాడు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉగ్రవాదుల దాడిలో మీ అన్నో, తమ్ముడో మరణించి ఉంటే అలాగే వెనకేసుకొచ్చేవారా అని ప్రశ్నించాడు. పాక్ బుద్ధి మారేవరకు ఆ దేశంతో అన్ని సంబంధాలను తెగదెంపులు చేసుకోవాలని, ఏసీ రూముల్లో కూర్చుని అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని గంభీర్ స్పష్టం చేసాడు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి